Search
  • Follow NativePlanet
Share
» »మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

ఎవరైతే సాహసాలను మరియు నీటి క్రీడలను అమితంగా ఇష్టపడతారో వారికి మార్చి నెల ఉత్తమమైనది. ఈ నెలలో భారతదేశం అంతటా వాతావరణం ప్రశాంతంగా ఉండి, సెలవులు వస్తే పర్యటనలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.

భారత దేశంలో ఇన్ని ప్రదేశాలు ఉన్నప్పటికీ మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు కొన్నే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీకు కావలసినంత వినోదాన్ని, విశ్రాంతిని పొందవచ్చు. వాటిలో హిల్ స్టేషన్ లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, విహార ప్రదేశాలు .. ఇలా అన్ని రకాల తరగతులకు చెందినవి ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మార్చి నెలలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చూసెద్దాం పదండి.

బృందావనం

బృందావనం

బృందావనం ఎలా చేరుకోవాలి ?

బృందావనం చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

బృందావనం కు సమీపాన ఉన్న విమానాశ్రయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 150 కిలోమీటర్ల దూరంలో ఉండి, మూడు గంటల్లో చేరుకొనే విధంగా ఉంటుంది. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని బృందావనం చేరుకోవచ్చు.

రైలు మార్గం

బృందావనం లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ ( 11 కి. మీ. దూరంలో) మథుర రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి దేశంలోని ఢిల్లీ, లక్నో, వారణాసి, ముంబై వంటి నగరాలకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి బృందావనం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ మరియు మథుర వంటి పట్టణాల నుండి బృందావనం క్షేత్రానికి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Sreeram Nambiar

బృందావనం

బృందావనం

బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశం. కనుక ఇది హిందువుల పుణ్య క్షేత్రం గా ఖ్యాతి గడించింది. బృందావనంలో భాగవతం గురించి చాటి చెప్పే 5000 ఆలయాలు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

చిత్ర కృప : sureshnarsimhan

బృందావనం

బృందావనం

బృందావనం లో చూడవలసినవి : బంకే బిహారీ ఆలయం, గోవింద్ దెఒ ఆలయం, ఇస్కాన్ ఆలయం, మదన మోహన్ ఆలయం, కేసి ఘాట్, జైపూర్ ఆలయం, గోపెశ్వర మహదేవ్ ఆలయం, రంగ్జీ ఆలయం, రాధాగోకులానంద అలాయం, రాధా రామన్ ఆలయం, షాహ్జి ఆలయం.

చిత్ర కృప : cat_collector

ద్వారకా

ద్వారకా

ద్వారకా ఎలా చేరుకోవాలి ?

ద్వారకా చేరుకోవటానికి రోదు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

ద్వారకాకి 127 కి. మీ. దూరంలో ఉన్న జామ్నగర్ దేశీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి ద్వారకా కి చేరుకోవచ్చు.

రైలు మార్గం

ద్వారకా లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది అహ్మదాబాద్ - ఓఖా రైలు మార్గం లో కలదు. ఈ రైల్వే స్టేషన్ నుండి ముంబై, గాంధీనగర్, పూణే, నాగ్‌పూర్ వంటి నగరాలకు, దేశంలోని ఇతర ముఖ్య పట్టణాలకు ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

ద్వారకా పట్టణానికి బస్సుల ద్వారా జామ్నగర్ మరియు అహ్మదాబాద్ నుండి సులభంగా హైవే రోడ్డు గుండా చేరుకోవచ్చు. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా ఈ పవిత్ర నగరానికి రాష్ట్రం నలుమూలల నుండి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Abhinav Phangcho Choudhury

ద్వారకా

ద్వారకా

ద్వారకా భారతదేశంలో ఉన్న ప్రాచీన 7 నగరాల్లో ఒకటి. ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. ఆయన హయాంలో ఈ రాజ్యం సిరిసంపదలతో, అష్టైశ్వర్యాలతో తలతూగీంది. శ్రీకృష్ణుని మరణానంతరం తరువాత ఒక పెద్ద వరద ముంచెత్తడంతో ఈ రాజ్యం పూర్తిగా తుడుచి పెట్టుకపోయింది. అయినా అరేబియా సముద్రంలో అడుగు భాగంలో అలనాటి రాజ్య కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయని భక్తుల నమ్మకం.

చిత్ర కృప : Jimish Patel

ద్వారకా

ద్వారకా

ద్వారకా లో చూడదగ్గవి : బెయ్ట్ ద్వారకా, ద్వారకాదీష్ ఆలయం, ఘుమ్లి, గోపి తలవ్, హనుమాన్ ఆలయం, గోమతి ఘాట్ ఆలయాలు, రుక్మిణీదేవి ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, భలక తీర్థ మరియు దేహోత్సార్గ్ మరియు గొప్నాథ్ మహదేవ్ ఆలయాలు మొదలగునవి.

చిత్ర కృప : Poonam Agarwal

రిశికేష్

రిశికేష్

రిశికేష్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

డెహ్రాడున్ లోని జాలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రిషికేశ్ కు దగ్గర లోని ఏర్‌పోర్ట్. ఇది ఇక్కడికి 18 కి. మీ. దూరంలో ఉన్నది. ఢిల్లీలోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఏర్‌పోర్ట్ దీనికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ ఏర్‌పోర్ట్. అక్కడి నుండి భారత దేశపు ముఖ్య నగరాలకు ఫ్లైట్స్ లభిస్తాయి. పర్యాటకులు క్యాబ్ లను అద్దెకు తీసుకొని ఇక్కడికి రావచ్చు.

రైలు మార్గం

రిషికేశ్ లోని రైల్వే స్టేషన్ భారత దేశపు ఢిల్లీ, ముంబై, కోట్ద్వార్ మరియు డెహ్రాడున్ వంటి ముఖ్య నగరాలను కలుపుతుంది. ఇది నగరానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.

రోడ్డు మార్గం

రిషికేశ్ దగ్గరలోని ఢిల్లీ, డెహ్రాడున్, మరియు హరిద్వార్ వంటి నగరాలకు బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నది. ఈ నగరాల ప్రైవేటు లేదా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Josh Friedman

రిశికేష్

రిశికేష్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో కు చెందినది రిశికేష్ పట్టణం. పవిత్ర గంగా నది ఒడ్డున వెలసిన ఈ పట్టణాన్ని 'దేవ భూమి' అని పిలుస్తారు. శివుడు సతీదేవి శరీరాన్ని కైలాసం తీసుకెళ్తుండగా, దేవి యొక్క పైభాగం ఇక్కడ పడిందని భక్తుల నమ్మకం. ఇదొక్కటే కాదు రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ తపస్సు చేసినట్టు మరియు అతని తమ్ముడు లక్షణుడు గంగా నదిని దాటినట్టు పురాణ సంబంధిత కథనాలు చెబుతున్నాయి.

చిత్ర కృప : meg and rahul

రిశికేష్

రిశికేష్

రిశికేష్ లో చూడదగ్గవి : లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా, త్రివేణీ ఘాట్, భారత్ మందిర్, గీతా భవన్, లక్ష్మణుడి ఆలయం, కున్జపురి దేవి ఆలయం, నీల్‌కాంత్ మహాదేవ ఆలయం మొదలగునవి. వీటితో పాటు ఆశ్రమాలు, యోగా సెంటర్లు, గంగానది తీరాన ఘాట్ లు కూడా చూడదగినవే ..!

చిత్ర కృప : Jaskirat Singh Bawa

ఆగ్రా

ఆగ్రా

ఆగ్రా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ఆగ్రా సొంత విమానాశ్రయాన్ని కలిగి ఉన్నది. దాని పేరు ఖేరియా విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నగరం నుండి 5 కి. మీ. దూరంలో ఉండి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను అందిస్తున్నది.

రైలు మార్గం

ఆగ్రా చక్కటి రైల్వే వ్యవస్థ ను కలిగి ఉన్నది. ఈ నగరం ఏడు రైల్వే స్టేషన్ లను కలిగి ఉన్నాప్పటికీ, అందులో మూడు ప్రధాన రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. సమీపాన 25 కిలోమీటర్ల దూరంలో తుండ్ల జంక్షన్ కూడా ఉన్నది. ఇక్కడి నుండి ఢిల్లీ, కాన్పూర్, లక్నో, వారణాసి వంటి నగరాలకు ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

ఆగ్రా చక్కటి రోడ్డు మార్గాలను కలిగి ఉన్నది. ఈ నగరం గుండా మూడు జాతీయ రహదారులు ( ఎన్ హెచ్ 1, ఎన్ హెచ్ 3, ఎన్ హెచ్ 11), రాష్ట్ర రహదారులు వెళతాయి. ప్రభుత్వ , ప్రవేట్ సంబంధిత వోల్వా, లగ్జరీ బస్సులు సమీప ప్రాంతాల నుండే కాకుండా ఢిల్లీ నుండి కూడా ఆగ్రా కు వస్తుంటాయి.

చిత్ర కృప : Honzasoukup

ఆగ్రా

ఆగ్రా

ఆగ్రా షాజాహాన్ ముంతాజ్ కోసం కట్టించిన తాజ్‌మహల్ స్మారక కట్టడానికి ప్రసిద్ధి చెందినది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ యునెస్‌కో సంస్థ చేత ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించబడింది. ఇక్కడి తాజ్ మహల్ చూడటానికి దేశ, విదేశాల నుండి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో యాత్రికులు తరలి వస్తుంటారు.

చిత్ర కృప : Dennis Jarvis

ఆగ్రా

ఆగ్రా

ఆగ్రా లో దిగి దిగగానే సరాసరి వెళ్ళి చూడవలసినది తాజ్ మహల్. ఆతరువాత ఆగ్రా కోట, బాగేశ్వర్ నాథ్ ఆలయం, చౌసట్ ఖంబా, దయాల్ బాగ్, గురు కా తల్, జహంగీర్ మహల్, పంచ్‌ మహల్ మొదలగునవి చూడదగ్గవి.

చిత్ర కృప : Sanyam Bahga

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్ ఎలా చేరుకోవాలి ?


అండమాన్ నికోబార్ చేరుకోవాలంటే విమాన మార్గం, జల మార్గం ద్వారానే చేరుకోవాలి

విమాన మార్గం

అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో విమానాశ్రయం ఉన్నది. చెన్నై, కలకత్తా, విశాఖ పట్టణం నుండి పోర్ట్ బ్లెయిర్ కు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అక్కడ దిగి స్థానిక బస్సులు లేదా ప్రవేట్ వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకోవచ్చు.

జల మార్గం / సముద్ర మార్గం

చెన్నై, కలకత్తా, వైజాగ్ పోర్ట్ ల నుండి అండమాన్ నికోబార్ దీవులకు ఫెర్రీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జల మార్గం చౌకై నది కానీ ప్రయాణానికి సమయం ఎక్కవ తీసుకుంటుంది. ప్రయాణంలో ఎన్నో అనుభూతులను మీరు పొందవచ్చు.

చిత్ర కృప : mamta tv

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్ దీవులు బీచ్ లకు, సముద్రపు ఆహారాలకు, నీటి క్రీడలకు ప్రసిద్ధి చెందినది. గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాల్లో తిరగాలంటే అండమాన్ వెళ్ళవలసినదే ..!

చిత్ర కృప : Dr. K. Vedhagiri

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్

అండమాన్ దేవుల్లో చూడదగ్గవి : పోర్ట్ బ్లెయిర్, హేవ్ లాక్ ఐలాండ్, గ్రేట్ నికోబార్. పోర్ట్ బ్లెయిర్ లో జాలీ బాయ్, రాస్ ద్వీపం, వైపర్ దీవి, బారెన్ దీవి చూడవచ్చు. గ్రేట్ నికోబార్ లో ఇందిరా పాయింట్, టిల్లన్ చోంగ్ లు చూడవచ్చు.

చిత్ర కృప : Ankur P

అండమాన్ నికోబార్

అండమాన్ నికోబార్

అండమాన్ దీవుల్లో స్కూబా వంటి నీటి క్రీడలు ఆడవచ్చు. దట్టమైన అరణ్యాల్లో విహరించవచ్చు. వందలాది విభిన్న జాతుల పక్షులను, అందమైన పూలను చూడవచ్చు. సముద్రపు ఆహారాలు ఇష్టపడే వారైతే సమీప హోటల్లో ఆర్డర్ ఇచ్చి ఆరగించవచ్చు కూడా.

చిత్ర కృప : Andamannicobar tourism

హంపి

హంపి

హంపికి ఎలా వెళ్ళాలి??

హంపి కి సమీపాన ఉన్న బళ్ళారి ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్నది. దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి.

విమానాశ్రయం

హంపికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం బళ్ళారి మరియు బెల్గాం. ఈ రెండు విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడుపుతుంటారు.

రైల్వే స్టేషన్

హంపికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ హోస్పేట్. ఈ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు వెళుతుంటాయి.

రోడ్డు మార్గం

బళ్లారి నుండి హోస్పేటకు 60 కిలో మీటర్లు. హోస్పేట నుండి హంపి 13 కిలో మీటర్లు. ప్రైవేట్ వాహనాలు హోస్పేట్ నుంచి ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసపడతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు.

చిత్ర కృప : Vinoth Chandar

హంపి

హంపి

హంపి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్య అందాలు, కట్టడాలు, వైభోగాలు. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. హోయసుల కాలం నాటి శిల్ప సంపద తో పాటు అనేక రాతి కట్టడాలు సందర్శకులకు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. తుంగభద్ర నది ఒడ్డున గల హంపి యునెస్కో సంస్థ చేత ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించబడింది.

చిత్ర కృప : Jean-Pierre Dalbéra

హంపి

హంపి

హంపి లో చూడదగినవి : బడవ లింగం, హజార రామా దేవాలయం ,లోటస్ దేవాలయం, శశివేకాలు గణేశ దేవాలయం, మహానవమి దిబ్బ, ఆంజనేయ స్వామి ఆలయం, ఎడూరు బసవన్న ఆలయం, అనెగుండి, ఆంజనాద్రి హిల్స్, చంద్రమౌలీశ్వర దేవాలయం మొదలగునవి.

చిత్ర కృప : Leon Yaakov

గోవా

గోవా

గోవా ఎలా చేరుకోవాలి ?

గోవా చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి

విమాన మార్గం

గోవాలో ఉన్న విమానాశ్రయం డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం. దేశ, విదేశాల నుండి ఈ విమానాశ్రయానికి తరచూ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లేదా సిటీ బస్సులో ప్రయాణించి గమ్య స్థానాలకు చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోవా దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో, పట్టణాలతో చక్కగా అనుసంధానించబడింది. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

గోవా చక్కటి రోడ్డు వ్యవస్థ ను కలిగి ఉన్నది. సమీప ముంబై నుండి నిత్యం ప్రజారవాణా అందుబాటులో ఉన్నది. అలాగే హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల నుండి కూడా ప్రవేట్ మరియు ప్రభుత్వ వోల్వా, లగ్జరీ బస్సులు నిత్యం గోవా కు తిరుగుతుంటాయి.

జల మార్గం / సముద్ర మార్గం

గోవా కు భారత దేశం పశ్చిమ తీర ప్రాంతాల నుండి ఫెర్రీ ల ద్వారా చేరుకోవచ్చు. అలాగే ఇతర దేశాల నుండి కూడా షిప్ ల మీద ప్రయాణించి గోవా చేరుకోవచ్చు ( ఆఫ్రికా, పశ్చిమ ఆసియా).

చిత్ర కృప : Premnath Thirumalaisamy

గోవా

గోవా

గోవా ఒక అందమైన సముద్ర తీర ప్రాంతం. ఇక్కడ లెక్కలేనన్ని బీచ్ లు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇక్కడి వాతావరణానికి ముగ్ధులైపోతారు. ముఖ్యంగా యువత బీచ్ ల వద్ద నీటి క్రీడలను ఆడుతూ ఆనందాన్ని పొందుతుంటారు. ఇక్కడి బీచ్ ప్రదేశాలన్నీ కూడా బ్యాంకాక్, ఇబిజ వంటి ప్రదేశాలకు ఏమాత్రం తక్కువ కావు.

చిత్ర కృప : Aleksandr Zykov

గోవా

గోవా

గోవా లో చూడదగినవి : మార్గోవా, పనాజీ, కండోలిం బీచ్, అరంబోల్ బీచ్, సిన్కెరిమ్ బెచ్, మిరామర్ బీచ్, కోల్వా బీచ్, వర్కా బీచ్, బిటల్ బీచ్, బాగా బీచ్, కాలన్ గూటే బీచ్ , సియోలిమ్, అగుడా మొదలగునవి.

చిత్ర కృప : ddasedEn

గోవా

గోవా

గోవా లో చేయవలసినవి : బీచ్ ఒడ్డున సముద్రపు ఆహారాలు ఆరగించడం, చవకగా లభించే మద్యాన్ని సేవించడం(ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం), రాత్రి పొద్దుపోయేవరకు పబ్ లలో, నైట్ క్లబ్ లలో, రోడ్ సైడ్ పార్టీలలో సంగీతాన్ని వింటూ ఉర్రూతలూగటం, షాపింగ్ లు, నీటి క్రీడలు ఆడటం, మైండ్ రిలీఫ్ కొరకు మసాజ్ వంటివి చేయించుకోవటం.

చిత్ర కృప : Coconut Water

జైపూర్

జైపూర్

జైపూర్ ఎలా చేరుకోవాలి ?

జైపూర్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన నార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

జైపూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో జైపూర్ అంతర్జాతీయ విమానశ్రయ౦గా పిలువబడే సంగానేర్ విమానాశ్రయం ఉంది. ముంబాయి, చండీఘడ్, ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూర్ వంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇక్కడ నుండి నిరంతరం విమానాలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

జైపూర్ లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

న్యూ ఢిల్లీ నుండి నేరుగా జైపూర్ వరకు ఆర్ ఎస్ ఆర్ టి సి బస్సులు ఉన్నాయి. నగరంలో పర్యటించాలనుకంటే సిటి బస్సు సౌకర్యం ఉత్తమమైనది.

చిత్ర కృప : Xiquinho Silva

జైపూర్

జైపూర్

భారతదేశ పురాతన నగరాలలో ఒకటైన జైపూర్ నగరం, 'పింక్ సిటీ' గా ప్రసిద్ధి చెందినది. ఈ సుందర నగరాన్ని రెండవ సవాయి జై సింగ్ మహారాజు నిర్మించాడు. హిందూ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ నగర కట్టడం ఉత్సవాలకు, పండుగలకు ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Abhishek Shirali

జైపూర్

జైపూర్

జైపూర్ లో చూడవలసినవి : సిటీ ప్యాలెస్, జై ఘర్ ఫోర్ట్, జమ్వారాంగర్, జంతర్ మంతర్, లక్ష్మి నారాయణ్ ఆలయం, ఆల్బర్ట్ హాల్, అక్షర్ ధాం ఆలయం, నాహర్ గర్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్ మొదలగునవి

చిత్ర కృప : McKay Savage

జైపూర్

జైపూర్

జైపూర్ లో విరామం దొరికితే ఒంటె ల మీద స్వారీ, హాట్ ఏర్ బెలూనింగ్, పారా గ్లైడింగ్, పర్వతారోహణ వంటి క్రీడలతో ఆనందించవచ్చు. షాపింగ్ చేయవచ్చు. జైపూర్ వంటకాలైన దాల్ బాటి - చూర్మా, ఉల్లి కచోరి, కబాబ్, ముర్గ్ కో ఖాటో, అచారి ముర్గ్ రుచి చూడవచ్చు.

చిత్ర కృప : John Haslam

హరిద్వార్

హరిద్వార్

హరిద్వార్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

హరిద్వార్ కు సమీపాన ఉన్న ఎయిర్ పోర్ట్ డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ . ఇది సుమారు 34 కి. మీ. ల దూరం లో కలదు. ఈ విమానాశ్రయం నుండి టాక్సీ లలో హరిద్వార్ చేరవచ్చు.

రైలు మార్గం

హరిద్వార్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. సిటీ నుండి సుమారు ఒక కిలో మీటర్ దూరం లో ఈ రైల్ స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం

హరిద్వార్ కు సమీప ప్రాంతాల నుండి ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి హరిద్వార్ కు ప్రతి రోజు లగ్జరీ బస్సులు, వోల్వా బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : World8115

హరిద్వార్

హరిద్వార్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ 'దేవతలకు ప్రవేశ ద్వారం' వంటిది. ఈ నగరం హిందువులకు పవిత్ర యాత్రా స్థలం. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ దేవాలయాలు, మత కేంద్రాలు ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాల కొకసారి జరిగే ' కుంభమేళా' కు ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు.

చిత్ర కృప : Barry Silver

హరిద్వార్

హరిద్వార్

హరిద్వార్ లో చూడవలసినవి : మానసా దేవి ఆలయం, హర కి పురి, భారత్ మాతా మందిర్, పవన్ ధాం, మాయా దేవి ఆలయం, దక్ష మహదేవ్ ఆలయం, చండీ దేవి ఆలయం, గౌరీశంకర్ మహాదేవ ఆలయం, వైష్ణో దేవి ఆలయం మొదలగునవి. ఆశ్రమాలు, యోగా కేంద్రాలు కూడా ఇక్కడ చూడవలసినవే ..!

చిత్ర కృప : ramesh Iyanswamy

ఖజురహో

ఖజురహో

ఖజురహో ఎలా చేరుకోవాలి ?

ఖజురహో చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

ఖజురహో పట్టణానికి సమీపాన 5 కి. మీ. దూరంలో విమానాశ్రయం ఉన్నది. అక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. క్యాబ్ లేదా ట్యాక్సీ ల మీదుగా ఖజురహో సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఖజురహో లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడికి కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 73 కి. మీ. దూరంలో ఉన్న మహోబా రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్లు లభ్యమవుతాయి. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఖజురహో చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ఖజురహో చక్కటి రోడ్డు వ్యవస్థ ను కలిగి ఉన్నది. గ్వాలియర్, మహోబా, భోపాల్, ఇండోర్ మొదలగు ప్రాంతాల నుండి ఖజురహో కు ఏసీ, నాన్ ఏసీ బస్సులు లభిస్తాయి.

చిత్ర కృప : Lord of the Wings©

ఖజురహో

ఖజురహో

ఎపుడైనా ఒక్కసారి మన పూర్వీకుల జీవన విధానం ఎలా వుండేది అనేది గమనించారా ? అలాగానుకుంటే, ఒక్కసారి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కల ఖజురాహో పట్టణానికి వెళ్ళండి. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో అనేక పురాతన హిందూ మరియు జైన టెంపుల్స్ కలవు. ప్రారంభంలో ఈ గుడులు మొత్తంగా 85 ఉండేవి. కాని నేడు అవి 22 గా మాత్రమే మిగిలాయి.

చిత్ర కృప : Patty Ho

ఖజురహో

ఖజురహో

ఖజురహో లో చూడదగ్గవి : చిత్ర గుప్త దేవాలయం, దేవి జగదాంబ ఆలయం, జావారి దేవాలయం, దుల్హ దేవ్ దేవాలయం, కండారియా దేవాలయం, లక్ష్మణ్ దేవాలయం, లక్ష్మి దేవాలయం, విశ్వనాథ, ఆదినాథ ఆలయాలు, బ్రహ్మ, చతుర్ముఖ ఆలయాల తో పాటు మ్యూజియాలు, కోటలు.

చిత్ర కృప : Pedro

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

రామేశ్వరానికి సమీపాన ఉన్న విమానాశ్రయం మధురై విమానాశ్రయం. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వాహనాలను అద్దెకు తీసుకొని రామేశ్వరం చేరుకోవచ్చు.

రైలు మార్గం

రామేశ్వరం లో రైల్వే స్టేషన్ ఉన్నది. మధురై, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ప్రాంతాల నుండి రామేశ్వరం కు నేరుగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

రామేశ్వరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో చక్కగా రోడ్డు మార్గంతో కలుపబడి ఉన్నది. చెన్నై, మధురై, తిరువనంతపురం, కన్యాకుమారి, కోయంబత్తూర్ వంటి ప్రాంతాల నుండి నేరుగా రామేశ్వరానికి బస్సు సర్వీసులు కలవు.

చిత్ర కృప : Belur Ashok

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో మంత్రముగ్ధులను చేసే పంబన్ ద్వీపం యొక్క భాగం. పురాణాల ప్రకారం రామేశ్వరంను విష్ణుమూర్తి యొక్క ఏడవ ఆవతారంగా భావిస్తారు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ కలదు. ఈ పవిత్ర స్థలాన్ని చార్ ధాం యాత్ర లో భాగంగా యాత్రికులు దర్శిస్తుంటారు.

చిత్ర కృప : PalashKatiyar

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం లో చూడదగినవి : శ్రీ రామనాథస్వామి ఆలయం, పంచముఖ హనుమాన్ ఆలయం, ఆడమ్ బ్రిడ్జ్, అరియమాన్ బీచ్, అగ్ని తీర్థం, కోదండరామ ఆలయం మరియు ఇతరములు.

చిత్ర కృప : Jagadip Singh

లక్షద్వీప్

లక్షద్వీప్

లక్షద్వీప్ ఎలా చేరుకోవాలి ?

లక్షద్వీప్ చేరుకోవటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి వాయు మరియు జల మార్గాలు

వాయు మార్గం

అగట్టి లో విమానాశ్రయం ఉన్నది. సమీప కొచ్చిన్ నుండి విమానాలలో అగట్టి చేరుకోవటానికి గంటన్నార సమయం పడుతుంది. లోకల్ గా తిరగటానికి ఆటో రిక్షాలు, క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

సముద్ర మార్గం

సముద్రం మార్గం ద్వారా ఆగట్టి చేరుకోవటానికి కొచ్చి నుండి ప్రతిరోజు ఫెర్రి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణ ధర 850 రూపాయల నుండి 1250 రూపాయల వరకు ఉంటుంది. ఫెర్రి లో రకరకాల తరగతులు ఉంటాయి వాటిలో ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్, లగ్జరీ వంటివి ఉన్నాయి. ప్రయాణ సమయం 15 నుండి 20 గంటలు పడుతుంది.

చిత్ర కృప : Julio

లక్షద్వీప్

లక్షద్వీప్

లక్షద్వీప్ భారతదేశానికి చెందిన కేంద్ర పాలిత్ర ప్రాంతం. ప్రత్యేకించి బీచ్ ల వెంట చక్కర్లు కొట్టి ఆనందించాలనుకొనేవారికి ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ దీవులలో లభించే సముద్రపు ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

చిత్ర కృప : icultist

లక్షద్వీప్

లక్షద్వీప్

లక్ష ద్వీప్ లో చూడదగినవి : ఆగట్టి ద్వీపం, అమిని ద్వీపం, బంగారం బీచ్, కవరత్తి, కల్పేని ద్వీపం, మానిక్ ఐలాండ్, సుహేలి పార్ మొదలగునవి. వీటితో పాటు అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్కు తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్సు పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Manvendra Bhangui

చెన్నై

చెన్నై

చెన్నై ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

చెన్నై లో అన్నా ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు, సింగపూర్, మయన్మార్, జపాన్ వంటి పాశ్చాత్య దేశాల నుండి కూడా విమాన సర్వీసులు చెన్నై కు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

చెన్నై లో సెంట్రల్, ఎగ్మోర్ మరియు తంబరం అనే మూడు రైల్వే స్టేషన్ లు కలవు. ఈ మూడు రైల్వే స్టేషన్ ల నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

చెన్నై దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి చక్కటి రోడ్డు మార్గాన్ని కలిగి ఉన్నది. పవిత్ర పుణ్య క్షేత్రం అయిన తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, మధురై, విజయవాడ, వైజాగ్, గుంటూర్, కర్నూల్, కన్యాకుమారి, కోయంబత్తూర్ మొదలగు ప్రాంతాల నుండి వోల్వో, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నల, ఇంద్ర వంటి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Secondarywaltz

చెన్నై

చెన్నై

చెన్నై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరాలలో ఒకటి మరియు తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది దక్షిణ భారత దేశ సాంస్కృతిక రాజధాని. ఇక్కడి వారు 'భాష' కు ఇచ్చే గౌరవం అంత ఇంత కాదు. లోకల్ గా సందర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి.

చిత్ర కృప : Vinoth Chandar

చెన్నై

చెన్నై

చెన్నై లో చూడదగినవి : బీసెంట్ నగర్ బెచ్, మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్, జగన్నాథ ఆలయం ,మురుగన్ ఆలయం, కపాలీశ్వర్ ఆలయం, కాళికాంబాల్ ఆలయం, శాంతోం చర్చి, నగర శివార్లలోని నవగ్రహ ఆలయాలు మొదలగునవి. వీటితో పాటు మాల్స్, పార్కులు, వన్య ప్రాణుల కేంద్రాలు, బిర్లా ప్లానిటోరియం కూడా చూడవలసినవి.

చిత్ర కృప : Thangaraj Kumaravel

షిల్లాంగ్

షిల్లాంగ్

షిల్లాంగ్ చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం

షిల్లాంగ్ పట్టణానికి సమీపాన ఉన్న ఏర్ పోర్ట్ గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది దాదాపు 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి షిల్లాంగ్ కు రోజువారీ ట్యాక్సీ లు, క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

షిల్లాంగ్ కు ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన చిన్నా చితక స్టేషన్ లు ఉన్నప్పటికీ గౌహతి రైల్వే స్టేషన్ ప్రధానంగా చెప్పుకోవాలి. అక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు సులభంగా ప్రయాణించవచ్చు.

బస్సు మార్గం

షిల్లాంగ్ - గౌహతి చక్కటి రోడ్డు మార్గాన్ని(జాతీయ రహదారి) కలిగి ఉన్నది. గౌహతి నుండి మరియు సమీప పట్టణాల నుండి షిల్లాంగ్ కు ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Vikramjit Kakati

షిల్లాంగ్

షిల్లాంగ్

షిల్లాంగ్ పట్టణాన్ని 'తూర్పు భారత దేశ స్కాట్ ల్యాండ్' అని పిలుస్తారు. మేఘాలయ రాష్ట్రానికి రాజదాని అయిన షిల్లాంగ్ చల్లని వాతావరణంతో మండువేసవి కి గొప్ప పరిష్కారంగా వుంటుంది. నగర జీవన ఒత్తిడుల నుండి దూరంగా వుంచి పూర్తి విశ్రాంతి ని అందిస్తుంది. ఇక్కడి ప్రజలు విభిన్న సంస్కృతులు కలవారు.

చిత్ర కృప : Tymphew

షిల్లాంగ్

షిల్లాంగ్

షిల్లాంగ్ లో చూడవలసినవి : కేథడ్రాల్ కాథలిక్ చర్చి, డాన్ బాస్కో సెంటర్, ఏనుగు జలపాతం, గోల్ఫ్ కోర్స్, షిల్లాంగ్ శిఖరం, సీతాకోక చిలకల మ్యూజియం, స్ప్రెడ్ ఈగిల్ జలపాతం మొదలగునవి.

చిత్ర కృప : Prasanta Kr Dutta

వయనాడ్

వయనాడ్

వయనాడ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

కోజ్హికోడ్ విమానాశ్రయం వయనాడ్ కి సమీపంలో ఉన్న విమానాశ్రయం. ఇది వయనాడ్ నుండి 100 కి. మీ. దూరంలో ఉన్నది. విమానాశ్రయం బయటకు రాగానే మీకు అద్దె టాక్సీలు కనిపిస్తాయి. వీరు 1000 - 1500 రూపాయల వరకు వయనాడ్ కు చార్జీ వసూలు చేస్తారు. మీకు రేట్ కుదరకపోతే ప్రభుత్వ వాహనాల మీద కానీ, లేదా ఇతర ప్రేవేట్ బస్సుల ద్వారా కానీ చేరుకోవచ్చు.

రైలు మార్గం

వయనాడ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కోజ్హికోడ్ లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లు అద్దెకి లభిస్తాయి లేదా రాష్ట్ర బస్సు ల లో కూడా వాయనాడు కి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

జాతీయ రహదారుల ద్వారా వయనాడ్ చక్కని అనుసంధానం కలిగి ఉంది. కోజ్హికోడ్, కన్నూర్, ఊటీ తదితర నగరాల నుండి వెళ్లే రోడ్డు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కరోజు పర్యటన నిమిత్తం వెళ్ళేవారు ఆహార పదార్థాలు వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడం ఉత్తమం ఎందుకంటే వయనాడ్ కి 100 కి. మీ. మేర ఎటువంటి రెస్టారెంట్ లు లేవు. పెట్రోల్ కూడా సమృద్ధిగా పోయించుకోవడం మంచిది.

చిత్ర కృప : Kamaljith K V

వయనాడ్

వయనాడ్

వయనాడ్ పర్యాటకుల మజిలీ గా గుర్తింపు పొందినది. కేరళ రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలలో ఒకటైన ఈ ప్రదేశం అడవుల మధ్యన నెలకొని మనిషి తన దైనందిన జీవితంలో కోల్పోతున్న విశ్రాంతిని, విరామాన్ని, సంతృప్తిని తిరిగి అందిస్తున్నది. విశ్రాంతి తీసుకోవటానికి అనేక రిశార్ట్ లు ... ఆ రిసార్ట్ లలో అలసిపోయిన పర్యాటకులకి ఆయుర్వేద మసాజ్ లు, స్పా లు వంటి సౌకర్యాలు కూడా వాయనాద్ లో అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Kalidas Pavithran

వయనాడ్

వయనాడ్

వయనాడ్ లో చూడదగినవి : ఎడక్కల్ గుహలు, కురువా ద్వీప్, మీన్ ముట్టి జలపాతాలు, పూకోట్ లేక్, ఫాంటమ్ రాక్, చెంబర శిఖరం, తిరునెల్లి ఆలయం, సుచిప్పర జలపాతం ,డ్యామ్, వన్య ప్రాణుల అభయారణ్యం మొదలగునవి.

చిత్ర కృప : Kalidas Pavithran

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరు ఎలా చేరుకోవాలి ?

బెంగళూరు మహానగరం చక్కని రైలు, రోడ్డు, విమాన వ్యవస్థ ను కలిగి ఉన్నది.

విమాన మార్గం

బెంగళూరు లో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. దేశ, విదేశాల నుండి ఈ విమానాశ్రయానికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిటీ లోనికి రావాలంటే సిటీ బస్సులు(ఏసీ, పుష్పక్ బస్సులు) అందుబాటులో ఉన్నాయి. వీలైతే క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని చేరుకోవచ్చు.

రైలు మార్గం

బెంగళూరు ప్రధానంగా రెండు రైల్వే స్టేషన్ ల ను కలిగి ఉన్నది. అందులో ఒకటేమో బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ మరొకటేమో యశ్వంతపుర రైల్వే స్టేషన్. రెండు రైల్వే స్టేషన్ లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడ్డాయి.

రోడ్డు మార్గం

బెంగళూరు చక్కటి రోడ్డు వ్యవస్థ ను కలిగి ఉన్నది. జాతీయ రహదారి 7 ఈ నగరం గుండా వెళుతుంది. చెన్నై, హైదరాబాద్, గోవా, ముంబై, కన్యాకుమారి, వైజాగ్ వంటి అన్ని దక్షిణ భారత దేశం ప్రధాన నగరాలకు ముఖ్య రవాణా కేంద్రం గా ఉన్నది.

చిత్ర కృప : Belur Ashok

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరు సిటీ దక్షిణ భారతదేశంలో త్వరితగతిన అభివృద్ధి చెందిన సమకాలీన నగరం. గార్డెన్ ఆఫ్ సిటీ గా సరస్సుల నగరం గా పిలువబడే బెంగళూరు ప్రస్తుతం సిలికాన్ సిటీ గా పిలువ బడుతున్నది. ఒకప్పుడు మైసూర్ రాజ్యంలో అంతర్భాగమైన ఈ నగరం టిప్పూసుల్తాన్ పరిపాలించాడు.

చిత్ర కృప : Swaminathan

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరు లో చూడదగ్గవి : బెంగళూరు ప్యాలెస్, టిప్పూ సమ్మర్ ప్యాలెస్, లాల్ బాగ్, వృషభ ఆలయం, గవి గంగాదారేశ్వర ఆలయం, మెమోరియల్ హాల్, భారత వైజ్ఞానిక సంస్థ, విధాన సౌధ మొదలగునవి. చెరువులు, సరస్సులు, ఎంజీ రోడ్, శివాజీ నగర్, గరుడ మాల్, మంత్రి మాల్, కబ్బన్ పార్క్, ఫోరం మాల్ ఇలా ఎన్నో ఇక్కడ చూడవలసిన ఇతర ఆకర్షణలు గా ఉన్నాయి.

చిత్ర కృప : SMit224

అగర్తలా

అగర్తలా

అగర్తలా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

అగర్తలా నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్, ట్యాక్సీ లలో అగర్తలా చేరుకోవచ్చు.

రైలు మార్గం

అగర్తలా లో రైల్వే స్టేషన్ కలదు. గౌహతి నుండి మరియు సమీప పట్టణాల నుండి ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం

అగర్తలా గుండా జాతీయ రహదారి 44 వెళుతుంది. గౌహతి, షిల్లాంగ్, సిల్చార్ నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Jonesy38

అగర్తలా

అగర్తలా

అగర్తలా ఈశాన్య రాష్ట్రంలో గౌహతి తరువాత అతి పెద్ద నగరం మరియు త్రిపుర రాష్ట్ర రాజధాని. బంగ్లాదేశ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగర్తలా సాంస్కృతిక, వినోద, సాహస కేంద్రం కూడా. ఇక్కడ గత వైభవ చిహ్నాలతో పాటుగా ఆసక్తిని కైగించే అనేక పర్యాటక కేంద్రాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : PJ Fanning

అగర్తలా

అగర్తలా

అగర్తలా లో చూడదగ్గవి : జగన్నాథ దేవాలయం, జాంపుయి కొండ, కృష్ణ మందిరం, పిలక్, నీర్ మహల్, మలంచా నివాస్, పుర్బాసా మొదలగునవి.

చిత్ర కృప : PP Yoonus

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X