Search
  • Follow NativePlanet
Share
» »ఈ తిరుపతిలో పాదుకలతో కొట్టించుకొంటారు, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు

ఈ తిరుపతిలో పాదుకలతో కొట్టించుకొంటారు, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు

తెలంగాణలోని కురుమూర్తి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఈ క్షేత్రాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ సామాజికంగా వెనుకబడిన కులాలకే అగ్రస్థానం. వారే ఈ క్షేత్రంలో పూజలు, ఉత్సవాల సమయంలో ముందుండి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందువల్లే ఈ క్షేత్రంలో కులమతాలకు అతీతంగా అందరకూ కలిసి జాతర జరుపుకొంటారు. ఆ జాతర సమయంలో ఊరేగించే చెప్పులను తమ తలపై కొట్టించుకొంటారు. దీని వల్ల పాపాలు పోతాయని నమ్ముతారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి ఈ పేదల తిరుపతికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఆ పోలికలతో పాటు ఇక్కడ జరిగే విశేషాలతో కూడిన కథనం మీ కోసం...

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

తిరుపతికి కురుమూర్తికి అనేక పోలికలు ఉన్నాయి. తిరుపతి క్షేత్రం మేరుపర్వత పుత్రుడైన ఆందగిరి పై శ్రీనివాసుడు వెలిశాడని పురాణాలు చెబుతాయి. కురుమూర్తి కొండలూ ఆనందగిరిలో భాగమే

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

తిరుపతిలో విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు. కురుమూర్తిలో కూడా ఆ వినాయకుడి విగ్రహం లేదు. వేంకటేశ్వరుడు తిరుపతిలో ఏడు కొండల కొలువై ఉన్నాడు. కురుమూర్తిలో కూడా ఏడు కొండల పైనే ఉన్నాడు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

కురుమూర్తిలో ఉన్న ఏడు కొండలు వరుసగా శ్వేతాద్రి, ఏకాద్రి, కోటగట్టు, ఘనాద్రి, భల్లూకాద్రి, పతాగాద్రి, దైవతాద్రి. ఇందులో దైవతాద్రి పై శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

కుమూర్తిలో కూడా ఏడు కొండల పైనే ఈ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తిరుపతిలో స్వామివారు నిలుచొన్న భంగిమలో ఉంటాడు. ఇక్కడ కూడా స్వామి వారు నిలుచొన్న భంగిమలో దర్శనమిస్తాడు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

తిరుమలకు వెళ్లే సమయంలో శ్రీపాద చిహ్నాలు కలనిపిస్తాయి. కురుమూర్తిలో కూడా శ్రీపాద చిహ్నాలను మనం చూడవచ్చు. తిరుపతిలో స్వామివారికి అలిపిరి మండపం ఉన్నట్లుగానే ఇక్కడ ఉద్దాల మంటపం ఉంది.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

తిరుపతిలో స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో మోకాళ్ల గుండు కనిపిస్తుంది. కురుమూర్తిలో కూడా మనం అలాంటిది చూడవచ్చు. మొత్తంగా అక్కడ ఉన్న అనేక విషయాలతో కురుమూర్తి స్వామికి పోలికలు ఉన్నాయి.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

మహబూబ్ నగర్ నుంచి కురుమూర్తి దేవాలయం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. కురుమూర్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వేష్టేషన్ ఉంది.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం అమ్మాపూర్ లోనే ఏడు కొండల మధ్య కురుమూర్తి దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఏడాది పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఉద్దాల మహోత్సవం ప్రధానమైంది. ఉద్దాలు అంటే స్వామి వారి పాదుకలు అని అర్థం.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

కురుమూర్తి ఆలయానికి దళితులకు విడదీయరాని అనుబంధం ఉంది. వడ్డేమాన్ లోని దళితులు ఆవు చర్మంతో స్వామివారి పాదుకలను తయారు చేస్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

ఉత్సవాల్లో భాగంగా ఆ పదుకలను ఊరేగిస్తారు. ఈ పాదుకలు తాకడానికి లక్షల మంది పోటీ పడుతారు. అనంతరం ఆ పాదుకలతో తల పై కొట్టించుకొంటారు. దీని వల్ల పాలపాలు పోతాయని నమ్ముతారు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

కురుమూర్తి ఉత్సవాల్లో పుష్కరిణిలో స్నానాలు చేసి తడిదుస్తులతో కొండపైకి వెళ్లి దేవుడిని దర్శించుకొంటారు. మట్టి కుండల్లో నైవేద్యం సమర్పిస్తారు. ఉత్సవాల్లో స్థానికుల న`త్యాలు ఆకట్టుకొంటాయి.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

ఇక్కడ అమావాస్య రోజున స్వామివారిని వేల సంఖ్యలో సందర్శించుకొంటారు. వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమావాస్య రోజున పుణ్యక్షేత్ర దర్శనం ఇక్కడ ప్రత్యేకం.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

ఇక ఈ క్షేత్రం పురాణ కథనానికి వస్తే ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకునేందుకు కుబేరుడితో ఆ శ్రీనివాసుడు అప్పు చేస్తాడు. అయితే ఆ అప్పు తీర్చలేక పోవడంతో మనస్తాపం చెందుతాడు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి


P.C: You Tube

ఈ నేపథ్యంలో క`ష్ణానదీ తీరం వెంబడి వస్తూ కురుమూర్తి ప్రాంతానికి చేరుకొంటాడు. అక్కడ నదిలో కాళ్లు కడుక్కుంటూ ఉండగా క`ష్ణవేణమ్మ ప్రత్యక్షమమవుతుంది.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

వేంకటేశ్వరుడి కాళ్లు కందిపోకుండా పాదుకలను బహూకరించిందని చెబుతారు. క`ష్ణమ్మ చేసిన మేలుకు గుర్తుగా స్వామివారు ప్రతి ఏటా ఇక్కడ ఉద్దాలోత్సవం (పాదుకలోత్సాహం) జరిపిస్తానని మాట ఇచ్చాడు.

పేదల తిరుపతి

పేదల తిరుపతి

P.C: You Tube

అప్పటి మాటా ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతూనే ఉంది. 15వ శతాబ్దంలో కురుమూర్తికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ బంగారు ఆభరణాలను సమర్పించారు. అప్పటి నుంచి నేటి వరకూ ఉత్సవాల సందర్భంగా ఆ ఆభరణాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X