Search
  • Follow NativePlanet
Share
» »భూగర్భంలో సముద్ర గర్భంలో విహరించే అనుభూతిని పొందాలంటే చలో బాగ్ ఈ బహు

భూగర్భంలో సముద్ర గర్భంలో విహరించే అనుభూతిని పొందాలంటే చలో బాగ్ ఈ బహు

జమ్ము కాశ్మీర్ లోని బాగ్ ఈ బహు అక్వేరియం గురించి కథనం.

అక్వేరియం చూడటం అటు పిల్లలకే కాకుండా ఇటు పెద్దలకు కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదే. ఎందుకంటే ఒకే చోట ఒకటి కంటే ఎక్కువ రకాలైన చేపలను వివిధ రంగుల్లో చూడటం ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందుకే చాలా మంది తమ ఇళ్లలోనే అక్వేరియంను ఉంచేసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాలే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పెద్ద పెద్ద అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నాయి.

పట్టణాలకు దూరంగా ఉన్నవారే కాకుండా సదరు పట్టణ ప్రజలు కూడా వీకెండ్ వచ్చిందంటే చాలా అక్వేరియం చూడటానికి వెళ్లిపోతుంటారు. అయితే దేశంలో ఒక చోట భూ గర్భం లోపల అక్వేరియం ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే భూమిలోపల ఉన్న అక్వేరియంలలో విశాలమైనదని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

బాగ్ ఈ బహు

బాగ్ ఈ బహు

P.C: You Tube

బాగ్ ఈ బహు అక్వేరియం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ అక్వేరియం ఆకారం భూమి పై భాగంలో చేప ఆకారంలోనే ఉండటం విశేషం. చేప నోటి నుంచి మెట్ల ద్వారా భూ గర్భంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అటు పై భూ గర్భంలో ప్రధానంగా మూడు గుహలు ఉంటాయి.

బాగ్ ఈ బహు

బాగ్ ఈ బహు

P.C: You Tube

ఇందులో రెండు విశాలమైన గుహల్లో సముద్ర ప్రాంతంలో పెరిగే చేపలతో వివిధ రకాల సముద్ర జీవులను చూడవచ్చు. ఇక మూడో గుహను మరలా చిన్న చిన్న భాగాలు చేసి 13 అక్వేరియాలను ఏర్పాటు చేశారు. ఇందులో నదీ జలాలల్లో పెరిగే చేపలను ఇతర జీవులను దగ్గర నుంచి చూడటానికి వీలవుతుంది.

బాగ్ ఈ బహు

బాగ్ ఈ బహు

P.C: You Tube

మొత్తం ఈ భూగర్భ అక్వేరియంలో మొత్తం 400 జాతులకు చెందిన దేశ, విదేశాలకు చెందిన సముద్ర, నదీ జలాల్లో పెరిగే జీవులను చూడటానికి వీలవుతుంది. ఇక సముద్ర గర్భంలో ఎటువంటి ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఈ అక్వేరియంలో క`త్రిమంగా అటు వంటి వాతావరణ పరిస్థితినే ఏర్పాటు చేశారు.

బాగ్ ఈ బహు

బాగ్ ఈ బహు

P.C: You Tube

దీంతో మనం స్వయంగా సముద్ర గర్భంలోకి వచ్చామా అన్న అనుభూతి కలుగుతుంది. స్థానిక విద్యార్థులతో పాటు ప్రజలకు సముద్ర జీవుల పై అవగాహన కల్పించడానికి ఈ భూగర్భ అక్వేరియంను ఏర్పాటు చేశారు. అక్వేరియం గోడల పై సముద్ర జలాలలకు సంబంధించిన అనే విషయాలను తెలియజేస్తూ చార్టులు, బొమ్మలను కూడా మనం చూడవచ్చు. ఈ అక్వేరియం చుట్టు పక్కల చరిత్రను తెలియజేసే ఎన్నో కోటలు ఉన్నాయి. అందులో బహు కోట ఒకటి.

బాగ్ ఈ బహు

బాగ్ ఈ బహు

P.C: You Tube

ఈ అక్వేరియం లోనికి వెళ్లడానికి ప్రవేశ రుసుం ఉంటుంది. అది పెద్దలకు రూ.15 కాగా, చిన్నపిల్లలకు రూ.5 రుపాయాలు. మీతో పాటు పెంపుడు జంతువులను లోనికి తీసుకువెళ్లడానికి కుదరదు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ అక్వేరియం అందుబాటులో ఉంటుంది. జమ్ము కాశ్మీర్ లోని జమ్ము నగరంలో ఈ అత్యంత అరుదైన భాగ్ ఈ బహు అక్వేరియం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X