• Follow NativePlanet
Share
» »ఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదు

ఆ నిధి కోసమేనా ఇక్కడ అన్వేషణ? మీకు ప్రవేశం లేదు

Written By: Kishore

ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన 'ఆ పని' మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

ఈ నగరాలకు వెలితే అటువైపు అసలు వెళ్లకండి ఎందుకంటే 'సుఖాల ఊబి'ఉంది

డబ్బు, సొత్తు, సంపద పేరు ఏదైనా కాని దీని కోసం మనమంతా ప్రాకులాడుతూనే ఉన్నాం. ఈ పదం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా ఇక్కడ వాడక తప్పలేదు. ఆ సొత్తు కొంత ఎక్కువ పరిమాణంలో ఉన్న చోటను నిధి అంటారు. పురాణ కాలం నుంచి భారత దేశాన్ని అనేక రాజులు పరిపాలించారు. వారు కాలంలో కలిసిపోయినా వారు సంపాదించిన సొత్తును అంతటినీ ఒక చోట చేర్చి భద్రంగా దాచి పెట్టారు. ఆ సొత్తు కోసం కొంత మంది అనేక ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నిధి అన్వేషలో సక్సస్ రేటు 2 శాతం కూడా దాటదని తెలిసినా చాలా మంది తమ ప్రయత్నం మానుకోవడం లేదు. అటు వంటి ప్రయత్నమే ద్వారకా నగర అన్వేషణ. శ్రీ సంపదలకు నిలయమైన లక్ష్మీ దేవి భర్త మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు నివసించిన ఈ ద్వారక సముద్రంలో మునిగి పోయిందని పురణాలు చెబుతున్నాయి. ఈ ద్వారకలో అనంత సంపద ఉందని దీని కోసమే ప్రభుత్వం అన్వేషిస్తోందని సమాచారం. పేరుకి అప్పటి పరిస్థితుల అధ్యయనం అని చెబుతున్న దీని వెనుక నిధి వెలికితీతే ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ద్వారక నిర్మాణం, అది మునిగిపోయిన విధానంతో పాటు సముద్రంలోపలి ద్వారక చిత్రాలు అందులో ఉన్న నిధి తదితర విషయాలన్నీ మీ కోసం

1. పురాణ కథనం ప్రకారం

1. పురాణ కథనం ప్రకారం

Image Source:

ద్వారక నగర ప్రస్తావన మనకు మహాభారతంలో అంటే ద్వాపర యుగంలో కనిపిస్తుంది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుంచి ప్రజలను కాపాడటానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహం ఎంచుకుని ద్వారక నగరాన్ని నిర్మించారు.

2. రాజధాని మార్పు.

2. రాజధాని మార్పు.

Image Source:

ఈ నగర నిర్మాణం తర్వాత శూర సామ్రాజ్య రాజధాని మధుర నుంచి ద్వారకకు మార్చబడింది. ఈ ద్వారకలో నివసించిన రాజుల్లో ముఖ్యులు వాసుదేవుడు, శ్రీ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, క`తవర్మ ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు.

3. అత్యంత సంపన్న నగరం

3. అత్యంత సంపన్న నగరం

Image Source:

ఈ ద్వారక అప్పట్లో సంపన్న నగరం. సాక్షత్తు విష్ణువు అంశమైన శ్రీ కృష్ణుడు ఇక్కడ ఉండటంతో బంగారు, వజ్రాలతో పాటు విలువైన లోహాలు గుట్టలుగా ఉండేవని చెబుతారు. అప్పట్లో సైన్యానికి జీతంగా బంగారం ఇచ్చేవారని పురాణాలు చెబుతున్నాయి.

4. కురుక్షేత్ర యుద్ధం

4. కురుక్షేత్ర యుద్ధం

Image Source:

ఈ యుద్ధంలో లక్షల సైన్యం మరిణించింది. ఈ విషయం తెలిసుకున్న గాంధారీ శ్రీ కృష్ణుడి పై పగ పెంచుకుంది. కురుక్షేత్రం జరగ కుండా ఆపగలిగే శక్తి ఉన్నా కూడా ఆపలేకపోవడమే ఇందుకు కారణం.

5. నీ వంశం వారంతా నశిస్తారు.

5. నీ వంశం వారంతా నశిస్తారు.

Image Source:

కొడుకులను పోగొట్టుకున్న దు:ఖంలో ఉన్న గాంధారీని చూడటానికి శ్రీ కృష్ణుడు వస్తాడు. ఆసమయంలో సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత నీ యదు వంశం మొత్తం అంతమవుతుంది. మీరు నిర్మించుకున్న ద్వారక సముద్రంలో మునిగి పోతుందని శాపం పెడుతుంది.

అనేక సూచనలు కనిపించాయి

అనేక సూచనలు కనిపించాయి

Image Source:
అనుకొన్నట్లుగానే కరుక్షేత్రం ముగిసిన 36 ఏళ్ల తర్వాత ద్వారక మునిగే సూచనలు కనిపించసాగాయి. ఆకాశంలో భయంకర శబ్దాలు వినిపించాయి. రథాలు, గుర్రాలు గాలిలో తేలిపోయాయి. ఈ విషయాన్ని మహాభారతంలోని 16వ పర్వమైన మౌసల పర్వంలో వర్ణించబడింది.

7.యాదవులంతా

7.యాదవులంతా

Image Source:

విషయం గమనించిన శ్రీ కృష్ణుడు యదవులందరినీ సముద్ర జాతర చేయాలని చెప్పి మరుసటి రోజు సముద్ర తీరం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ వారు మద్యం సేవించి ఒకరితో ఒకరు తగువులాడుకొని ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు.

8. బలరాములు, శ్రీ కృష్ణుడి అంత్యక్రియలు

8. బలరాములు, శ్రీ కృష్ణుడి అంత్యక్రియలు

Image Source:

ఇక అబలరాముడు యోగ నిద్రలో తనువు చాలించగా, శ్రీ కృష్ణుడు ఓ బోయ వాడి వేటకు మరణించాడు. విషయం తెలుసుకున్న అర్జును వారికి అంత్యక్రియలు నిర్వహించాడు. అటు పై శ్రీ కృష్ణుడి భార్యలతో పాటు అతి కొద్ది మందిని తీసుకుని హస్తినపురానికి బయలు దేరాడు.

9. క్రమంగా సముద్రంలోకి

9. క్రమంగా సముద్రంలోకి

Image Source:

అర్జును హస్తనకు బయలుదేరగానే ద్వారక నగరం క్రమంగా సముద్రంలోకి మునిగి పోవడం కనిపించింది. ఆ సమయంలో ద్వారకలోని సంపద మొత్తం ఆ సముద్రంలో మునిగి పోయింది. ఆ సంపద ఎంత ఉందన్న విషయం మౌసల పర్వంతో పాటు స్కంధపురాణంలో కూడా ఉందని చెబుతారు.

10. లెక్కగట్టలేము

10. లెక్కగట్టలేము

Image Source:

అలా మునిగి పోయిన సంపద విలువ ప్రస్తుత లెక్కలు కడితే కనీసం ఓ మెట్రో నగరం విస్తీర్ణంలో ఆ సంద రాశిగా పోయవచ్చునని రా రాశి ఎత్తు కనీసం 60 అడుగులకు పైన ఉంటుందని చెబుతారు. అంటే సొత్తు లెక్కగట్టలేమని అర్థం.

11. పరిశోధనల వల్ల

11. పరిశోధనల వల్ల

Image Source:

ఈ మునిగి పోయిన ద్వారక గుజరాత్ లోని జామ్ నగరానికి దగ్గరగా అరేబియా సముద్రంలో దాదాపు 150 అడుగుల లోతులో కనుగొన్నారు. దీనినే బెట్ ద్వారక అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగిపోయిన ద్వారక విషయాలను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

12. ప్రస్తుతానికి మట్టి పాత్రలు మాత్రమే

12. ప్రస్తుతానికి మట్టి పాత్రలు మాత్రమే

Image Source:

ప్రస్తుత పరిశోధనలు అనుసరించి మట్టి పాత్రలు లభించాయి. కార్బన్ డేటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని అనుసరించి వాటి వయస్సు సుమారు క్రీస్తు పూర్వం 3,500 ఏళ్ల నాటిదని చెబుతారు.

13. ఒక మందిరాన్ని కూడా

13. ఒక మందిరాన్ని కూడా

Image Source:

ఇటీవల ఇక్కడ రణచోఢ్ రాయ్ మందిరాన్ని కనుగొన్నారు. దీనిని ద్వారకాధీశ్ మందిరమని కూడా అంటారు. దీనికి దక్షిణ భాగాన త్రివిక్రమ మందిరం, ఉత్తరాన ప్రద్యుమ్న మందిరాలను కూడా కనుగొన్నారు.

14. మరింత లోతుకు

14. మరింత లోతుకు

Image Source:

ఇక్కడ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థ సముద్రంలో దాదాపు 200 అడుగుల లోతుకు వెళ్లితే అక్కడ సంపద దొరుకువచ్చుని అధికారులు భావిస్తున్నారు.

15. అనుమతి లేదు

15. అనుమతి లేదు

Image Source:

ఓషనోగ్రఫీ చేస్తున్న పరిశోధనల ప్రాంతాలకు సాధారణ ప్రజలను అనుమతించడం లేదు. బెట్ ద్వారక వరకు వెళ్లవచ్చుకాని సముద్ర లోతుకు వెళ్లడం నిషిద్ధం. ఈ ప్రాంతంలో కొన్ని సార్లు చేపల వేటపై కూడా నిషేదం విధిస్తున్నారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి