» »పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

Posted By: Venkatakarunasri

LATEST: ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

భారతదేశం సర్వమతాలకూ ప్రతీక. ఇక్కడ అందరు దేవుళ్ళకు ఆలయాలు వుంటాయి. అయితే చిత్రంగా హిందువులు ఎక్కువగా ఆరాధించే రాముని శత్రువైన రావణాసురుడుకి కూడా ఈ ప్రాంతంలో ఆలయం వుండటమే కాక అక్కడి గ్రామప్రజలు భక్తితో కొలవటం విశేషం.

అంతేకాదు ప్రతీ సంవత్సరం జాతర కూడా నిర్వహిస్తూ వుంటారు. ఒక్క సంవత్సరం నిర్వహించకపోతే ఆ ఊళ్ళో ఏదో ఒక అనర్థం జరుగుతుందని అక్కడ ప్రజల విశ్వాసం.అందుకే క్రమం తప్పకుండా అక్కడి ఆలయాల్లో రావణుడికి కూడా పూజలు చేయటం అక్కడి వారి ఆనవాయితీ. చిత్రవిచిత్రంగా వున్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.

పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. జాతర

1. జాతర

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన చిఖాలిలో ప్రజలు రావణాసురుడుని తరతరాలుగా పూజించటమే కాక జాతర కూడా నిర్వహిస్తూ వుంటారు.

PC: youtube

2. చైత్రమాస నవరాత్రులు

2. చైత్రమాస నవరాత్రులు

ప్రతీ సంవత్సరం చైత్రమాస నవరాత్రుల్లో విజయదశమి పర్వదినాన ఇక్కడి వారు రావణ వుత్సవం వైభవంగా జరుపుకుంటారు.

PC: youtube

3. రావణాసురుడికి జాతర

3. రావణాసురుడికి జాతర

అన్ని ప్రాంతాలలో రావణాసురుడికి గడ్డి బొమ్మలతో బాణాసంచాలతో తగలబెడితే ఇక్కడి ప్రాంతం వారు విభిన్నంగా రావణాసురుడుకి ఏకంగా జాతర నిర్వహించటం విశేషం.

PC: youtube

4. రావణ సంతతి

4. రావణ సంతతి

చిఖాలి అనే గ్రామంలో ఇప్పటికీ రావణ సంతతికి చెందిన వంశీయులు ఎక్కువగా కన్పిస్తూంటారు.

PC: youtube

5. ప్రత్యేకమైన పూజలు

5. ప్రత్యేకమైన పూజలు

ఇక్కడ గాడిదమాతకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.

PC: youtube

6. విచిత్రంగా పూజలు

6. విచిత్రంగా పూజలు

విచిత్రంగా రావణుడితో పాటు విచిత్రంగా పూజలందుకునే దేవత మరొకరున్నారు.

PC: youtube

7. గాడిద బొమ్మ

7. గాడిద బొమ్మ

ఆమె ముఖం గాడిద బొమ్మతో వుండటం,భక్తులు రావణాసురుడుతో సమానంగా ఈమెను పూజిస్తూ వుంటారు.

PC: youtube

8. రావణాసురుడు

8. రావణాసురుడు

ఇక్కడ ఈమె పూజలందుకోవటం విశేషం. ఈమెను పూజిస్తే రావణాసురుడు సంతృప్తి చెందుతాడని అక్కడి ప్రాంత ప్రజలకు నమ్మకం.

PC: youtube

9. బాపూభాయ్ రావణ్

9. బాపూభాయ్ రావణ్

ఈ ప్రదేశంలో ఈ ఆలయం యొక్క పూజారి పేరు కూడా బాపూభాయ్ రావణ్.

PC: youtube

10. అర్చన సేవలు

10. అర్చన సేవలు

రావణాసురుడి అర్చన సేవలు చేయటమే కాక ప్రజల కోరిక కోసం రోజంతా ఏమీ తినకుండా పూజలు చేయటం విశేషం.

PC: youtube

11. రావణ పూజలు

11. రావణ పూజలు

ఒకసారి వర్షాలు లేక ప్రజలుజనం అల్లాడిపోతుంటే ఈ పూజారి ఒక రోజంతా ఆహారం లేకుండా రావణ పూజలు చేసాడు.

PC: youtube

12. ఆనంద పరవశం

12. ఆనంద పరవశం

అంతే అనంతరం ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో పాటు ఆ వూరి ప్రజలు ఆనంద పరవశంలో వూగిపోయారు.

PC: youtube

13. ఎలా చేరాలి ?

13. ఎలా చేరాలి ?

అంతేకాక ఒక సంవత్సరం ఏదో కారణం చేత రావణాసురుడికి జాతర నిర్వహించలేకపోవటంతో ఆ వూరిలో ఘోరఅగ్ని ప్రమాదం సంభావించటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అప్పటి నుండి ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా రావణాసురుడ్ని పూజించుకుంటారు.

PC: google maps

Please Wait while comments are loading...