Search
  • Follow NativePlanet
Share
» »ఆ నీడ వెనుక నిగూడం వీడింది ఇందుకు కారణం

ఆ నీడ వెనుక నిగూడం వీడింది ఇందుకు కారణం

ఛాయ సోమేశ్వర దేవాలయం లోని నీడ రహస్యానికి సంబంధించిన కథనం.

ప్రపంచంలో చాలా దేశాల్లోని ప్రజలు దిగంబరులుగా జీవిస్తున్న కాలంలోనే భారత దేశంలో అగ్గిపెట్టే పరిమాణంలోని భరణిలో పట్టే పట్టుచీరను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక నిర్మాణ కౌశలం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. శతాబ్దాల క్రితమే అశ్చర్యకరమైన రీతిలో నిలువుత్తు గోపురాలతో కూడిన దేవాలయాలు నిర్మించారు.

ఆ దేవాలయాల నిర్మాణంలో వాడిన సాంకేతిక పరిజ్జానం పై దశాబ్దాల కాలంగా ఎంతో పరిశోధనలు జరుగుతున్నా ఆ రహస్యాలను కనుగొనలేక పోతున్నారు. ఇందుకు హంపిలోని విరూపాక్ష దేవాలయంలో తలకిందులుగా పడే గోపురం నీడ, బృహదీశ్వరాలయంలో భూమిని తాకని ఆలయ గోపురం నీడ. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

అయితే అడపా దడపా అక్కడక్కడ అటు వంటి రహస్యాల ఛేదన జరుగుతోంది. అటు వంటి కోవకు చెందినదే ఈ కథనం. ఈ కథనంలో శతాబ్ద కాలంగా రహస్యంగా ఉన్న ఓ నీడ రహస్యాన్ని ఓ వ్యక్తి ఛేదించాడు. శాస్త్రీయ పరంగా ఆ నీడ వెనుక ఉన్న నిగూడం మాయ కాదని మేధస్సేనని నిరూపించాడు. ఈ నేపథ్యంలో అసలు ఇన్ని రోజులు రహస్యంగా ఉన్న ఆ నీడ నిగూడం ఏమిటి అన్న విషయానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం

చరిత్రను అనుసరించి

చరిత్రను అనుసరించి

P.C: You Tube

ప్రస్తుతం నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లును రాజధానిగా చేసుకొని కందూరు చోళులు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని భూ భాగాన్ని పదో శతాబ్దంలో పరిపాలించారు.

పలు రహస్యాలు

పలు రహస్యాలు

P.C: You Tube

ఆ సమయంలో తమ ఇష్టదైవమైన పరమేశ్వరుడికి పానగల్లులో ఒక దేవాలయం నిర్మించారు. దీనినే ప్రస్తుతం ఛాయా సోమేశ్వర దేవాలయం అని అంటారు. ఈ దేవాలయం నిర్మాణంలో పలు రహస్యాలు దాగి ఉన్నాయి.

 త్రికూటాలయం

త్రికూటాలయం

P.C: You Tube

ఈ ఛాయ సోమేశ్వర దేవాలయం ఒక త్రికూటాలయం. అంటే మూడు ఆలయాలు ఒకే చోట కట్టబడి ఉన్నాయి. ఈ మూడు ఆలయాలకు గోపురం ఉండదు. ఒక ఆలయంలో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరో దేవాలయంలో మూలవిరాట్టు ఉండడు.

లింగ రూపంలో

లింగ రూపంలో

P.C: You Tube

ఇక మూడో దేవాలయం గర్భగుడిలో సోమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు. ఈ లింగం ఉదయం నుంచి సాయంత్రం వరకూ నీడతో కప్పబడి ఉండటం వల్ల ఈ స్వామిని ఛామ సోమేశ్వరుడని అంటారు.

రాతి నిర్మాణం

రాతి నిర్మాణం

P.C: You Tube

దేవాలయాలు పూర్తిగా రాతి నిర్మితాలు. నిర్మాణంలో చాళుక్యుల శైలి కనబడుతుంది. ఆలయం మండపాల్లోని స్తంభాలకు రామాయణ, మహాభారత తదితర ఘట్టాలకు చెందిన శిల్పాలు చెక్కారు. గర్భాలయ ద్వారం పై చెక్కిన లతలు, తీగలు, పూల అందాలు పర్యాటకుల చూపును తమ నుంచి కదలనీయవు.

ప్రతాపరుద్రిని శాసనం

ప్రతాపరుద్రిని శాసనం

P.C: You Tube

ఈ దేవాలయంలో లభించిన ప్రతాపరుద్రుని శాసనం వల్ల కాకతీయులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయ అభివృద్ధికి అనేక వందల ఎకరాల భూములు, బంగారు ఆభరణాలు, సొమ్ము ఇచ్చారని స్పష్టమవుతుంది.

పురావస్తుశాఖ

పురావస్తుశాఖ

P.C: You Tube

ప్రస్తుతం ఈ ఛాయ సోమేశ్వర దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. అయితే సరైన సంరక్షణ లేక పోవడం వల్ల ఈ దేవాలయంలోని శిల్ప సంపద శిథిలావస్థకు చేరుకొంది. భావి తరాలకు భారతీయ శిల్ప కళా విశిష్టతలను తెలియజేయాలంటే ఇటువంటి దేవాలయాల రక్షణ ఎంతైనా అవసరం.

 ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి

P.C: You Tube

ఇక ఆలయానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో రెండు విషయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి వస్తుంది. ఇందుకు గల కారణాలను ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేకపోయారు.

ఒకే స్థానంలో నీడ

ఒకే స్థానంలో నీడ

P.C: You Tube

అదే విధంగా గర్భగుడిలోని శివలింగం పై ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్తంభం నీడ పడుతూ ఉంటుంది. సూర్య గమనంతో సంబంధం లేకుండా ఈ నీడ ఎప్పుడూ కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది.

మన నీడ అక్కడ కనిపించదు

మన నీడ అక్కడ కనిపించదు

P.C: You Tube

గర్భగుడి ఎదురుగా నాలుగు స్తంభాలు ఉంటాయి. ఏ స్తంభం నీడో ఇది అర్థంకాదు. అదేవిధంగా ఆ స్తంభాల్లో ఏ స్తంభం పై చేయ్యి ఉంచినా లేదా మనం ఆ స్తంభం వద్ద నిలబడుకొన్నా మన నీడ అక్కడ గర్భగుడిలో కనిపించదు.

దశాబ్ద కాలంగా అలాగే

దశాబ్ద కాలంగా అలాగే

P.C: You Tube

ఈ నీడ రహస్యం దశాబ్దాల కాలంగా అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రహస్య ఛేదనను సవాలుగా తీసుకున్న సూర్యపేటకు చెందిన ఫిజిక్స్ లెక్షరర్ శేషగాని మనోహర్ గౌడ్ ఆ సోమేశ్వరాలయంలో ఎన్నో రోజులు ఒంటరిగా గడిపాడు.

కొవ్వొత్తులు బల్బులు

కొవ్వొత్తులు బల్బులు

P.C: You Tube

త్రికూటాలయం అణువణవునూ పరిశీలించాడు. వివిధ కోణాల్లో దేవాలయం నిర్మాణాన్ని కొలతలు తీసుకొని కొవ్వొత్తులు, బల్బులు, ధర్మోకోల్ తో అనేక ప్రయోగాలు చేశాడు. చివరికి శాస్త్రీయంగా ఆ నీడ వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రీయంగా నిరూపించాడు.

ఎనిమిది స్తంభాలు

ఎనిమిది స్తంభాలు

P.C: You Tube

ఈ త్రికూటాలయంలో తూర్పు, పడమర, ఉత్తరం వైపున మూడు గర్భగుడులు ఉండగా దక్షిణం వైపున ఈ మూడు గుడులకు కలిపి ఒక ప్రధాన ద్వారం ఉంది. ఇక ప్రధాన ద్వారం వద్ద నాలుగు, మూడు గర్భగుడుల ముందు కలిపి సిమెట్రిక్ విధానంలో ఎనిమిది స్తంభాలు ఉంటాయి.

అద్దంలా మెరిసిపోయేలా

అద్దంలా మెరిసిపోయేలా

P.C: You Tube

మధ్యలో నిలబడి ఏగర్భగుడి వైపు చూసిన అక్కడి నిర్మాణంతో పాటు ఈ ఎనిమిది స్తంభాలు ఒకే రకంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ స్తంభాలు అద్దంలా మెరిసిపోయేలా వీటిని మలిచారు. ఈ నిర్మాణాల పై వచ్చే కాంతి ఎలా వస్తుంది, ఎటువైపు వెలుతుందన్న విషయాలను నిశితంగా గమనించాడు.

నమూనాలు

నమూనాలు

P.C: You Tube

ఇదే విధానంలో మనోహర్ గౌడ్ ధర్మోకోల్, కొవ్వొత్తులను వినియోగించి త్రికూటాలయం నమూనాను తయారుచేసుకొన్నాడు. అటు పై టార్చిలైటును సూర్యుడిగా భావించి వివిధ కోణాల్లో కాంతిని ఈ నమూనాల్లోకి పంపించాడు.

రహస్యాన్ని ఛేదించాడు

రహస్యాన్ని ఛేదించాడు

P.C: You Tube

చివరికి రహస్యాన్ని ఛేదించాడు. ఈ దేవాలయం నిర్మాణం మొత్తం కాంతిపరావర్తన ప్రక్రియను ఆధారంగా చేసుకొని నిర్మించినట్లు తెలిపాడు. అంటే కాంతి ప్రయాణించి ఒక వస్తువు పై పడి తన దిశను మార్చుకొని మరో దిశలో ప్రయాణించడమే కాంతి పరావర్తనం.

ఒక స్థంబానిదికాదు

ఒక స్థంబానిదికాదు

P.C: You Tube

ఇదే విధంగా గర్భగుడిలో పడే నీడ ఒక స్తంభానిది కాదు. తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి వచ్చి ప్రదాన ద్వారం వద్ద ఉన్న నాలుగు స్తంభాల పై పడి పరావర్తనం చెంది గర్భగుడిలోని శివలింగం పై పడుతుంది. అందువల్లే మనం ఏ స్తంభం వద్ద చేయి పెట్టినా మన నీడ గర్భగుడిలో కనిపించదు.

సన్ ట్రాక్

సన్ ట్రాక్

P.C: You Tube

మరొకటి నీడ ఎప్పుడూ ఎందుకూ కదలకుండా ఒకే చోట ఉంటుందన్న విషయానికి కూడా తన పరిశోధనల ద్వారా సమాధానం చెప్పాడు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర దిక్కున అస్తమిస్తాడు. దీనినే సన్ ట్రాక్ అంటారు.

పడమర వైపు గుడిలో మాత్రమే

పడమర వైపు గుడిలో మాత్రమే

P.C: You Tube

ఈ నేపథ్యంలో పడమర వైపు గుడిలో మాత్రమే నీడ పడేలా ఈ త్రికూటాలయాలను కట్టారు. ఇక నీడ సూర్య గమనాన్ని అనుసరించి కదల కుండా ఉండటానికి పడి గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టి కాంతిని అడ్డకొన్నారు. దీంతోమనకు నీడ ఒక చోట కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

నల్గొండను చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలు అనేకం ఉన్నాయి. నల్గొండకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దగ్గరగానే ఉంటుంది. నల్గొండ నుంచి అటోలో ఈ ఛాయా రామేశ్వర దేవాలయానికి వెళ్లవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X