Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అమావాస్య రోజు ఆదిశేషుడు నాట్యమాడుతాడు, ఏడాదికి ఒక్కసారే సందర్శనతో...

ఇక్కడ అమావాస్య రోజు ఆదిశేషుడు నాట్యమాడుతాడు, ఏడాదికి ఒక్కసారే సందర్శనతో...

ఏడాదికి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అమావస్య రోజు ఆదిశేషుడు అక్కడ నాట్యమాడుతాడని చెబుతారు. ఈ నాట్యం కేవలం కొంతమందికి మాత్రమే కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ విషయాన్ని గిరిజన భక్తులు పెద్ద జాతరగా చేసుకొంటారు.

మన తెలుగు నేల పై జరిగే ఈ జాతర ప్రంపంచంలో జరిగే గిరిజన జాతరలో అది పెద్ద జాతర. 400 జనాభా కూడా లేని మారుమూల గ్రామంలో జరిగే ఈ జాతరను చూడటానికి విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. ఇక ఈ జాతర సందర్భంగా గిరిజనులు ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.

ముఖ్యంగా మూలవిరాట్టును అభిషేకం చేయడానికి వందల కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి గోదావరి జలాలను తీసుకువస్తారు. కేవలం 22 పొయ్యిలు మాత్రమే ఉంచి నైవేద్యం తయారుచేస్తారు. శతాబ్దకాలంగా నిర్వహిస్తూ వస్తున్న ఇటువంటి విభిన్న జాతర విశేషాలు మీ కోసం...

అతి పెద్ద గిరిజన జాతర

అతి పెద్ద గిరిజన జాతర

P.C: You Tube

ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరలో నాగోబా జాతర కూడా ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ముఖ్య ఉద్దేశం. నాగోబా దేవాలయం వద్ద జరిగే ఈ జాతరకు ప్రపంచ నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు ఇక్కడికి వస్తారు.

తెలంగాణ

తెలంగాణ

P.C: You Tube

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా దేవాలయం ఉంది. ఇక్కడ జనాభా 400 మించదు. అయితే జాతర సమయానికి ఆ గ్రామానికి రెండు నుంచి మూడు లక్షల మంది ప్రజలు చేరుకొంటారు.

పుష్యమాస అమావాస్య

పుష్యమాస అమావాస్య

P.C: You Tube

ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. అంటే జనవరి 25 న ప్రారంభమయ్యే ఈ జాతర నాలుగు రోజుల పాటు జరిగి 29న ముగుస్తుంది. గోండుల ఆరాధ్యదైవం ఆదిశేషుడు అమావాస్య రోజున తమ జాతి పెద్దలకు కనిపించి నాట్యమాడుతాడని భక్తులు విశ్వాసం.

ఆదిశేషుడు

ఆదిశేషుడు

P.C: You Tube

ఈ జాతర చరిత్రకు సంబంధించి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుదలో అత్యంత ప్రాచూర్యంలో ఉన్న కథను అనుసరించి పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి ఆదిశేషుడు కలలో కనిపించి తాను పాము రూపంలో నీ గర్భంలో జన్మిస్తానని చెప్పాడు.

గోదావరి నదీ తీరానికి

గోదావరి నదీ తీరానికి

P.C: You Tube

ఇది జరిగిన కొన్ని నెలలకే ఆమె ఓ పాముకు జన్మనిస్తుంది. అటు పై ఆ రాణి తన మేనకోడలు గౌరితో ఆ పాముకు వివాహం జరిపిస్తుంది. అయితే ఈ వివాహం ఆ గౌరికి ఇష్టముండదు. ఒకసారి గౌరి పామురూపంలో ఉన్న తన భర్తను ఓ బుట్టలో ఉంచుకొని గోదావరీ నదీ తీరానికి బలయు దేరుతుంది.

 గుట్టలోకి వెళ్లిపోతాడు

గుట్టలోకి వెళ్లిపోతాడు

P.C: You Tube

మార్గమధ్యలో ధర్మపురి వద్ద ఆమెకు నాగేంద్రుడు మనిషి రూపంలో కనిపించి నీకు సంప్రదాయలు ముఖ్య నీ సుఖం ముఖ్యమా అని అడుగుతాడు. ఆమె తనకు తన సుఖమే ముఖ్యమని చెబుతుంది. దీంతో పామురూపంలో ఉన్న ఆదిశేషుడు ఆమెను వదిలి కెస్లాపూర్ వద్ద ఓ గుట్టలోకి వెళ్లిపోతాడు.

ఆత్మహుతికి పాల్పడుతుంది

ఆత్మహుతికి పాల్పడుతుంది

P.C: You Tube

దీంతో గౌరి గోదవారిలోని సత్యవసి గుండంలో ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలుసుకొన్న మేస్రం వంశీయులు ఆ గుట్ట వద్ద ఆదిశేషుడికి నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. దీనికి సంతసించిన ఆ ఆదిశేషుడు ప్రతి ఏటా తనకు నాగోబా జాతర నిర్వహించాలని ఆ రోజు మేస్రం వంశీయులకు తాను కనబడి వారి ఎదుట నాట్యం చేస్తానని చెప్పారని స్థానికులు చెబతారు.

మేస్రం వంశానికి చెందినవారు

మేస్రం వంశానికి చెందినవారు

P.C: You Tube

ఇప్పటికీ ఈ ఆలయంలో పూజారులు ఆ మేస్రం వంశానికి చెందినవారే కావడం గమనార్హం. ఇక ఈ జాతర నిర్వహించే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ఒక రోజు ముందు మేస్త్రం వంశీయులు ఈ నాగోబా ఆలయానికి చేరుకొంటారు.

100 కిలోమీటర్ల దూరం

100 కిలోమీటర్ల దూరం

P.C: You Tube

అక్కడ కొత్త కుండలను తీసుకొని దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే గోదావరి వద్దకు కాలి నడకన బయలు దేరుతారు. ఆ నీటిని తీసుకువచ్చి కెస్లాపూర్ కు అమావాస్య రోజున కాలినడకనే చేరుకొంటారు.

మర్రి చెట్టు కింద

మర్రి చెట్టు కింద

P.C: You Tube

అటు పై అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండ్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో నాగోబా దేవతకు అభిషేకం నిర్వహిస్తారు. ఈ మేస్త్రం వంశీయులను మిగిలిన గిరిజన తెగలవారు అనుసరిస్తారు.

గుగ్గిల్లం వంశం వారు

గుగ్గిల్లం వంశం వారు

P.C: You Tube

గోదావరి జలాలను తీసుకురావడానికి వాడే కుండలను ఇక్కడికి దగ్గర్లో ఉన్న ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశం వారే తయారు చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. 130 కుండలు తయారు చేసి మెస్రం వంశీయులకు అందజేస్తారు. ఈ కుండలను సిరికుండలు అంటారు.

ఆ కుండల్లోనే

ఆ కుండల్లోనే

P.C: You Tube

ఈ కుండల్లోనే మెస్రం వంశీయులు గోదావరి జలాలు తీసుకువస్తారు. అంతేకాకుండా ఈ కుండల్లోనే వారు ఆలయ ప్రాంగణంలో వంటలు వండుకొంటారు. వంటలు వండటానికి కేవలం 22 పొయ్యిలు మాత్రమే వాడుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

బేటింగ్ కియావాల్

బేటింగ్ కియావాల్

P.C: You Tube

ఇక మెస్రం వంశానికి చెందిన వారు నూతన వధువులను తప్పక తమ కేస్లాపూర్ లోని నాగోబా దేవుని వద్దకు తీసుకువెలుతారు. ఆ దేవుడికి పరిచయం చేస్తారు. దీనినే బేటింగ్ కియావాల్ లేదా వధూవరుల పరిచయ వేదిక అంటారు.

తెల్లని ముసుగు

తెల్లని ముసుగు

P.C: You Tube

ఈ తంతంగం పూర్తకయ్యే వరకూ నూతన వధువు నాగోబా దేవతను పూజించడానికి వీలు లేదు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో వధువు తెల్లని ముసుగు ధరించి ఉంటుంది. ఈ ముసుగుతోనే వధువు ఇంటి నుంచి పూజా సామాగ్రితో ఆలయానికి వస్తారు.

ప్రత్యేక దర్భార్

ప్రత్యేక దర్భార్

P.C: You Tube

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్ కు ఒక ప్రత్యేకత ఉంది. గిరిజనులు స్థితి గతులు తెలుసుకోవడానికి నిజం ప్రభువు హైమాండార్ప్ అనే ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్తను ఇక్కడకు పంపారు. 1942లో ఈయన గిరిజనుల స్థితి గతులు తెలుసుకునేందుకు మొదట దర్భార్ ను నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో

పెద్ద సంఖ్యలో

P.C: You Tube

ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గిరిజన పెద్దలు, నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ ధర్భార్ కు హాజరవుతారు. ఈ నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ధ సంఖ్యలో భక్తులు హాజరువుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X