Search
  • Follow NativePlanet
Share
» » శ్రీ కృష్ణుడి జన్మాష్టమి వేడుకలను చూసొద్దాం రండి

శ్రీ కృష్ణుడి జన్మాష్టమి వేడుకలను చూసొద్దాం రండి

శ్రీ కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగే పర్యాటక ప్రాంతాలు ఇవే.

విష్ణుస్వరూపమైన ఆ శ్రీ కృష్ణుడు దానవ సంహారం కోసం భూమి పై జన్మించిన రోజును హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ నల్లనయ్య రాకను పురష్కరించుకొని ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకొంటారు. దేశం మొత్తం మీద ఈ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. అయితే ఆ నల్లనయ్య జన్మించిన ప్రాంతంలో మరింత ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ కృష్ణుడి జన్మాష్టమి వేడుకగా జరిగే పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

మధుర

మధుర

P.C: You Tube

శ్రీ కృష్ణుడు జన్మించింది మధురలోనే. ఇక్కడ ఆ నల్లనయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వేడుకల సందర్భంగా నిర్వహించే జూలానోత్సవం, ఘటాస్ అనే కార్యక్రమాలు చూసి తీరాల్సిందే.

జూలానోత్సవం

జూలానోత్సవం

P.C: You Tube

జూలానోత్సవంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యల వేలాడదీసి అందులో చిన్ని కృష్ణుడి బొమ్మను ఉంచి ఊపుతూ పాటలు పాడుతారు. ఆ విగ్రహానికి పాలు, వెన్న, నెయ్యితో స్నానం చేయిస్తారు. ఇక ఘటాస్ అనే కార్యక్రమం ముఖ్యంగా దేవాలయాల్లో జరుగుతుంది.

ఘంటానాదం

ఘంటానాదం

P.C: You Tube

ఆ సమయంలో మధురలోని అన్ని దేవాలయాల్లో ఒకే సారి గంటలను మోగిస్తారు. శ్రీ కృష్ణుడు జన్మించిన సమయంలోనే వినిపించే ఆ ఘంటానాదం వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అందువల్లే జన్మాష్టమిని చూడటానికి విదేశీయులు సైతం మధురకు వెలుతుంటారు.

బృందావన్

బృందావన్

P.C: You Tube

మధురకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ బృందావన్ ఉంటుంది. కృష్ణుడు ఇక్కడే పెరిగి పెద్దవాడియినట్లు హిందూ పురాణాలు చెబుతాయి. ముఖ్యంగా రాధా కృష్ణుల, గోపికల సయ్యాటలు ఇక్కడే సాగినట్లు చెబుతారు.

పది రోజులు

పది రోజులు

P.C: You Tube

జన్మాష్టమి వేడుకలు ఇక్కడ పది రోజుల పాటు సాగుతాయి. దేవాలయాలను అందంగా అలంకరిస్తారు. మొత్తం నగరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ బృందావన్ లో గోవింద దేవ్ దేవాలయంలో జరిగే జన్మాష్టమి వేడుకలను చూడటానికి రెండు కళ్లు చాలవు.

తులసీ వనం

తులసీ వనం

P.C: You Tube

అంతేకాకుండా ఈ బృందావన్ లో తులసీ వనంలో ఉన్న దేవాలయం, రంగనాథ్ జీ, రాధారమన్ దేవాలయం, ఇస్కాన్ దేవాలయం తదితర దేవాలయాల్లో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ బృందావన్లో దాదాపు 4వేల దేవాలయాలు ఉన్నట్లు చెబుతారు.

గోకుల్

గోకుల్

P.C: You Tube

మధురలో శ్రీ కృష్ణుడి జననం తర్వాత వెంటనే గోకుల్ కు తీసుకువచ్చారు. అక్కడే ఆ నందనందుడు అల్లారుముద్దుగా పెరిగాడు. ముఖ్యంగా యశోదమ్మకు తన నోటిలో భువనబాండాలు చూపించింది ఇక్కడేనని చెబుతారు.

ఒక రోజు ఆలస్యంగా

ఒక రోజు ఆలస్యంగా

P.C: You Tube

అయితే జన్మాష్టమి కంటే ఒకరోజు ఆలస్యంగా గోకుల్ లో ఉత్సవాలు జరుపుతారు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు జన్మించిన తర్వాత ఒక రోజు ఆలస్యంగా ఇక్కడికి వచ్చాడు కాబట్టి. ఆ రోజున గోకుల్ లో నందోత్సవం జరుపుకొంటారు.

పెరుగు, పసుపును చల్లుకొంటూ

పెరుగు, పసుపును చల్లుకొంటూ

P.C: You Tube

ఆ పరమాత్ముడు చిన్న బాలుడి రూపంలో తమ ప్రాంతానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొంటూ ఒకరి పై ఒకరు పాలు, పెరుగు, పసుపును చల్లుకొంటారు. దీనిని నందనోత్సవం అంటారు. ఈ గోకుల్ లోని రాధా రమన్ దేవాలయం, రాధా దామోదర దేవాలయాల్లో జరిగినట్లు చుట్టు పక్కల ఎక్కడా జన్మాష్టమి వేడుకలు జరగవని ప్రతీతి.

 ద్వారక

ద్వారక

P.C: You Tube

చార్ ధామ్ యాత్రలో ద్వారక కూడా ఒకటి. అంతేకాకుండా ద్వారక సప్త మోక్ష నగరాల్లో ప్రముఖ మైనది. ఇక్కడి ద్వారకేశ్వరుడి దర్శనం వల్ల మోక్షం సిద్ధిస్తుందని హిందువులు తరతరాలుగా నమ్ముతున్నారు. శ్రీ క`ష్ణ భగవాడును ద్వారకను రాజధానిగా చేసుకునే పరిపాలించాడని చెబుతారు.

సముద్రంలో

సముద్రంలో

P.C: You Tube

శ్రీ క`ష్ణుడి మరణం తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ప్రస్తుతం ఉన్న ద్వారక తిరిగి నిర్మించినదని కథనం. దీంతో శ్రీ క`ష్ణుడికి ద్వారకకు అవినాభావ సంబంధం ఉంది. అందువల్లే ద్వారకలో ఆ పరమాత్ముడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతారు.

రాత్రి మొత్తం భజనలు

రాత్రి మొత్తం భజనలు

P.C: You Tube

జన్మాష్టమి రోజున రాత్రి మొత్తం ఇక్కడి దేవాలయాల్లో ఆ నల్లనయ్యను కీర్తిస్తూ భజనలు, న`త్యాలు జరుగుతాయి. ఇక్కడ ద్వారకాదీష్ దేవాలయం, రుక్మిణి దేవాలయం, బెట్ ద్వారకా లో జరిగే ఉత్సవాలను చూడాల్సిందే.

మంచి షాపింగ్ కూడా

మంచి షాపింగ్ కూడా

P.C: You Tube

సముద్రంలో ముగినిగిపోయిన పురాతన ద్వారక పట్టణాన్ని ఇటీవల కనుగొప్నారు. ద్వారక షాపింగ్ కు కూడా చక్కనైన ప్రాంతం. ఇక్కడ పటోలా పట్టు చీరలు మొదలుకొని అనేక వస్తువులు చౌక ధరకు దొరుకుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X