Search
  • Follow NativePlanet
Share
» »కలియుగ ప్రత్యక్షదైవం చింతల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి

కలియుగ ప్రత్యక్షదైవం చింతల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి

ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు దర్శించుకుంటున్న దేవాలయం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు పూజిస్తుంటారు. అది తిరుమల శ్రీవేంకటేశ్వరుడైనా, చిలుకూరిలోని బాలాజీ అయినా మరే ఇతర ప్రదేశాలలోని దేవాలయామైనా కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ప్రదేశంలోనూ శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. అలా అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వెంకరమణ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి.

అధ్బుతమైన శిల్ప సంపద అంటే గుర్తొచ్చేది ఉత్తరాదిన ఖజురహో, దక్షిణాదిన హళేబీడు, బేలూరు లోని హొయసలేశ్వర గుడి మరియు చెన్నకేశావాలయం . అటువంటి గుడులకు ఏ మాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులు తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం , శ్రీ చింతల వెంకట రమణస్వామి దేవాలయం. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు , ఆలయాల నిర్మాణంలో ద్రవిడ శిల్ప శైలికి చక్కటి ఉదాహరణలు.

అనంతపురం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో

అనంతపురం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో

అనంతపురం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఉన్నది. దీనిని క్రీ.శ. 1460 - 1525 సంవత్సరాల మధ్యలో, విజయనగర కాలంలో నిర్మించినారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరులను సైతం ఆకట్టుకుంటున్నది. ఇది కూడా వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.PC- rajaraman sundaram

ప్రపంచ వారసత్వ పొందినది

ప్రపంచ వారసత్వ పొందినది

వారసత్వ ప్రదేశాలు ... వాటిని కాపాడుకోవడం మన విధి. ప్రపంచం మొత్తం మీద ఎన్నో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో చరిత్రక ప్రదేశాలుగా, ఆలయాలుగా చెప్పబడుతున్నవి లేకపోలేదు. ఈ వారసత్వ ప్రదేశాలను యునెస్కో సంస్థ ప్రతినిధులు వచ్చి, సందర్శించి ఆ తరువాత వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే.

స్థల పురాణం:

స్థల పురాణం:

చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఒకసారి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. దాంతో అక్కడి స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది.

స్థల పురాణం:

స్థల పురాణం:

అలా చింత చెట్టు తొర్రలో నుండి విగ్రహం లభించడం వల్ల అప్పటి నుండి చింతల వేంకటరమణ స్వామిగా పిలుస్తున్నారు. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోట లో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్ట తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

ఆలయ విశిష్టత:

ఆలయ విశిష్టత:

ప్రౌడరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510- 1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు.

PC- rajaraman sundaram

ఆలయ విశిష్టత:

ఆలయ విశిష్టత:

ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు.

PC- Dr Murali Mohan Gurram

ఆలయ ప్రత్యేకతలు:

ఆలయ ప్రత్యేకతలు:

ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సినది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవల్సినది ఆలయం నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండాల్సిల హంగులన్నీ ఉన్నాయి.

ఆలయ ప్రత్యేకతలు:

ఆలయ ప్రత్యేకతలు:

రథంలో నాలుగు అడుగుల గరుత్మండి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ, లోపల అపారమైన శిల్పసంపద ఉంది. దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది.ఇది కూడా హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండటం విశేషం.

ఆలయ ప్రత్యేకతలు:

ఆలయ ప్రత్యేకతలు:

గోడలపై, స్తంభాలపైన రామాయణం, మహాభారతం మరియు భాగవతం శ్రీ మహావిష్ణువు అవతారాలతో కూడిన మొదలైన ఘట్టాలను చూపిస్తూ శిల్పాలు అత్యంత సౌందర్యంగా, జీవం ఉన్నట్టుగా దర్శనమిస్తాయి.

PC- Pranav Sujay

ఆలయ ప్రత్యేకతలు:

ఆలయ ప్రత్యేకతలు:

బ్రహ్మ, కుబేర, యక్ష, కిన్నెర, మానవమూర్తులు, గజ, తురగ, మర్కటాది బొమ్మలను చూడవచ్చు. హంసలు, చిలకలు కుడ్యాలపై కనువిందు చేస్తాయి. కాళీయ మర్ధన కృష్ణరూపం అత్యంత రమణీయం. గర్భగుడి గోపురం ఎనిమిది ముఖాలతో ద్రావిడ పద్ధతిలో నిర్మితమైంది.

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం

గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.

గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్దదళ రాతిపద్మం

గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్దదళ రాతిపద్మం

గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్దదళ రాతిపద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదంటారు. ఇక ఆస్థాన మండపంలో కిష్కింధ, చిత్రకూట, సీతారాముల అరణ్యవాస ఘట్టాలను చూడవలిసిందే. ఆలయం బయట ఎత్తయిన రాజగోపురం దానికీ ఎదురుగా ఓ పెద్ద రాతి మండపం మీద శిలాతోరణం ముందుగా మనకు కనిపిస్తాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం ఉంది.

ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి

ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి

ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం, పన్నిద్దరాల్ వారి మందిరం, ఆంజనేయస్వామి వారి మందిరం, ఆనంద వల్లి, లక్ష్మి చెన్నకేశవ స్వామి మొదలైన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఏటా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

అనంతపురం నుండి తాడిపత్రికి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది. అదే విధంగా తాడిపత్రిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుండి ఇక్కడకు నిత్యం రైళ్లు వెలుతుంటాయి.

అనంతపురం నుంచి తాడిపత్రి సుమారు 56 కిలోమీటర్లు. అనంతపురం నుంచి తాడిపత్రికి బస్సులు తరచుగా ఉంటాయి.

తిరుపతి నుంచి తాడిపత్రికి సుమారు 257 కిలోమీటర్లు. తిరుపతి నుంచి కూడా తాడిపత్రికి బస్సులున్నాయి.

తిరుపతి నుంచి తాడిపత్రికి రైలు సౌకర్యం కూడా ఉంది. ప్రయాణ సమయం సుమారు 3 గంటల 45 నిమిషాలు.

PC- Maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more