Search
  • Follow NativePlanet
Share
» » శ్రీమహావిష్ణువు 3వ అవతారం శ్రీ భూవరహస్వామి దేవాలయం చూశారా?

శ్రీమహావిష్ణువు 3వ అవతారం శ్రీ భూవరహస్వామి దేవాలయం చూశారా?

భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం.

శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీమహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీమహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా, విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని, శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు.

ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ - కుంభకర్ణులు, కంస - శిశుపాలురు. హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో, రావణ, కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా, కంస, శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు. ఈ దశావతారాల్లో ఒక్కరైన భూ వరాహ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం..

మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం

మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం

మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం విష్ణు యొక్క మూడవ అవతారం. కర్నాటకలోని మైసూర్ సమీపంలోని కల్లహల్లి అనే చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం హేమవతి నది ఒడ్డున ఉంది.

విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి

విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి

విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి అనే అడవి పంది రూపం. విగ్రహం 18 అడుగుల ఎత్తు మరియు బూడిద రాయితో తయారు చేయబడింది. ఈ విగ్రహంలో భూదేవి వరాహస్వామి ఎడమ తొడ మీద కొలువుదీరి దర్శనమిస్తున్నది. దేవత విగ్రహం 3.5 అడుగుల పొడవు ఉంది. హనుమంతుడి విగ్రహం కూడా ప్రధాన విగ్రహం క్రింద చెక్కబడింది.

విగ్రహం యొక్క కుడివైపు, కుడి చేతిలో సుదర్శన్ చక్రం,

విగ్రహం యొక్క కుడివైపు, కుడి చేతిలో సుదర్శన్ చక్రం,

విగ్రహం యొక్క కుడివైపు, కుడి చేతిలో సుదర్శన్ చక్రం, ఎడమవైపు తొడమీద భూదేవీ ఆసీనులై కూర్చొని దర్శనమిస్తున్నది. ఇక్కడ స్థానికులకు భువరాహస్వామి ఆలయం చాలా ప్రసిద్ది చెందింది.ఈ స్వామి వారి దర్శణం కోరి వచ్చే వారు ఈ దేవుడు మర్మమైన శక్తులు కలిగి ఉన్నాయని నమ్ముతారు.

భువరాజస్వామి ఆలయంలో పక్కన హెమావతి నది

భువరాజస్వామి ఆలయంలో పక్కన హెమావతి నది

భువరాజస్వామి ఆలయంలో పక్కన హెమావతి నది ఉంది. ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదిలో ఈత కొట్టడం, పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడకు చేరుకుంటుంది. ఏప్రిల్ మరియు మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు సమీప ప్రాంతాల నుండి పండుగలలో పాల్గొంటారు.

భువరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది

భువరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది

భువరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెపుతారు. ఈ దేవాలయానికి రాజ వీర్ బాలాల గురించి ఒక పురాణ కథ ఉంది. వేట కోసం రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కొరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో అక్కడ ఒక వింత ద్రుశ్యాన్ని గమనించాడు. ఒక కుక్క చిన్న కుందేలును తరుముకుని రావడం చూశాడు. మరి కొద్ది సేపటికి కుందేలు కుక్కను తరుముకునిపోవడం గమనించాడు.

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు

అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు మరియు ఈ ప్రదేశంలో 16 అడుగుల లోతు తవ్వి చూడగా అక్కడ వరాహస్వామి విగ్రహం దాగి ఉండటాన్ని కనుగొన్నాడు. ఈ సంఘటన తరువాత, ఈ రాజు అక్కడ వరహాస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతీ రోజు పూజలు చేయడం ప్రారంభించాడు.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

బెంగళూరు -మైసూర్ రహదారిలో కల్హల్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం మాండ్య జిల్లాలోని పాండవుర్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప బస్సు స్టేషన్ 2 km దూరంలో ఉంది. ఈ ప్రదేశం చేరుకోవడం చాలా సులభం. మాండ్య జిల్లాలోని కల్హల్లి అనే చిన్న గ్రామం చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. అయితే బస్సులు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే నిలుస్తాయి. అక్కడి నుండి నడక లేదా మీ సొంత వాహనాల ద్వారా ప్రయాణించవచ్చు .

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more