Search
  • Follow NativePlanet
Share
» »మాసినగుడి చూసొద్దాం?

మాసినగుడి చూసొద్దాం?

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో మాసినగుడి పర్యాటక కేంద్రం ఉంది.

మాసినగుడి భారత పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. ఇది అన్ని వయస్సుల వారికీ నచ్చుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. సాహస క్రీడలంటే ఇష్టపడేవారు, ప్రకతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్, పరిశోధకులు ఇలా అన్ని వర్గాల వారికీ ఈ మాసినగుడి అత్యంత ఇష్టమైనది. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లా, మదుమలై నేషనల్ పార్క్ పరిధిలో ఉన్న ఐదు పర్వత శ్రేణుల్లో ఒకటి.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

ఊటి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ మాసినగుడి ఉంటుంది. జలపాతాలు, చుట్టూ పచ్చటి మైదానాలు, అడవులు, నదీలోయలు, వన్యప్రాణులు, పక్షుల కిలకిల రావాలెన్నో మాసినగుడిని సందర్శించే పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. మదుమలై వన్యప్రాణీ సంరక్షణ కేంద్ర, బండీపుర జాతీయ వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం, తప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ వంటివి కూడా ఇక్కడ సందర్శించవచ్చు.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

ముఖ్యంగా తప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ వన్యప్రాణీ ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం. ఈ ఎలిఫెంట్ క్యాంప్ మదుమలై వన్యప్రాణీ సంరక్షణాలయానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒకే ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో ఏనుగులను చూడొచ్చు. ఇక్కడ ఏనుగులకు శిక్షణ కూడా ఇస్తారు.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

అదేవిధంగా ఇక్కడికి దగ్గర్లో ఉన్న మరవకండి జలాశయం. దీనిని 1951లో నిర్మించారు. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. మోయార్ హైడ్రో ఎలక్ట్రిక్ పరవ్ హౌస్ కు అవసరమైన నీటిని ఈ జలాశయమే సమకూరుస్తోంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

ముదుమలై వన్యప్రాణీ సంరక్షణాలయం కూడా ఇక్కడ చూడదగిన పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమైనది. ఈ అభయారణ్యం అంతరించిపోతున్న అనేక జంతువులు, పక్షులకు నిలయం. అందువల్లే ఇక్కడకు పరిశోధకులు కూడా ఎక్కువ గా వస్తుంటారు.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

మాసినగుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మయూర్ నది ఉంది. ఈ నది బండీపుర అభయారణ్యం నుంచి మదుమలై అభయారణ్యాన్ని వేరుచేస్తుంది. ఈ నది జన్మస్థానం మోయార్. ఈ నది భవానీ నదికి ఉపనది. ఇక్కడి వివిధ రకాల జలక్రీడలు అందుబాటులో ఉన్నాయి.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

మాసిన గుడిలో ఉదయం ఏడు గంటలకే జీప్ సఫారీ అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం జీప్ సఫారీ ద్వారా మీరు అటవీ ప్రాంతంలో తిరుగుతూ వన్యప్రాణులను సందర్శించవచ్చు.

మాసినగుడి

మాసినగుడి

P.C: You Tube

మాసినగుడి పశ్చిమ కనుమల్లో ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. దీంతో ఇక్కడకు ట్రెక్కింగ్‌కు కూడా చాలా మంది వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ట్రెక్కింగ్ కోసం ఈ మాసినగుడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X