Search
  • Follow NativePlanet
Share
» » ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ మతం ఎలా ఏర్పడింది ?

ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ మతం ఎలా ఏర్పడింది ?

దేశం లోని ఆగ్నేయ కోస్తా తీరంలో కల ఆంధ్ర ప్రదేశ్ లో అనేక బౌద్ధ మత నిర్మాణాలు కలవు. బౌద్ధ మతం పట్ల ఆసక్తి కలవారు ఇక్కడ కల అనేక బౌద్ధ ఆరామాలు, శిల్పాలను చూడవచ్చు.

ప్రస్తుతం ఈ నిర్మాణాలు శిధిలమై ఉన్నప్పటికీ, అంతటి బృహత్తర నిర్మాణాల పట్ల ఆశ్చర్య పడక మానరు. బుద్ధుడి జీవన విశేషాలు గురించిన చెక్కడాలు సాధారణం. మరి కొన్ని నిర్మాణాలు బౌద్ధ మత ప్రచారంలో ప్రధాన పాత్ర వహించిన పాలకులవి కూడా కలవు.

నానాటికి శిదిలమైపోతున్న ఈ బౌద్ధ మత అవశేషాలు ఇంకనూ ప్రకృతి నియంత్రణ లో వుండటం మన దేశ అదృష్టం. మన పూర్వీకులు నిర్మించిన ఈ బౌద్ధ మత నిర్మాణాల గురించిన కొన్ని అంశాలు పరిశీలించండి.

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

అమరావతి
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కల అమరావతి బౌద్ధ స్తూపాలకు ప్రసిద్ధి. ఈ స్తూపాలు అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడ్డాయి. ఈ స్తూపాలలో బుద్ధుడి జీవిత కధలు అనేకం కలవు. అమరావతి అమరేశ్వర టెంపుల్ కు కూడా ప్రసిద్ధి. Photo Courtesy: J M Garg

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

బావి కొండ
ఒక ఎత్తైన కొండపై కల బావి కొండ ఒక బౌద్ధ మత ప్రదేశం. బౌద్ధ సన్యాసులు ఇక్కడ గోతులు తవ్వి వర్షపు నీటిని సేకరించే వారు. బావి కొండ అంటే ' బావులు కల కొండ' అనే చెపుతారు. బావి కొండ బౌద్ధ ఆరామం క్రీ. పూ. మూడవ శతాబ్దం నాటిది. Photo Courtesy: Adityamadhav83

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

బొజ్జన్న కొండ
బొజ్జన కొండ సంకరం గ్రామం వద్ద కల ఒక కొండ. ఈ కొండపై ఏక శిలల తో నిర్మించబడిన స్తూపాలు కలవు. ఇక్కడ ఆరు కొండ తొలచిన గుహలు కూడా కలవు. వీటిలో అనేక బౌద్ధ మత సంబంధ చెక్కడాలు కలవు. Photo Courtesy: Adityamadhav83

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

నాగార్జున కొండ
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో లో కల నాగార్జున కొండ ఒక చారిత్రక బౌద్ధ ప్రదేశం. బౌద్ధ యూనివర్సిటీ లకు ఇది కేంద్రంగా వుండేది. చైనా, గాంధార, బెంగాల్, శ్రీలంక దేశాల నుండి విద్యార్ధులు వచ్చి ఇక్కడ శిక్షణ పొందేవారు. నేటికీ ఈ యూనివర్సిటీ ల అవశేషాలు , ఇతర నిర్మాణాలు టూరిస్ట్ లు చూడవచ్చు. ఎత్తిపోతల జలపాతాలు, శ్రీశైలం వైల్డ్ లైఫ్ సంక్చురి ఇక్కడ అదనపు ఆకర్షణలు
Photo Courtesy: Sabyk2001

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

పావురాల కొండ
పావురాల కొండ భీముని పట్నం కి సమీపంలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 150 మీ. ల ఎత్తున కలదు. కొండ పైన శిధిలావస్థ లో కల బౌద్ధ కాంప్లెక్స్ ఒకప్పుడు బౌద్ధ సన్యాసులు ఉపయోగించినది చూడవచ్చు. ఇక్కడ నుండి సందర్శకులు కోస్తా తీర అద్భుత దృశ్యాలను కూడా చూడవచ్చు.
Photo Courtesy: Adityamadhav83

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

రామతీర్థం
రామతీర్థం లో బౌద్ధ మరియు జైన దేవాలయ అవశేషాలు కలవు. ఇక్కడ మూడు కొండలు వరుసగా మధ్యలో లోయలు కలిగి వుంటాయి. మధ్య కొండను గుర్బక్తకొండ అంటారు ఇక్కడ బౌద్ద ఆరామాలు కలవు.
Photo Courtesy: Adityamadhav83

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

సాలి హుండం
సాలి హుండం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో కలదు. అనేక బౌద్ధ చిహ్నాలు కల ఈ ప్రదేశం వంశధార నది దక్షిణ ఒడ్డున కలదు.
Photo Courtesy: George Puvvada

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

విహారాలు ...బౌద్ధ సన్యాసులు

తొట్లకొండ
తోటల కొండ లో కల బౌద్ధ మత నిర్మాణ శిధిలాలు సుమారు రెండువేల సంవత్సరాల కిందటివి. వీటిలో కొన్ని స్తూపాలు మరికొన్ని బౌద్ధ విహారాలు. బౌద్ధ విహారం లో సుమారు ఒక వంద బౌద్ధ సన్యాసు లు తమ ఆహారాలు, దుస్తులు, ఔషధాలు మొదలైన వాటితో నివసించినట్లు తెలుస్తోంది.
Photo Courtesy: Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X