Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌ర‌పు ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌.. గోల్కొండ కోట‌!

భాగ్య‌న‌గ‌ర‌పు ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌.. గోల్కొండ కోట‌!

భాగ్య‌న‌గ‌ర‌పు ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌.. గోల్కొండ కోట‌!

గోల్కొండ కోట అల‌నాటి పాల‌కుల అద్భుతమైన ఇంజనీరింగ్ ప్ర‌తిభా ప్రావిణ్యానికి మ‌చ్చుతున‌క‌గా నిలుస్తోంది. నగరం నుండి 11 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఇది అన్ని హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. సంద‌ర్శ‌కుల‌ను మంత్రముగ్ధులను చేసి, ఆకట్టుకునే ఈ కట్టడం నేటికీ గంభీరంగా నిలుస్తోంది. గోల్కొండ కోట అత్యంత అధునాతన సాంకేతికతలతో కూడిన‌ దృఢమైన నిర్మాణంగా మాత్రమే కాకుండా నగరం యొక్క అద్భుతమైన వీక్షణకు కేంద్రంగా గుర్తింపు పొందింది.

కోట పై నుండి సూర్యాస్తమయ దృశ్యం ఓ అద్భుతం. హైదరాబాద్‌లోని అత్యున్నత స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచే గోల్కొండ కోట వైభవం ప్రతి ఒక్క సందర్శకుని ఆకర్షిస్తుంది. ఈ కోటను సందర్శించకుండా వెళితే, హైదరాబాద్ పర్యటన అసంపూర్తిగా ఉంటుందంటే ఆశ్చ‌ర్యం లేదు. సుమారు 12వ శతాబ్దంలో కాకతీయ రాజులచే స్థాపించబడిన ఈ భారీ గోల్కొండ కోట ఎనిమిది ద్వారాలు మరియు 87 బురుజులతో తరువాత కుతుబ్ షాహీ రాజులచే నిర్మించబడింది.

గోల్కొండ కోట నిర్మాణ శైలి

గోల్కొండ కోట నిర్మాణ శైలి

సుమారు 11 కిలోమీటర్ల చుట్టుకొలతతో, కోట 15 నుండి 18 అడుగుల ఎత్త‌యిన‌ గోడలను కలిగి ఉంది. దీనికి పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. వాటిపై ఇనుప స్పైక్‌లు అమ‌ర్చ‌బ‌డి ఉన్నాయి. ఇది ఏనుగులు కోటను దెబ్బతీయకుండా ఉండ‌డంతోపాటు శత్రువుల దాడుల నుండి కోటను రక్ష‌ణ క‌ల్పిస్తుంది. గోల్కొండ కోట ప్రతి అడుగులోనూ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిర్మాణాలు స్వాగ‌తం ప‌లుకుతాయి. ఈ కోట 12 మీటర్ల ఎత్తుతో గ్రానైట్ రాతిపై నిర్మించబడింది. గోల్కొండ కోట చుట్టూ భారీ ప్రాకారం నిర్మించబడింది.

కోటలోని ధ్వ‌ని వ్యవస్థ సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద చప్పట్లు కొట్టే శబ్దం ఎత్తులో సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న 'బాలా హిస్సార్' వద్ద వినబడుతుంది. ఈ వ్యవస్థ కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయ‌బ‌డింది. ప్రత్యేకించి ఏదైనా దాడి జరిగినప్పుడు చ‌క్ర‌వ‌ర్తిని అప్రమత్తం చేయడానికిగా చెబుతారు.

అబ్బుర‌ప‌ర‌చే శాస్త్రీయ ప‌రిజ్ఞానం..

అబ్బుర‌ప‌ర‌చే శాస్త్రీయ ప‌రిజ్ఞానం..

కోటలోని ఇతర ఆకర్షణీయమైన విభాగాల్లో ఇక్క‌డి నీటి సరఫరా వ్యవస్థను చేర్చాల్సి ఉంటుంది. ఈ కోటను నిర్మించేటప్పుడు ఉప‌యోగించిన‌ సాంకేతిక మరియు శాస్త్రీయ పరిజ్ఞానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. కోట లోపల ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలలో రామదాస్ జైలు ఒకటి.

పురాణాల ప్రకారం, అబ్దుల్ హసన్ షా కోర్టులో రెవెన్యూ కలెక్టర్‌గా ఉన్న రాందాస్ జైలు పాలయ్యాడు. అతను జైలులో ఉన్న సమయంలో తన జైలు గ‌ది గోడపై హిందూ దేవతలను చెక్కాడు. గోడపై హిందూ భగవానుడు హనుమంతునితో స‌హా అనేక శిల్పాలను చూడవచ్చు. ఆ శిల్పాల ముందు ఒక పవిత్ర దీపం లేదా రెండు (దియాలు) కూడా వెలిగిస్తారు.

ర‌హ‌స్య సొరంగ మార్గం..

ర‌హ‌స్య సొరంగ మార్గం..

కోట యొక్క ప్రధాన ద్వారం పేరు ఫతేష్ దర్వాజా. అంటే ఆంగ్లంలో విక్టరీ గేట్ అని అర్థం. ఔరంగజేబు సైన్యం ఈ ద్వారం గుండా కోటలోకి ప్రవేశించినందున దీనికి ఆ పేరు వచ్చింది. అతని సైన్యం యొక్క విజయ సంకేతంగానే కాకుండా ఈ ద్వారం అద్భుతమైన ధ్వనితో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రవేశ ద్వారంలోని ఒక నిర్దిష్ట ప్ర‌దేశం వద్ద చప్పట్లు కొడితే, కోట చిట్ట చివ‌ర పెద్ద శ‌బ్దం వినిపించే విధంగా ఈ గేటు నిర్మించబడింది.

కోట అనేక మౌంటెడ్ ఫిరంగులు మరియు డ్రాబ్రిడ్జ్‌లను కూడా కలిగి ఉంది. ఒక రహస్య సొరంగం దర్బార్ హాల్ నుండి ప్రారంభమై కొండ దిగువన ముగుస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఏదైనా దాడి జరిగితే తప్పించుకోవడానికి ఇది రహస్య మార్గంగా భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా దృవీక‌రించ‌బ‌డ‌లేదు.

Read more about: golconda fort hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X