Search
  • Follow NativePlanet
Share
» »వారాంతాల్లో మనసు తుళ్లింత కోసం ఇక్కడకు చలో

వారాంతాల్లో మనసు తుళ్లింత కోసం ఇక్కడకు చలో

బెంగళూరుకు దగ్గరగా ఉన్న పర్యాటక కేంద్రాల గురించి

By Karthik Pavan

మండే టు ఫ్రైడే ఆఫీస్‌వర్క్‌లో బిజీగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ప్రాణాలకు కాస్త ఫ్రీ టైమ్‌ దొరికేది వీకెండ్‌లోనే. అందుకే.. ముఖ్యంగా బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు వీకెండ్‌ వస్తే చాలు..ఔటింగ్స్‌ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కర్నాటకలో బెంగుళూరు దగ్గర్లో వీకెండ్‌ గెట్‌ ఎవేస్‌ లెక్కలేనన్ని ఉన్నాయి. కొండలు, గుట్టలు, జలపాతాలు, సెలయేళ్లు.. ఇలా ప్రకృతితో మమేకమవ్వడానికి కేవలం 50కిలోమీటర్ల పరిధిలో కావాల్సినన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తోటికల్లు ఫాల్స్‌

తోటికల్లు ఫాల్స్‌

P.C: You Tube

బెంగుళూరు నుంచి 25కిలోమీటర్ల దూరంలోని తోటికల్లు ఫాల్స్‌ని టీకే ఫాల్స్‌ అని కూడా పిలుస్తారు. ఎటుచూసినా పచ్చదనంతో నిండి ఉండే టీకే ఫాల్స్‌లో ట్రెక్కింగ్‌ చేయడానికి కూడా అవకాశం ఉంది. చిన్నచిన్న సెలయేళ్ల పక్కన నుంచి సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, వాటర్‌ఫాల్స్‌ దగ్గర రాళ్లు చాలా జారుగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొండమీదకు కాలినడకన వెళ్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.

బన్నేర్‌ఘట్ట నేషనల్‌ పార్క్‌

బన్నేర్‌ఘట్ట నేషనల్‌ పార్క్‌

P.C: You Tube

వైల్డ్‌ లైఫ్‌ అంటే ఆసక్తి ఉన్న పర్యాటకులకు ఇది మంది వీకెండ్ డెస్టినేషన్. బెంగుళూరు నుంచి కేవలం 15కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్క్‌ను 1970లో నెలకొల్పారు. రకరకాల జీవ, జంతుజాతులకు నెలవుగా ఉన్న బన్నేర్‌ఘట్ట నేషనల్‌ పార్క్‌.. ఫోటోగ్రాఫర్స్‌కు కూడా మంచి ప్లేస్‌. జీప్‌ సఫారీ, ట్రెక్కింగ్‌.. ఇలా టైమ్‌పాస్‌ యాక్టివిటీస్‌ అక్కడ చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇవేమీ కాదనుకుంటే కాసేపు ఆ ప్రకృతి ఒడిలో సేదతీరడానికి ప్రభుత్వం వారి గృహాలూ అందుబాటులో ఉంటాయి. పులులు, ఏనుగులు, అడవి ఎలుగుబంటి, ఆసియా సింహం, చింతపండు చెట్లు, వెదురు మరియు యూకలిప్టస్ చెట్లు, రకరకాల పక్షిజాతులు ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తాయి.

తట్టెకెరె

తట్టెకెరె

P.C: You Tube

స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సు... చుట్టూ ఎత్తైన కొండలు.. ఊహించుకుంటుంటేనే ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది కదూ.. బెంగుళూరుకు 40కిలోమీటర్ల దూరంలో ఉన్న తట్టెకెరెకు వెళితే అచ్చంగా ఇలాంటి అనుభూతినే పొందచ్చు. ఎటువెళ్లినా ఆహ్లాదపర్చే వాతావరణం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అక్కడికి దగ్గర్లోని మహదేశ్వర టెంపుల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. సరస్సు నీటికుండను తలపిస్తుంది కాబట్టి ఎక్కువగా వర్షాకాలంలో ఇక్కడకు వెళ్లడానికి ఇంట్రస్ట్‌ చూపిస్తారు ట్రావెలర్స్‌. ఫోటోగ్రాఫర్స్‌, రొటీన్‌లైఫ్‌తో బోరింగ్‌గా ఫీలయ్యే ఉద్యోగులు అయితే ఏడాదిపొడవునా ఇక్కడకు వెళ్తుంటారు. ఇక్కడి చెట్లమీద రకరకాల పక్షిజాతులు కూడా చూడచ్చు.

తురహళ్లి అడవులు

తురహళ్లి అడవులు

P.C: You Tube

బెంగుళూరుకు అతిదగ్గర్లో మరో అద్భుతమైన వీకెండ్‌ డెస్టినేషన్‌ తురహళ్లి ఫారెస్ట్‌. సిటీకి 20కిలోమీటర్ల దూరంలో కనకపురా రోడ్‌లో ఉన్న ఈ ఫారెస్ట్‌ కూడా ట్రెక్కర్స్‌కు, ఫోటోగ్రఫర్స్‌కు, నేచర్ లవర్స్‌కు పర్‌ఫెక్ట్‌ వీకెండ్‌ డెస్టినేషన్‌. అక్కడున్న కొండలపై కూర్చుని చుట్టుపక్కల పచ్చదనాన్ని చూస్తూ ఉంటే టైమ్‌ కూడా తెలియదు. అక్కడే వర్షాల వల్ల తయారైన చిన్నచిన్ని గుంటల్లో నీరు తియ్యగా ఉంటుందని చెప్తారు. ఈ మధ్యకాలంలో సైక్లిస్ట్‌లకు, రాక్‌ క్లైంబర్స్‌కు ఈ ఏరియా హాట్‌స్పాట్‌గా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X