Search
  • Follow NativePlanet
Share
» »రాంఘర్ - రామాయణం కాలం నాటి ప్రదేశం !!

రాంఘర్ - రామాయణం కాలం నాటి ప్రదేశం !!

సందర్శకులు రాంఘర్ లో ఈ పర్యాటక ప్రదేశాలను తప్పకుండా చూడాలి. ఇక్కడ తూటి ఝార్ణ ఆలయం, మాయతుంగ్రి ఆలయం, రాజ్రప్ప మందిరం వంటి ధార్మిక ఆకర్షణలు ఉన్నాయి.

By Mohammad

రాంఘర్ జార్ఖండ్ రాష్ట్రంలో కలదు. రాంఘర్ అనగా రాముని కోట అని అర్థం. ఇది గనులకు, పరిశ్రమలకు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉన్నది. రామాయణ కాలంలో శ్రీరాముడు ఇక్కడ నివసించాడని భక్తులు విశ్వసిస్తారు. జిల్లాలో అధిక భాగం దామోదర్ లోయలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 1049 మీ. ఎత్తులో ఉన్న బర్కా పహార్ జిల్లాలో అతి ఎత్తైన శిఖరం.

ఇది కూడా చదవండి : పాలము - పర్యాటకులకు ఆటవిడుపు !!

రాంఘర్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

సందర్శకులు రాంఘర్ లో ఈ పర్యాటక ప్రదేశాలను తప్పకుండా చూడాలి. ఇక్కడ తూటి ఝార్ణ ఆలయం, మాయతుంగ్రి ఆలయం, రాజ్రప్ప మందిరం వంటి ధార్మిక ఆకర్షణలు ఉన్నాయి. అంతేకాకుండా, దుర్-దురియ జలపాతం, అమ్-ఝరియ జలపాతం, నైకరి డాం, గంధునియా (వేడినీటి బుగ్గ), బంఖేట్ట (గుహ), ఇంకా అనేకమైనవి ఇక్కడి సహజ ఆకర్షణలలో కొన్ని.

టూటీ ఝర్నా ఆలయం

టూటీ ఝర్నా ఆలయం

టూటీ ఝర్నా ఆలయం పాట్నా - రాంచి హై వే మీద కలదు. ఇక్కడ శివలింగం పై నుండి జలపాతం కిందకు పడటం తప్పక చూడదగ్గది. సమీపంలో రఘునాథ్ బాబా ఆలయం కలదు.

చిత్రకృప: Kuarun

మాయాతుంగి ఆలయం

మాయాతుంగి ఆలయం

రాంఘర్ కు 5 కిలోమీటర్ల దూరంలో, సుందరమైన ప్రకృతి కొండల మధ్య అలరారుతూ ఒక విహార ప్రదేశంగా ఉంది మాయాతుంగి దేవాలయం. సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవటానికి పావుగంట చాలు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Kuarun

కతియా శివ మందిర్

కతియా శివ మందిర్

రాంఘర్ కు 3 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి అనుకోని కతియా శివ మందిర్ కలదు. ఇందులో శివలింగం రెండు అంతస్తుల ఎత్తున ఉంటుంది. ఇదొక జాతీయ స్మృతి చిహ్నం. శిల్పకళలు అద్భుతంగా ఉంటాయి.

చిత్రకృప : Kuarun

కెరె మఠం, గురుద్వారా సింగ్ సభ

కెరె మఠం, గురుద్వారా సింగ్ సభ

కెరె మఠం బౌద్దులకు సంబంధించినది. గురుద్వారా సిక్కులకు సంబందించినది. కులమతాలకు అతీతంగా యాత్రికులు ఈ రెండు మత కేంద్రాలను దర్శిస్తుంటారు.

చిత్రకృప : Kuarun

రాజ్ రప్పా మందిర్

రాజ్ రప్పా మందిర్

ఇదొక శక్తి పీఠమే కాదు విహార కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటకులు ఇక్కడ దేవిని ఆరాధిస్తూనే కొండలు, నదులు, ప్రకృతి, అరణ్యాలను చూస్తూ ఆనందిస్తుంటారు. ఇక్కడ ప్రతిఏటా పెద్ద ఎత్తున వివాహ వేడుకలు జరుగుతుంటాయి.

చిత్రకృప : Hrishi Raj

స్మారక చిహ్నాలు

స్మారక చిహ్నాలు

రాంఘర్ పలు స్మారాక చిహ్నాలకు ఆలవాలమై ఉంది. వాటిలో మహాత్మాగాంధీ సమాధి శాంతల్, చైనా సమాధి ప్రముఖమైనది.

చిత్రకృప : Kuarun

ప్రకృతి ప్రదేశాలు

ప్రకృతి ప్రదేశాలు

నైకరి ఆనకట్ట, ధుర్ దురియా, ఆమ్ ఝరియా, నిమి, ధారా, బంకెట్టా, హుద్రు జలపాతాలు, చుతుపల్లు, బరసోపని, జరీనా ఖటూన్ మ్యూజియం మొదలగునవి పర్యాటకులు చూడవచ్చు.

చిత్రకృప : Kuarun

రాంఘర్ ఎలా చేరుకోవాలి ?

రాంఘర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : రాంఘర్ కు 70 కి. మీ. ల దూరంలో రాంచి ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని రాంఘర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : రాంఘర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ 11 కి.మీ. ల దూరంలో కలదు. టాక్సీ లేదా షేర్ ఆటోలలో పట్టణానికి చేరుకోవచ్చు.

బస్సు మార్గం : రాంచి, బర్కరకానా తదితర సమీప పట్టణాల నుండి రాంఘర్ కు పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Kuarun

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X