• Follow NativePlanet
Share
» »పెళ్లికి ముందు ఆ పని కోసం ఈ ప్రాంతాలు ఉత్తమం

పెళ్లికి ముందు ఆ పని కోసం ఈ ప్రాంతాలు ఉత్తమం

Written By: Kishore

జీవితంలో వివాహం అన్నది ఒక మధురమైన ఘట్టం. ఆ ఆనంద కరమైన ఘటనను జీవితాంతం పదిలం చేసుకోవడానికి ఫొటోలు, వీడియోలు తీయడం ఎప్పటి నుంచో వస్తున్న ఒక విధానం. అయితే ప్రస్తుతం వివాహానికి ముందే వధు, వరులు ఇద్దరికీ ఫొటోలు తీస్తున్నారు. ఇందుకు పెద్దల అనుమతి కూడా ఉంటోంది. అంతే కాకుండా ఇందుకు ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజ్ మెంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. చిత్ర, విచిత్రమైన విధనాలతో ఆ ఫొటో షూట్ జీవితంతా పదిలపరుచుకునేలా ఉంటుంది. ఇక దీనినే ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ అని పిలుస్తారు. ఇందు కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీ కోసం బెంగళూరు చుట్టు పక్కల ఉన్న ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ డెస్టినేషన్స్ గురించి ఈ కథనంలో తెలుసుకొందాం. 

ఆ అనంత నిధి వెనక ఓ రాజు పశ్చాత్తాపం..స్వామిని దర్శించుకుంటే

అంత ఎత్తులో మీ 'పక్క' పైన ఉన్నవారిని కెవ్వు మని కేక పెట్టించకమానరు

1. లాల్ బాగ్

1. లాల్ బాగ్

Image Source:

అవుట్ డోర్ ఫొటో షూట్ ఇష్టపడే వారికి లాల్ బాగ్ కు మించిన ప్రదేశం మరొక్కటి కనిపంచదు. ఇక్కడ చుట్టూ పచ్చదనంతో పాటు అనేక రకాల పుష్పాలు ఉంటాయి. అంతేకాకుండా బోన్సాయ్ గార్డన్ కూడా మీ ప్రీ వెడ్డింగ్ ఫొటో స్టూట్ కోసం సహజ బ్యాగ్ గ్రౌండ్ అందాలను అందజేస్తాయి. మరెందుకు ఆలస్యం మీ నెచ్చెలితో మధుర క్షణాలను కెమరాలో బంధించడానికి లాల్ బాగ్ వెళ్లండి.

ఎక్కడ ఉంది............. మెజెస్టిక్ కు 8 కిలోమీటర్ల దూరంలో శాంతినగర్ బస్ స్టాండ్ కు దగ్గరగా
ఫీజులు............... ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం

2. కబ్బన్ పార్క్

2. కబ్బన్ పార్క్

Image Source:

చుట్టూ పచ్చదనం పరుచుకొన్న ఈ ఉద్యాన వనం ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఇతర నగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ పార్క్ పరిధిలోనే విధానసౌధ వంటి చారిత్రాత్మక కట్టడాలు, రాక్ గార్డెన్ వంటికి ఎన్నో ఉన్నయా. సూర్యోదయానికి కొద్దిగా ముందు, లేదా సూర్యాస్తమయం సమయంలో కబ్బన్ పార్క్ లో వాతావరణం ఫొటో షూట్ కోసం చాలా బాగుంటుంది.

ఎక్కడ ఉంది......మెజెస్టిక్ కు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో కబ్బన్ పార్క్ ఉంటుంది.
ఫీజులు................. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం

3. నంది హిల్స్

3. నంది హిల్స్

Image Source:

ప్రముఖ హిల్ స్టేషన్ అయిన నంది హిల్స్ ఆధ్యాత్మిక ప్రదేశం కూడా. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల రోజు మొత్తంలో ఎప్పుడైనా ఇక్కడ ఫొటో షూట్ కు అనువైన వాతావరణం ఉంటుంది.

ఎక్కడ ఉంది....బెంగళూరు నుంచి నందీహిల్స్ కు 61 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం దాదాపు గంటన్నర
ఫీజులు.......ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

4. బెంగళూరు కనకపుర రోడ్డు

4. బెంగళూరు కనకపుర రోడ్డు

Image Source:

నగర శివారులోని ఈ ప్రాంతం రోడ్డు పక్కన ఫొటో షూట్ ఇష్టపడే వారికి నచ్చతుంది. రోడ్డు పక్కనే పచ్చని పొలాలు, అరణ్య ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. దీంతో అటు పట్టణ సంస్క`తిని, ఇటు పల్లె సంస్క`తిని కూడా మనం ఫొటోలో బంధించడానికి వీలవుతుంది. ఉదయం పూట అంటే సూర్యోదయం సమయంలో మాత్రమే ఇక్కడ ఫొటో షూట్ కు అనువైన వాతావరణం ఉంటుంది.

ఎక్కడ ఉంది....బెంగళూరు నుంచి నందీహిల్స్ కు 20 కిలోమీటర్ల దూరం.
ఫీజులు.......ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

5. జేపీ నగర

5. జేపీ నగర

Image Source:

సూర్యోదయానికి ముందే ఇక్కడ ఫొటో షూట్ బాగుంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ప్రాంతం గురించి తెలుసు. కొద్దిగా వాహనాల సౌండ్ ఇబ్బంది కలిగిస్తున్నా ఇక్కడ ఫొటో గ్రఫీకి అనువైన వాతావరణం ఉంటుంది.

6.సతోరి

6.సతోరి


Image Source:

వర్తూర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఈ ఫామ్ హౌస్ ప్రీ వెడ్డింగ్ కు మంచి అనుకూలమైన ప్రాంతం. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సమయం ఏదైనా ఇక్కడ మనం ఫొటో షూట్ చేయవచ్చు.

ఎక్కడ ఉంది.... వైట్ ఫీల్డ్ కు వెళ్లే దారిలో సిద్ధాపుర దగ్గర ఉన్న వర్తూర్ మెయిన్ రోడ్డు
ఫీజులు....... కొద్డిగా ఉంటుంది.

7. సమ్మర్ హౌస్

7. సమ్మర్ హౌస్

Image Source:

ఇది కూడా ఒక ఫామ్ హౌస్. ఇక్కడ బోలెడన్నీ వింటేజ్ కార్లు ఉంటాయి. ఈ వింటేజ్ కార్లు ఫొటో షూట్ కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా ఇక్కడ ఫొటో షూట్ చేయవచ్చు.

ఎక్కడ ఉంది. వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్డు, ఫొరమ్ వాల్యూ మాల్ ఎదురుగా
ఫీజులు...కొద్దిగా ఉండవచ్చు.

8. ఎలిమెంట్స్ రిసార్ట్స్

8. ఎలిమెంట్స్ రిసార్ట్స్

Image Source:

బెంగళూరు నగర శివారుల్లో ఉన్నటు వంటి లగ్జురి రిసార్టుల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మన ఫొటో షూట్ కు అవసరమైన చిన్నిచిన్న మార్పులతో పరిసర ప్రాంతాలను చాలా అందంగా తీర్చి దిద్దుతారు. సెట్టింగ్స్ కూడా వేస్తారు. అందువల్ల రోజులో ఎప్పుడైనా ఇక్కడ ఫొటో షూట్ కు అవకాశం ఉంటుంది.

ఎక్కడ ఉంది...... కనకపుర రోడ్డుకు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు ఎదురుగా
ఫీజు.....చెల్లించాల్సి ఉంటుంది.

9. బ్రిక్లేన్ గ్రిల్

9. బ్రిక్లేన్ గ్రిల్

Image Source:

నగరం నడి బొడ్డునే ఫొటోషూట్ కు అనువైన ప్రాంతం ఈ బ్రిక్లేన్ గ్రిల్. వైట్ థీమ్ తో నిర్మించిన ఎస్కేప్ హోటల్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అందువల్ల ఫొటో షూట్ కు అవసరమైన వాతావరణం సహజంగా కనిపించేలా చూసుకోవచ్చు

ఎక్కడ ఉంది............. ఇందిరా నగర్ లోని 100 ఫీట్ రోడ్,

ఫీజు....మనం ఎంత సమయం ఫొటో షూట్ కు కేటాయిస్తామన్న దాని పై ఆధారపడి ఉంటుంది.

10. ఐటీసీ విడ్సర్న్ మ్యానర్, గోల్ఫ్ కోర్స్ రోడ్

10. ఐటీసీ విడ్సర్న్ మ్యానర్, గోల్ఫ్ కోర్స్ రోడ్

Image Source:

నగరంలో అత్యంత ఖరీధైన ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కూడా స్విమ్మింగ్ ఫూల్ తో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్ కు అవసరమైన సెట్టింగ్స్ వేసుకోవచ్చు. ముందుగా హోటల్ నిర్వాహకులతో అనుమతి తప్పనిసరి

ఎక్కడ ఉంది.......నగరంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్

ఫీజు......చెల్లించాల్సి ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి