» »బాహుబలి 2 షూటింగ్ జరిగిన ప్రదేశాలను చుట్టివచ్చేద్దామా !

బాహుబలి 2 షూటింగ్ జరిగిన ప్రదేశాలను చుట్టివచ్చేద్దామా !

By: Venkata Karunasri Nalluru

బాహుబలి 2 షూటింగ్ కేరళలోని కన్నూర్ లో ప్రారంభించబడినది. కన్నూర్ లోని కన్నవం అనే అటవీప్రాంతంలో జరిగింది. కేరళలోని 14 జిల్లాలలో కన్నూరు ఒకటి. ఇది కేరళలోని ఉత్తరంలో ఉన్న జిల్లా. అరేబియా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి - సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం జానపద కళలకి, వస్త్రాల తయారీ కి పుట్టినిల్లు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ మరియు ఇతర భాషల సినిమా షూటింగ్ లు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి.

నగరం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వున్న కన్నూర్ కోట పర్యాటకులను కనువిందు చేస్తున్నది. ఈ కోటకు దగ్గరలో అరేబియా సముద్రం ఉండటం వల్ల ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. సుందరేశ్వర ఆలయం, రాఘవాపురం ఆలయం, సుబ్రమణ్య ఆలయంలు ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆలయాలు. ఇక్కడ బీచ్ లు ఎంతో ఉల్లాసంగా వుంటాయి.

బాహుబలి 2 షూటింగ్ జరిగిన ప్రదేశాలు

1. కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

1. కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

కన్నూర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా, దేశంలోని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానమై ఉన్నది. తిరువనంతపురం, తలసెరి, కొచ్చి, కాలికాట్, మున్నార్, మంగళూరు నుండి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కన్నూర్ నగరానికి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఉన్నది. బెంగళూరు, తిరువనంతపురం, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాలకు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించవచ్చు. నగరంలో వెళ్ళటానికి ఆటో రిక్షాల సదుపాయం, ట్యాక్సీ మరియు సిటీ బస్సుల సదుపాయం కలదు. కన్నూర్ కు 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గాని, 142 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయంలో కానీ దిగి క్యాబ్ లేదా ట్యాక్సీలను అద్దెకు తీసుకొని కన్నూర్ చేరుకోవచ్చు.

PC : Sakeeb Sabakka - Anchored

2. పజ్ హస్సి డ్యాం

2. పజ్ హస్సి డ్యాం

పజ్ హస్సి డ్యాం ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. కన్నూర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో వున్నది. డ్యాం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడి ముఖ్య ఆకర్షణలు బోటింగ్, పజ్ హస్సి రాజ విగ్రహం, బుద్ధ పర్వతం.

PC :Vinayaraj

3. ధర్మదమ్ ఐస్ లాండ్

3. ధర్మదమ్ ఐస్ లాండ్

ధర్మదమ్ అనే ప్రదేశం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపమే ఈ ధర్మదమ్ ఐలాండ్. ఈ ద్వీపం ముజ్హుప్పిలన్గడ్ బీచ్ నుండి కనబడుతూ వీక్షకులను మురిపిస్తుంది. పర్యాటకులు అలల తాకిడి తక్కువగా ఉన్న సమయంలో ఈ బీచ్ నుండి ద్వీపానికి నడిచి వెళ్ళవచ్చు.

PC : Shagil Kannur

4. అరలమ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

4. అరలమ్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

కన్నూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమల్లో జంతువులకి స్థావరంగా ఉన్నది. 1145 మీటర్ల ఎత్తున ఉన్నకట్టిబెట్ట శిఖరం చూచుటకు ఆకర్షణీయంగా వుంటుంది.

సందర్శించవలసిన సమయం: ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు

PC :Vinayaraj

5. అరక్కల్ కెట్టు మ్యూజియం

5. అరక్కల్ కెట్టు మ్యూజియం

కన్నూర్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కల్ కెట్టు ఇదివరకు రాజుల నివాస స్థలంగా ఉండేది ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఈ ప్యాలెస్ లో కోర్ట్ యార్డ్, వరండాలు, దర్బార్ హాల్స్, చెక్క నేలలు, రంగు రంగుల అద్దాల కిటికీలు కనువిందు చేస్తాయి.

PC : നിരക്ഷരൻ

6. ముజుప్పిలన్గడ్ బీచ్

6. ముజుప్పిలన్గడ్ బీచ్

పర్యాటకులు కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న ముజుప్పిలన్గడ్ బీచ్ తీరం పొడవున నడుస్తూ అద్భుతమైన బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ లో జరిగే బీచ్ పండుగలో ఈ ప్రాంతం అంతా యువతరంతో సాహస విన్యాసాల ప్రేమికులతో నిండిపోతుంది.

PC :Sebasteen anand

7. కన్నూర్ కోట

7. కన్నూర్ కోట

ఇది పోర్చుగీసు వారు ఇండియాలో కట్టిన మొట్టమొదటి కోట. కన్నూర్ పట్టణం నుండి 3 కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడ అనేక సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతుంటాయి.

PC :Satish Sankar

8. ఎజ్హిమల

8. ఎజ్హిమల

కన్నూర్ నుంచి 55 కి.మీ దూరంలో వున్న ఎజ్హిమల 290 మీటర్ల ఎత్తులో పచ్చని ప్రదేశాలతో కూడిన ప్రదేశం. ఇది పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇక్కడి ముఖ్య ఆకర్షణలలో హనుమంతుడి గుడి మరియు మౌంట్ డెలి లైట్ హౌస్.

PC :Sreejithk2000

9. పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

9. పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్

కేరళ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఏకైక స్నేక్ పార్క్ పరిస్సినిక్కడవు స్నేక్ పార్క్. కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న పరిస్సినిక్కడవు అనే గ్రామంలో ఈ పార్క్ ఉన్నది. పరిస్సినిక్కడవు ముతప్పాన్ ఆలయం ఇక్కడి మరొక ప్రధాన ఆకర్షణ.

PC : Vijayanrajapuram

10. ప్యాథల్ మల

10. ప్యాథల్ మల

ప్యాథల్ మల ప్రకృతి ప్రేమికులకు, వన్య మృగ ప్రేమికులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది. ట్రెక్కింగ్ చేయటానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. కన్నూర్ పట్టణానికి 60 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇక్కడి అందాలు ఫోటో ప్రేమికులకు మంచి ప్రదేశం.

PC :Vinayaraj

11. చేరుకున్ను

11. చేరుకున్ను

కన్నూర్ పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న చిన్న ఆధ్యాత్మిక గ్రామం చేరుకున్ను. అన్నపూర్ణేశ్వరి టెంపుల్, చేరుకున్నిలమ్మ ఆలయం, చిన్న చిన్న ద్వీపాలు, తావం చర్చి, ఒలియంకర జూమా మసీదులు ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

PC : Prakashkpc

12. కొట్టియూర్ శివాలయం

12. కొట్టియూర్ శివాలయం

దక్షిణ కాశీగా పిలువబడే కొట్టియూర్ శివాలయం కన్నూర్ సమీపంలోని కొట్టియూర్ గ్రామంలో కలదు. కొబ్బరికాయలను కొట్టి ఆ నీళ్ళతో స్వామి వారిని అభిషేకించటం ఈ పండుగ ప్రత్యేకత. మే - జూన్ మాసాల మధ్యన జరిగే వైశాఖ పండుగని ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు.

PC :Deepesh ayirathi

13. పప్పినిస్సేరి

13. పప్పినిస్సేరి

కన్నూర్ నుండి కేవలం 10 కి.మీ. దూరంలో ఉన్న పప్పినిస్సేరి ఒక చిన్న గ్రామం. ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకి, ఆలయాలకి ప్రసిద్ది. బలియపటం నది, చుట్టు పక్కల చిన్న పర్వతాలు ఈ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకి కనువిందుచేస్తాయి. పంపురుతి (నదిలో ఉన్న అందమైన ప్రదేశం), వాదేశ్వరం హిల్ (కేరళ కైలసంగా స్థానికంగా ప్రసిద్ది) పప్పినిస్సేరిలో ఉన్న ప్రధాన ఆకర్షణలు.

PC :Ks.mini

14. సుందరేశ్వర ఆలయం

14. సుందరేశ్వర ఆలయం

కన్నూర్ పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మహా శివుడు, సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటాడు. ఏప్రిల్ - మే నెలల మధ్యలో ఉత్సవాలు సుమారు ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

PC : Jean-Pierre Dalbéra

15. తాలిపరంబ

15. తాలిపరంబ

సర్పిలాకార కొండలను చుట్టూ కలిగిన తాలిపరంబ కన్నూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. శ్రీ రాజరాజేశ్వర ఆలయం, త్రి చాంబరాం ఆలయం, ముతప్పాన్ ఆలయం లు ఇక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు.

PC :MANOJTV

Please Wait while comments are loading...