Search
  • Follow NativePlanet
Share
» »వారాంతాల్లో బైక్ పై రయ్...రయ్ అంటూ వెళ్లడానికి ఇవి అనువైన ప్రాంతాలు

వారాంతాల్లో బైక్ పై రయ్...రయ్ అంటూ వెళ్లడానికి ఇవి అనువైన ప్రాంతాలు

వారాంతాల్లో బెంగళూరు నుంచి బైక్ పై రయ్...రయ్ అంటూ వెళ్లడానికి ఇవి అనువైన ప్రాంతాలు.

By Gayatri Devupalli

బెంగుళూరు, భారతదేశంలోని నివాసానుకూలమైన ఉత్తమ నగరాల్లో ఒకటి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఇట్టే చల్లదనాన్నిచ్చే అనూహ్యమైన వర్షపాతాలు బెంగళూరులో మనను సేదదీరుస్తాయి.

తోటలు, ఉద్యానవనాలు, థియేటర్లు మరియు పబ్లు, నగరవాసులు వారాంత సమయంలో అధికంగా సందర్శించే ప్రదేశాలు. అయితే, ఒక బైకర్ కు మాత్రం, వారాంతం అంటే ఒక కొత్త సాహసం అని అర్ధం.నగరంలోని ప్రతి సందు గొందులను అన్వేషిస్తూ తిరగడమనే అద్భుతమైన ఆలోచన, ప్రతి బైకర్ కు ఉంటుంది .

అదృష్టవశాత్తూ బెంగుళూరులో నివసిస్తున్న ప్రజల కోసం, పట్టణ ప్రాంతపు రణగొణధ్వనులకు దూరంగా మనసుకు ఆనందాన్ని అందించే అనేక ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నాయి. మీ సవ్వారీ గేర్లను ఎక్కుపెట్టి, మీ వారాంతాలకు సార్ధకత కలిగించే, బెంగుళూరు సమీపంలోని ఈ ప్రదేశాలను సందర్శించండి.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

చికమగళూరు: ముల్లయనగిరి పర్వతపాద ప్రాంతాలలో ఏర్పడిన చికమగళూరుకు, అందమైన కాఫీ తోటలు పచ్చదనాన్ని అద్దుతాయి. ఇక్కడ నెలకొన్న సుందర వాతావరణం, ఈ నగరాన్ని వారాంతపు గమ్యస్థానంగా మార్చివేసింది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

బెంగుళూరుకు 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న చికమగళూరును బైక్ పై సుమారు 5 గంటలలో చేరుకోవచ్చు. ఈ ప్రదేశంకు చేరుకునే మార్గంలో, అందమైన ఆకుపచ్చ విరామాలైన రామనగర్, నెలామంగళ మరియు హసన్ లలో మీరు అలసట తీర్చుకోవచ్చు.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

వాయనాడు: బెంగుళూరుకు 285 కి.మీ.ల దూరంలో, కేరళ లోని ఈ అందమైన హిల్ స్టేషన్ ఉంది. ఇది ప్రకృతి అందాలకు నెలవు. పశ్చిమ కనుమల పచ్చదనం విస్తరించి ఉన్న ఈ ప్రదేశం, పచ్చని చెట్లతో, పొగమంచు దుప్పటి కప్పుకున్న అందమైన వాతావరణంతో, మీ మనసుకు తక్షణమే సేద తీరుస్తుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

ఈ ప్రయాణానికి 7 గంటల సమయం పడుతుంది. చెంబ్రా శిఖరం, ఎడక్కల్ గుహలు, కురువా ద్వీపం మొదలైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీరు వయనాడ్ లో మీ వారాంతపు బసను ఇంకా పొడిగించుకోవచ్చు.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

హసన్: చికమగళూర్ వరకు బైక్ పై వెళ్లడం మీకు కఠినతరంగా అనిపించినట్లైనా లేదా మీ వద్ద సమయం తక్కువగా ఉన్నా, మీరు హసన్ ను దర్శించవచ్చు. హోయసల పాలకుల వారసత్వ సంపదతో వెలసిల్లే హసన్ నగరం బెంగళూరుకు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

ఈ నగరం చేరుకోవడానికి 4 గంటలు పడుతుంది. ఇక్కడి స్థానిక వంటకాల రుచి చూడండి లేదా మార్గంలో రామనగర్ వద్ద ఆగి, తట్టె ఇడ్లీ రుచి చూడండి. మార్గమంతా కన్నులకింపైన పచ్చదనం మీకు తోడుగా ఉంటుంది. హసన్ లోని ప్రసిద్ధ లక్ష్మీదేవి ఆలయం, సోమేశ్వర దేవాలయం వంటి కొన్ని ఆలయాలను తప్పక దర్శించండి.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

మైసూరు: బెంగుళూర్ నగరవాసుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో మైసూరు ఒకటి. ఈ అందమైన నగరం, బెంగళూరు నుండి కేవలం 4 గంటలు దూరంలో ఉంది. ఇది ఒక ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశం.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

వడయార్ కుటుంబం పాలనలో, ఘనమైన వారసత్వంతో తులతూగే మైసూర్ సంస్థానంలోని, మైసూర్ నగరంలో, కళ్ళను మిరిమీట్లు గొలిపించే అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ అందాలను, గొప్పతనాన్ని కళ్లారా ఆస్వాదించాక, సెయింట్ ఫిలోమోనా చర్చి, మైసూర్ జూ, చాముండి హిల్స్ వంటి ఇతర ప్రదేశాలను కూడా సందర్శించండి.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

అగుంబే: రుతుపవన సమయంలో, దట్టమైన అడవుల గుండా, అగుంబే ఘాట్ ద్వారా చేసే ప్రయాణం, ఒక బైకర్ కు అత్యంత ఉత్తేజకరమైన అనుభవాలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఈ అడవుల గుండా ప్రవహించే సతత హరిత అరణ్యాలు మరియు జలపాతాల కారణంగా అగుంబే, "దక్షిణాది యొక్క చిరపుంజీ"గా పిలువబడుతుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

బెంగుళూరు నుండి 355 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగుంబే పట్టణంలో చేరుకోవడానికి 7-8 గంటలు పడుతుంది. చిక్కమగళూరు నుండి కొన్ని అదనపు గంటలు ప్రయాణిస్తే, అగుంబేకు చేరుకోవచ్చు. అగుంబేకి మీ లాగేజ్ ప్యాక్ చేసుకుని, అక్కడ ఉండే దేవాలయాలు మరియు జలపాతాల అందాలను కనులారా వీక్షించండి.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

మంగుళూరు: బెంగుళూరుకు 350 కి.మీ. దూరంలో ఉన్న మంగుళూరు, కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రధాన రేవు పట్టణం. ఈ అందమైన నగరం చేరుకోవడానికి, బైక్ మీద 7-8 గంటలు పడుతుంది. ఈ మార్గంలో వెళుతున్నప్పుడు, మధ్యలో జైన తీర్ధస్థలి అయిన శ్రావణబెళగొళ వస్తుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

ఈ నగరం సముద్ర తీరాలు, తాటి చెట్లు, కొండలు మరియుసెలయేర్లతో నిండి ఉంటుంది. సోమేశ్వర్ బీచ్, సెయింట్ అలౌసియస్ చర్చ్, పనంబూర్ బీచ్ మరియు వివిధ ఆలయాలను వంటివి మంగళూరు లో సందర్శించవచ్చు

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

ఎళగిరి: అంతగా ప్రాచుర్యంలోకి రాని, తమిళనాడులోని ఈ హిల్ స్టేషన్, బెంగుళూరు నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు నుండి ఎళగిరి చేరుకోవడానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఈ హిల్ స్టేషన్ పచ్చని లోయలతో, గులాబీ తోటలు మరియు పండ్ల తోటలు అంతటా వ్యాపించి బైక్ రైడింగ్ కు స్వర్గంలా ఉంటుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

పుంగనూర్ ​​సరస్సు, మురుగన్ దేవాలయం, ప్రభుత్వ సిల్క్ ఫామ్ ఇక్కడి సందర్శన స్థలాలలో కొన్ని. స్వామిమలై కొండలకు చేసే ట్రెక్కింగ్, ప్రకృతి మధ్య కొంత సమయం గడపడానికి అవకాశం ఇస్తుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

సకలేశ్ పూర్: బెంగుళూరు నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకలేశ్ పూర్, బైకర్లకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానాలలో ఒకటి. ఒక హిల్ స్టేషన్ అవ్వడంతో పాటు నగరానికి సమీపంలో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశం కనుక యాత్రికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

జనుకల్ గుడ్డలోని ఆకుపచ్చని మార్గం ద్వారా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే వచ్చే బిస్లే పాయింట్ వద్ద, పరచుకున్న ప్రకృతి సుందర దృశ్యంను కళ్ళతోనే జుర్రుకోవచ్చు. ఇక్కడి మంజహళ్లి జలపాతాల్లో జలకాలాడుతూ సేదతీరండి.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

కొల్లి హిల్స్: తమిళనాడులోని కొల్లి హిల్స్, బెంగుళూరుకు 257 కి. మీ. ల దూరం లో ఉన్నాయి. ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో, బైక్ పై చేసే ప్రయాణం మన మనస్సును తేలిక పరుస్తుంది. ఈ ప్రశాంత మరియు ఏకాంత ప్రదేశం చేరుకోవడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

మీ వారాంతంలో, కొల్లి హిల్స్ లో ట్రెక్కింగ్ చేయడానికి ప్రణాళిక చేయవచ్చు. మీరు ట్రెక్కింగ్ చేసే వేగాన్ని అనుసరించి, కొల్లి హిల్స్ ను అధిరోహించడానికి, ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది. మీ ట్రెక్ చివరిలో, అద్భుతమైన అగయ గంగై జలపాతాలను చూడవచ్చు. ఛాయాచిత్ర సౌజన్యం: సిద్ధార్థ సారంగన్

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

కోయంబత్తూర్: పశ్చిమ కనుమలు చుట్టుముట్టి ఉన్న నగరం కోయంబత్తూర్. తమిళనాడులోని ఈ నగరం , బెంగుళూరుకు 365 కి.మీ.ల దూరంలో ఉంది. చక్కని రహదారులు ఉన్నందున, కోయంబత్తూర్ కు సాగే 7-గంటల ప్రయాణం కఠినమైనదిగా అనిపించదు.

బెంగళూరు నుంచి బైక్ పై

బెంగళూరు నుంచి బైక్ పై

P.C: You Tube

ఈ మార్గంలో, హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం వంటి అందమైన ప్రదేశాలను చూడవచ్చు. కోయంబత్తూరులో మరుధమలై ఆలయం, అయ్యప్పన్ ఆలయం, వైదేహి జలపాతం మొదలైన చూడదగిన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X