Search
  • Follow NativePlanet
Share
» »భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయం, నెల్లూరు !!

భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి ఆలయం, నెల్లూరు !!

ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి మహాసమాధి చెందారు. ఆయనను వెంకయ్య స్వామి అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేషపూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది.

By Mohammad

గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము.

ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి మహాసమాధి చెందారు. ఆయనను వెంకయ్య స్వామి అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి. ఈ గ్రామములో శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం ఉన్నది.

వెంకయ్య స్వామి దేవాలయం

వెంకయ్య స్వామి దేవాలయం

చిత్రకృప : Palagiri

వెంకయ్య ఆలయం

వెంకయ్య ఆలయంచుట్టు విశాలమైన ప్రాకారం నిర్మించారు. ప్రాకారం యొక్క ముఖద్వారం వద్ద నిలుచును చూసినచో గర్భగుడి లోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కన్పించును. గర్భగుడి పైన గోపురనిర్మాణమ్వున్నది. గర్భగుడి చుట్టు స్ధంబాలమీద స్లాబు కట్టారు. ముఖద్వారానికి ఎడమపక్కన ధుని (అగ్ని గుండం) ఉంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండుకొబ్బరికాయ, నవధాన్యాలు, ధూపద్రవ్యాలు 3 లేదా 6 లేదా 9 సార్లు ధునిచుట్టు ప్రదక్షిణచేసి ఇందులో వేయుదురు. ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య దర్సనం చేసుకుంటారు.

గర్భగుడిలోని వెంకయ్యస్వామి విగ్రహాన్ని పాలరాతితో చేసారు. గర్భగుడికి గోడకు వెంకయ్యగారి రెండు చిత్ర పటాలను వెలాడతీసారు.తంబురా మీటుతున్నట్లుగా చిత్రపటాలున్నాయి. గర్భగుడి ద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతిపక్కన వెండి పాదుక ఉంది. భక్తులు జ్యోతికి నమస్కరించి, పాదుకను తాకి, వెంకయ్యగారి దర్శనంచేసుకొని నమస్కరిస్తారు. పుజారి తీర్థం ఇచ్చిన తరువాత, వుడికించిన శనగలను ప్రసాదంగా యిస్తారు.

వెంకయ్య స్వామి దేవాలయం

వెంకయ్య స్వామి

స్వామిని దర్శించుకున్న భక్తులు తమకోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. మరుసటిరోజు స్వామి దర్శనంచేసుకుని తిరుగు ముఖం పడతారు. ఆలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరినవారుకూడ మళ్ళి వచ్చి యిక్కడ రాత్రి నిదురచేస్తారు. భక్తులు రాత్రి వసించుటకై బయలు ప్రదేశం ఉంది. భక్తులు శయనించుటకై చాపలు యిచ్చట అద్దెకు/బాడుగకు లభించును. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, దర్శనం చేసుకుని, రాత్రి యిచ్చటనే గడిపి వెళ్ళెదరు.

స్వామి వారి సర్వ దర్శనం : 6:30AM-11:00AM, 12:00PM-2:00PM, 4:00PM-6:30PM, 7:30PM-8:30PM వరకు స్వామి వారిని దర్శించవచ్చు. ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు.

వెంకయ్య స్వామి దేవాలయం

ఆరాధనోత్సవాలు : ప్రతి ఏడాది ఆగస్టు 18 - 24 వరకు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ప్రసాదము : లడ్డు (100 గ్రా., 150 గ్రా.) - రూ. 10/-, రూ. 15/- మరియు పులిహోర - రూ. 3/-, తలనీలాల టికెట్టు - రూ. 5 రూపాయలు

ధర్మదాన కార్యక్రమాలు : దేవస్థానం వారు నిత్యాన్నదానం, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి విద్యాలయము, భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయం, హాస్టల్, గోశాల, వృద్ధాశ్రమం నడుపుచున్నది.

ఆశ్రయం సమీపంలో సందర్శనీయ ప్రదేశాలు : సుబ్రమణ్యస్వామి పుట్ట, వీరాంజనేయస్వామి మందిరం, స్వామివారి కోనేరు, నవగ్రహ మందిరం, స్వామివారి కుటీరం, రామాలయం చూడదగ్గవి.

ఆశ్రమం వద్ద వసతి

గొలగమూడి లో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ -ఏసీ గదులు, సూట్ రూములు అద్దెకు దొరుకుతాయి. ముందస్తు బుకింగ్ సాదుపాయమూ కలదు.

వెంకయ్య స్వామి దేవాలయం

వెంకయ్య స్వామి గుడి వద్ద భక్తుల సందడి

చిత్రకృప : Palagiri

నాన్ ఏసీ అద్దె - రూ. 100/-, రూ. 150/-, ఏసీ అద్దె - రూ. 400/-, సూట్ రూమ్ అద్దె - రూ.600/-

  • గొలగమూడి వెంకయ్య స్వామి ప్రధాన వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇది కూడా చదవండి : భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

వెంకయ్యస్వామి ఆలయానికి ఎలా చేరుకోవచ్చు ?

వెంకటాచలం రైల్వే స్టేషన్ గొలగమూడి కి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా ఆటోలలో లేదా టాక్సీ లలో ఎక్కి గొలగమూడి కి చేరుకోవచ్చు (లేదా) నెల్లూరు చేరుకొని అక్కడి నుంచి బస్సుల్లో ఎక్కి గొలగమూడి వెళ్ళవచ్చు. నెల్లూరు నుండి గొలగమూడి కి ప్రతి అరగంట కు బస్సులు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X