Search
  • Follow NativePlanet
Share
» »బైక్ పై పర్యాటకమా ఈ టిప్స్ చదివి బయలుదేరండి?

బైక్ పై పర్యాటకమా ఈ టిప్స్ చదివి బయలుదేరండి?

బైక్ రైడర్స్ కు సలహాలు, సూచనలకు సంబంధించిన కథనం.

బైక్ పై సరదాగా టూర్ వెళ్లడం యువతలో క్రేజీగా మారింది. ముఖ్యంగా వీకెండ్ సమయంలో లాంగ్ డ్రైవ్ అంటే వారు ముందుంటారు. ఇందుకోసం గుంపులు గుంపులుగా లాంగ్ వీకెండ్ వెలుతూ ఉంటారు. బైక్ పై టూర్ సరదాగానే ఉంటుంది. అదే సమయంలో మన లైఫ్ పై కూడా మనకు కొంత జాగ్రత్త అవసరం. అందువల్ల బైక్ రైడ్స్ కు వెళ్లేవారి కోసం కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం చదివేయండి...

హెల్మెట్

హెల్మెట్

P.C: You Tube

దగ్గర్లో ఉన్న మార్కెట్ కు వెళ్లే సమయంలోనూ మీరు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. మధ్యలో పోలీసు పట్టుకొంటే ఫైన్ కట్టడం ఎందుకు అన్న ఆలోచనే మిమ్ములను హెల్మెట్ పెట్టుకొనేలా చేస్తుంది. అయితే లాగ్ డ్రైవ్ వెళ్లినప్పుడు అటువంటి పోలీసులు మీకు కనబడరు. అయినా హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మరిచిపోకండి.

మంచిది

మంచిది

P.C: You Tube

తక్కువ ధరకు వస్తోందని ఏ హెల్మట్ పడితే అది కొనకండి. నాణ్యమైన హెల్మెట్ కొంత ఖరీదైనా పర్వాలేదు ఖరీదు చేయండి. మీ తలను కొంత టైట్ గా పట్టుకొనే హెల్మెట్ నే ఖరీదు చేయండి. అదే విధంగా హెల్మెట్ ధరించే ముందు స్కార్ప్ కట్టుకోవడం మరిచిపోకండి.

ఫుల్ హెల్మెట్

ఫుల్ హెల్మెట్

P.C: You Tube

ఫుల్ హెల్మెట్ ను ఖరీదు చేయండి. దానికి వల్ల ప్రమాదం జరిగినా ఎక్కువ నష్టం వాటిల్లదు. చాలా మంది ఆఫ్ హెల్మెట్ ను ధరిస్తూ ఉంటారు. అది అంత సేఫ్ కాదని నిపుణులు చెబుతూ ఉంటారు. అటు పై హెల్మెట్, దానికి ముందు ఉన్న గాజు పై దుమ్ము, దూళి లేకుండా చూసుకోండి అప్పుడు మాత్రమే ప్రయాణం సాఫీగా సాగుతుంది.

బైకింగ్ జాకెట్

బైకింగ్ జాకెట్

P.C: You Tube

మీరు తరుచుగా బైక్ రైడింగ్ వెలుతూ ఉంటే బైకింగ్ జాకెట్, ప్యాంట్, నీ క్యాప్, రైడింగ్ షూ వేసుకోవడం మాత్రం మరిచిపోకండి. దీనివల్ల మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.

బైక్ సర్వీస్

బైక్ సర్వీస్

P.C: You Tube

మీరు బైక్ లో దూర ప్రాంతాలకు పర్యాటకానికి వెళ్లడానికి ముందు ఖచ్చితంగా బైక్ ను సర్వీస్ చేయించడం మరిచిపోకండి. అందువల్ల మీ ప్రయాణం మధ్యలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

పెట్రోల్

పెట్రోల్

P.C: You Tube

ప్రయాణం మధ్యలో అక్కడక్కడ క్లచ్ ప్లేట్ లు, ఎయిర్ ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్స్, క్లచ్, యాక్సిలరేటర్, బైక్ కేబుల్, ట్రైర్స్ తోపాటు పెట్రోల్ లెవెల్ ను ఖచ్చితంగా పరీక్షించుకోండి. ఏమైనా వ్యత్యాసం ఉంటే అప్పటికప్పుడు రిపేర్ చేయించుకోండి.

అదనపు కీ

అదనపు కీ

P.C: You Tube

ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలకు వెళ్లే వారు తమతో పాటు ఒక అదనపు కీను తీసుకువెళ్లడం మంచిది. ప్రాయణం మధ్యలో మీరు తాళం చెవిని మరిచిపోతే ఈ అదనపు తాళం చెవి మీకు పనికి వస్తుంది.

సర్టిఫికెట్లు

సర్టిఫికెట్లు

P.C: You Tube

బైక్ పై పర్యాటకానికి వెళ్లేవారు ఖచ్చితంగా బీమా, రిజిష్ట్రేషన్ తదితర విషయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు మీ వెంట ఖచ్చితంగా తీసుకువెళ్లండి. ఫోటోస్టాట్ కాపీలు మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఉత్తమం.

ముందే

ముందే

P.C: You Tube

ఏ ప్రాంతానికి వెలుతున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలన్నీ ముందుగా తెలుసుకోండి. మీ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండటం వల్ల ఈ వివరాలన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి. అయితే వాటినన్నింటిని ఒక చోట నిల్వ చేసుకోండి.

పరిమిత ప్యాకేజ్

పరిమిత ప్యాకేజ్

P.C: You Tube

లెస్ బ్యాగేజ్ మోర్ కంఫర్ట్ అన్న విషయం బైక్ పై టూర్ కు వెళ్లవేరికి వర్తిస్తుంది. ఎన్ని రోజులు వెలుతున్నాం అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తక్కువ వస్తువులతో మీ లగేజ్ ను ప్యాక్ చేసుకోండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X