Search
  • Follow NativePlanet
Share
» »సంతానం లేదా ఈ పుష్కరిణి వద్దకు వెళ్లండి?

సంతానం లేదా ఈ పుష్కరిణి వద్దకు వెళ్లండి?

హాలురామేశ్వర దేవాలయం దట్టమైన అడవుల్లో ఉంది.

భక్తుల సమస్యలకు ఇక్కడి గంగ పరిష్కారమార్గాలను చూపిస్తుంది. తాము కోరిన కోరికలు నెరవేరుతాయోలేదో తెలుసుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తారు. అటువంటి మహిమాన్విత క్షేత్రం కర్నాటకలో ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

అటువంటి మహిమాన్విత క్షేత్రం హాలు రామేశ్వర దేవాలయం. ఈ దేవాలయం చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గలో ఉంది. పురాణాలను అనుసరించి ఈ దేవాలయం ఉన్న పరిసర ప్రాంతాలను హిడంబి వనం అని అంటారు. ద్రావిడ శైలిలో ఈ దేవాలయం నిర్మించారు.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఈ దేవాలయం ముందుభాగంలో ఏక శిలతో నిర్మించిన పెద్ద ద్వీపస్తంభం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది. వాల్మీకి మహర్షి భార్య పేరు సుదతిదేవి.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఆమె కాశీలో గంగకు వాయన రూపంలో సమర్పించిన వజ్రఖచిత కాగడ ఈ గ్రామంలోని ఓ పుట్టలో దొరికినట్లు చెబుతారు. అదే సమయంలో అక్కడ గంగోద్భవం కూడా జరిగిందని స్థానికులు నమ్ముతారు.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఈ విషయం తెలుసుకొన్న వాల్మీకి మహర్షి ఇక్కడికి వస్తాడు. అటు పై భక్తుల కోరికలను తీర్చాల్సిందిగా గంగాదేవికి తెలపడమే కాకుండా ఆమె విగ్రహాన్ని కూడా ప్రతిష్టింపజేస్తాడు. అటు పై రామేశ్వరం వైపు వెళ్లిపోతారు.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఇక్కడ గంగోద్భవ సమయంలో తెల్లని రంగులో ఉన్న నీరు భూమి నుంచి ఉద్భవించింది. అదే సమయంలో వాల్మీకి రామేశ్వరానికి వెలుతున్నానని గంగకు చెబుతాడు. ఈ రెండు విషయాల కలయిక వల్ల హాలు రామేశ్వరమని ఈ క్షేత్రానికి పేరువచ్చంది.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఈ క్షేత్రంలో గంగోద్భవానికి కారకురాలైన వాల్మీకి మహర్షి భార్య సుదతిదేవి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. మొదట ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు ఇక్కడే స్నానం చేసి అటు పై పుష్కరం ఉన్న చోటకు వెళ్లి గంగ పూజ చేయాలి.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

అటు పై వారు కోరికలు కోరి ఆ గంగలో పండు ఫలాలను వదలాలి. ఒకవేళ వారి కోరిక భవిష్యత్తులో నెరవేరుతే అందుకు తగ్గట్టు నీటి పై ఫలం తేలుతుంది. లేదంటే నీటి పై ఏమీ తేలదు. ఈ ఫలం ఎవరికోసమైతే నీటి పై తేలిందో వారే ఆ ఫలాన్ని అందుకోవాలి.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

ఇందుకు విరుద్ధంగా ఇతరులు ఎవరైనా ఆ ఫలాన్ని తీసుకోవడానికి వెళితే అది నీటిలో మునిగి పోతుంది. నీటి పై తేలే వస్తువులను అనుసరించి శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

సాలిగ్రామ, విగ్రహం, అరటిపళ్లు, వక్క, టెంకాయి తదితర వస్తువులు వస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అర్థం. ఒకవేళ రాయి, మన్ను తదితర వస్తువులు వస్తే అశుభం జరుగుతుందని నమ్ముతారు.

హాలు రామేశ్వర క్షేత్రం

హాలు రామేశ్వర క్షేత్రం

P.C: You Tube

కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. మైసూరు మహారాజుగా ఉన్న శ్రీ జయచామరాజ ఒడయారు ఇక్కడికి వచ్చి గంగ పూజను చేసిన తర్వాత నీటి నుంచి ఊయల వచ్చింది. అటు పై వారికి సంతానం కలిగిందని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X