Search
  • Follow NativePlanet
Share
» »దసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందే

దసరా సమయంలో ఈ చాముండి గురించి తెలుసుకోవాల్సిందే

చాముండి మాతకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం.

కర్నాటక సాంస్కృతిక రాజధాని అని పేరు తెచ్చుకున్న మైసూరు నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరీ బెట్ట పేరుతో ఒక చిన్న గుట్ట ఉంది. ఈ గుట్ట పై సాక్షాత్తు ఆ పార్వతీ దేవి చాముండేశ్వరీ పేరుతో వెలిశారు. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ పుణ్యక్షేత్రం పర్యాటకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా చెడు పై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకొనే దసరా సమయంలో ఆ చాముండిమాత వెలిసిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఎంతో మంది వెలుతూ ఉంటారు. అందులో మీరు కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఆ చాముండిమాత, ఆ మాత వెలిసిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

ఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసాఇక్కడ దంపతులు జంటగా స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.సుఖ ప్రసవం కోసం విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు.

చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

మైసూరు నగరానికి కూత వేట దూరంలో ఉన్న చాముండి బెట్టమీద వెలిసిన చాముండేశ్వరీ దేవాలయం ఒక శక్తి పీఠం. క్రౌంచిక పీఠమనే పేరుతో కూడా దీనిని పిలుస్తారు. మైసూరు సంస్థానానికే కాకుండా ఎన్నోరాజ్యాల కులదైవం కూడా ఈ చాముండీమాత.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

అందువల్లే నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని పూజించడానికి ఇక్కడికి వస్తుంటారు. అత్యంత సుందరమైన చిన్న గుట్ట పై ఉన్న ఈ దేవాలయం మైసూరు ప్యాలెస్ నుంచి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
దీంతో మైసూరు నగరంలో కాలుపెట్టిన ప్రతి ఒక్కరినీ ఈ దేవాలయం రారమ్మంటు ఆహ్వానించి ఆకర్షిస్తోంది. రంబాసుర అనే బలవంతుడైన రాక్షసుడు మహిషి అనే పేరుతో ఉన్న విచిత్ర మహిళను చూసి మోహిస్తాడు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
ఆమె రూపం సగం మనిషిగా సగం గేదెను పోలి ఉంటుంది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకొంటారు. వారికి మహిషాసురుడనే సంతానం కూడా కలుగుతుంది. గతంలో రంభాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఈ మహిషాసురుడు మిక్కిలి బలవంతుడవుతాడు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
అంతేకాకుండా ఈ మహిషాసురుడు కూడా బ్రహ్మ గురించి తపస్సు చేసి మరింత బలవంతుడిగా తయారవుతాడు. ఈ భూ మండలాన్నంతటిని ఆక్రమించి పరిపాలిస్తుంటాడు. అంతేకాకుండా స్వర్గంతోపాటు ముల్లోకాల పై దండెత్తి అక్కడి వారిని యుద్ధంలో జయిస్తాడు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
అటు పై దేవతలను, మునులను, కిన్నెరలను తననే పూజించాలని హింసిస్తుంటాడు. దీంతో మునులు, యక్షులు తదితరులు వెళ్లి త్రిమూర్తులతో మొరపెట్టుకొంటారు. మహిషాసుర బారి నుంచి తమను కాపాడాల్సిందిగా ఆ త్రిమూర్తును కోరుతారు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
దీంతో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ మూడు శక్తులను ఒక చోట చేర్చి ఒక కొత్త శక్తికి రూపునిస్తారు. ఆ కొత్త శక్తి పేరే చాముండి. ఆ విధంగా రూపు దిద్దుకొన్న చాముండేశ్వరి హూంకరిస్తూ మహిషాసురతో యుద్ధం చేస్తుంది.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
అత్యంత బలవంతుడైన మహిషాసురుడు కూడా ఆ చాముండితో భీకరంగా యుద్ధం చేస్తాడు. ఇలా తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు, చాముండి మధ్య యుద్ధం జరుగుతుంది. తుదకు మహిషాసురుడు చాముండి చేతిలో చనిపోతాడు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
ఆ తొమ్మిది రోజుల పాటు జరిగిన యుద్ధం ప్రస్తుత చాముండి బెట్ట పై జరిగిందని చెబుతారు. అందువల్లే యుద్ధం తర్వాత చాముండి మాత ఈ చాముండి బెట్ట పై శాశ్వత నివాసం ఏర్పరుచుకొందని స్థలపురాణం చెబుతోంది.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
ఇక మహిషాసురుడు ఇక్కడే తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్నట్లు చెబుతారు. ఆ రాజ్యం పేరే మహిష. కాలక్రమంలో అది మైసూరుగా మారిందని చెబుతారు. ఇక మహిషాసురను చంపినందువల్ల చాముండి మాతను మహిషాసుర మర్థిని అని కూడా పిలుస్తారు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
ఇక చాముండి కొండపైన ఉన్న ఈ దేవాలయం హోయ్సళ శైలి శిల్ప, వాస్తుశైలికి నిదర్శనం. ఈ దేవాలయాన్ని హోయ్సళ రాజైన విష్ణువర్థనుడు నిర్మించాడని చెబుతారు. అటు పై విజయనగర రాజులు, మైసూరు అరస రాజుల కాలంలో ఈ మైసూరుతో పాటు ఈ దేవాలయం ఎంతగానో అభివ`ద్ధి చెందింది.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube
ఇక దేవాలయం గోపురం అద్భుత శిల్పకళకు ప్రత్యక్ష నిదర్శనం. మొదట ఈ గోపురం దేవాలయానికి ఉండేది కాదు. క్రీస్తుశకం 1825-26 మధ్యలో మూడో క`ష్ణరాజ ఒడయార్ ఈ గోపురాన్ని నిర్మించారని చెబుతారు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

అదే సమయంలో కొండ పై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా భక్తులు కొండ పై వెళ్లడానికి మెట్లను కూడా నిర్మించారు. ఇక కొండ పై శివుడి వాహనమైన నంది కూడా మనం చూడవచ్చు.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

ఏక శిలలో అద్భుతంగా చెక్కిన ఈ నంది విగ్రహాన్ని చూడటం కోసమే కొంతమంది ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ నిలువెత్తు మహిషాసుర విగ్రహం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

చాముండేశ్వరి దేవాలయం దగ్గరనే మహాబలేశ్వర పేరుతో ఉన్న శివాలయం కూడా పర్యాటకును విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ దేవాలయం చాముండేశ్వరీ దేవాలయం కంటే పాతదని చెబుతారు

 చాముండి హిల్స్

చాముండి హిల్స్

P.C: You Tube

మైసూరు నగరం నుంచి చాముండి కొండ పైకి వెళ్లడానికి నిరంతరం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అద్దెకు కార్లు, ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మైసూరుకు నేరుగా బస్సు, రైలు, విమాన సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X