Search
  • Follow NativePlanet
Share
» »మచిలీపట్నం - పర్యాటక ప్రదేశాలు !!

మచిలీపట్నం - పర్యాటక ప్రదేశాలు !!

గత చరిత్రను చూస్తే, పూర్వం డచ్, బ్రిటీష్ వారికి మచిలీపట్నం స్థావరంగా ఉండేది. ఈ పట్నం కలంకారీ అద్దకం మరియు ఇతర కళలకు ప్రసిద్ధి, ఇక్కడికి సమీపంలో చూడటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

By Mohammad

మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కలదు. ఈ ప్రదేశం తీరప్రాంతానికి దగ్గరగా ఉన్నది కనుక 'పట్నం' అన్న పేరు వచ్చింది. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలగు పేర్లు అలా వచ్చినవే! శాతవాహనులకాలం నుండే మచిలీపట్నం ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాదు బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఇక్కడ స్థావరాలను (ఈస్ట్ ఇండియా కంపెనీ) ఏర్పాటుచేసుకుని వర్తకం సాగించేవారు. వీరికి స్థావరాలను ఏర్పాటుచేసుకోవటానికి అనుమతి ఇచ్చింది గోల్కొండ సుల్తాన్, కుతుబ్ షాహీ పాలకుడు మహమ్మద్ కులీకుతుబ్ షా (క్రీ.శ.1580 - 1611).

మచిలీపట్నం కు ఆపేరు రావటానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. అదేమిటంటే సముద్రవు ఒడ్డున ఒక కోట ఉండేది దాని ద్వారం వద్ద ఒక పెద్ద 'చేప' విగ్రహం ఉండేదట. హిందీలో చేప ను మచిలీ అని, పట్నం అంటే పెద్ద ఊరు అని అర్థం. కనుకనే మచిలీపట్నం అన్న పేరువచ్చింది.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో అందమైన సముద్ర తీరాలు !!

మచిలీపట్నం దేనికి ప్రసిద్ధి ?

మచిలీపట్నం కలంకారీ అద్దకం, తీవాచీలు, బందరు లడ్డుకు ప్రసిద్ధి. బియ్యం, నూనె గింజలు, బంగారు పూత నగలు మరియు వైజ్ఞానిక పరికరాలు ఇతర ఉత్పత్తులుగా ఉన్నాయి. కలంకారీ తో చేసే వస్తువులకు ఐరోపాలో అధిక డిమాండ్ ఉండటంతో ఐరోపా రాజ్యాలు ఇక్కడ పాగా వేసి వర్తకం సాగించేవారు. ఇక మచిలీపట్నంలో మరియు దాని చుట్టుప్రక్కల చూడవలసిన పర్యాటక ప్రదేశాల అంశానికి వస్తే ...

మంగినపూడి బీచ్

మంగినపూడి బీచ్

మంగినపూడి బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది.

చిత్రకృప : Ganeshk

దత్తాశ్రమము

దత్తాశ్రమము

ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము మరియు తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు లింగాకారంలో ఉంటాయి.

చిత్రకృప : Datta Peetham

శ్రీ పాండురంగస్వామి దేవాలయము

శ్రీ పాండురంగస్వామి దేవాలయము

మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న చిలకలపూడి లో ఈ పాండురంగస్వామి దేవాలయం ఉంది. ఇది మంగినపూడి బీచ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. సాయిబాబా టెంపుల్ కూడా తప్పక చూడవలసిందే !!

చిత్రకృప : Ganeshk

ఘంటసాల

ఘంటసాల

మచిలీపట్నానికి 21 కి.మీ. దూరములో ఉన్న ఈ గ్రామములో పురాతన భౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఘంటసాల గ్రామములో జలదీశ్వరుడి దేవాలయము ఉంది.

చిత్రకృప : Ramarajugelli

శ్రీ అగస్త్యేశ్వర దేవాలయము

శ్రీ అగస్త్యేశ్వర దేవాలయము

మచిలీపట్నానికి 36 కి.మీ. దూరములో ఉంది. శివాలయం. ఇక్కడ ప్రధాన దైవము ఏకరాత్రి మల్లికార్జున స్వామి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు విశేషముగా జరుగుతాయి.

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

విశ్వకర్మ టెంపుల్

విశ్వకర్మ టెంపుల్

సమీపంలో శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, శ్రీ భద్రాద్రి రామాలయం, శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం, బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం -రాబర్ట్ సన్ పేట, శ్రీ పర్వతవర్ధనీ, రాజరాజేశ్వరీ సమేత 'శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం - రాబర్ట్ సన్ పేట, శివాలయం, శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం ఇంకా ...

చిత్రకృప : Nagamalli123

బందరు కోట

బందరు కోట

శ్రీ బాలత్రిపురసుందరీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయం ఖొజ్జిల్లిపేట, శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం - బ్రహ్మపురి, కుసుమహరకోటి మందిరం స్థానిక సర్కిల్ పేట, శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం స్థానిక బచ్చుపేట, శ్రీ ముత్యాలమ్మ తల్లి అలయం, శ్రీ దొంతులమ్మ తల్లి ఆలయం, శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం, బందరు కోట, శివగంగ - జగజ్జనని దేవి ఆలయం, కన్యక పరమేశ్వరి, క్యాథలిక్ చర్చి చూడదగ్గవి.

బందరు లడ్డు

బందరు లడ్డు

మచిలీపట్టణం బందరులడ్డు కి ప్రసిద్ధి. దీనిని 150 సంవత్సరాల నాటినుండి ఇక్కడ తయారుచేస్తున్నారు. బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటా రు. ఇక్కడ ఉన్న నాణ్యత మరెక్కడా కనిపించదు.

చిత్రకృప : Bal1234

వసతి

వసతి

మచిలీపట్నం లో వసతి సౌకర్యాలు బేషుగ్గా ఉన్నాయి. ఏసీ, నాన్ - ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వెజ్, నాన్- వెజ్ భోజనాలు, మన మాదిరి వలే రుచికరంగా ఉంటాయి.

చిత్రకృప : Govind.salinger

మచిలీపట్నం ఎలా చేరుకోవాలి ?

మచిలీపట్నం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మచిలీపట్నం సమీపాన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కలదు. ఇది మచిలీపట్నం నుండి 67 కిలోమీటర్ల దూరంలో కలదు. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి మచిలీపట్నం చేరుకోవచ్చు.

రైలు మార్గం : మచిలీపట్నం లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు మొదలగు ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి మచిలీపట్నం కు ప్రభుత్వ/ప్రవేట్ బస్సు సౌకర్యం కలదు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుండి రెగ్యులర్ గా బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Ganeshk

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X