Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు నేల పై ఈ జలపాతాల హొయలు ఈ వర్షాకాలంలో చూడాల్సిందే

తెలుగు నేల పై ఈ జలపాతాల హొయలు ఈ వర్షాకాలంలో చూడాల్సిందే

ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రకృతి సంపదకు నిలయాలు. అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణాలో కూడా పచ్చటి అడవులు, పరవళ్లు తొక్కే నదీ జలాలు, అంతెత్తు నుంచి కిందికి దుముకే జలపాతాలకు కొదువు లేదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆ ప్రకృతి వరణుడి కరుణతో మరింతగా పులకించి పోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో దండిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో నదీ జలాలు పొంగిపొర్లుతూ సముద్రం వైపు ఉరకలు వేస్తున్నాయి. ఈ క్రమంలో జలపాతాలుగా ఏర్పడిన చోట మరింత హొయలు పోతూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఎత్తిపోతల జలపాతం, మల్లెల తీర్థం, పోచారం జలపాతం, తలకోన, తాడిమడ జలాపాతాలు మరింత అందంగా కనిపిస్తాయి. దీంతో ఆయా జలపాతలు ఉన్న ప్రదేశాలతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల వివరాలు మీ కోసం ఈ కథనంలో

ఎత్తిపోతల వాటర్ ఫాల్స్

ఎత్తిపోతల వాటర్ ఫాల్స్

P.C: You Tube

హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అన్ని జలపాతాలతో పోలిస్తే ఎత్తిపోతల జలపాతం చాలా అందమైనది. ఈ ఎత్తి పోతల జలపాతం చుట్టు పచ్చని సోయగం మనసును తుళ్లింత చేస్తుంది. వీకెండ్ సమయంలో ఒక రోజు మొత్తం గడపడానికి ఈ జలపాతం సరైన ప్రాంతం.

ఎంత దూరం....నాగార్జున సాగర్ కు కేవలం 14 కిలోమీటర్ల దూరం
హైదరాబాద్ కు 176 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

P.C: You Tube

క`ష్ణ నది అంతెత్తు నుంచి కిందికి దుమకడం వల్ల ఈ మల్లెల తీర్థం జలపాతం ఏర్పడుతుంది. నల్లమల అడవుల్లో ఉన్న ఈ మల్లెల తీర్థం చేరుకోవడానికి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అయితే ఈ జలపాతం చేరుకోగానే ఆ నీటి తెంపరల అందాలకు అప్పటి వరకూ ఉన్న అలసట మొత్తం దూది పింజెలా ఎగిరిపోతుంది.

ఎంత దూరం.... శ్రీ శైలం నుంచి 58 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్లు

దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు... మల్లికార్జున దేవాలయం, సాక్షి గణపతి, పాలదార, పంచదార, పాతాల గంగ డ్యాం.

పోచారం ఫాల్స్

పోచారం ఫాల్స్

P.C: You Tube

పోచారా జలపాతం విశిష్టమైనది. దీనికి కింద ఉన్న బండల వల్ల ఒక మెట్ల వలే నీరు పై నుంచి కిందికి జారుతూ అందంగా కనిపిస్తుంది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కురిసే ఈ జలపాతాన్ని చూస్తూ పిల్లలు, పెద్దలు అన్న బేధం లేకుండా ప్రతి ఒక్కరూ కేరింతలు కొడుతూ సమయాన్ని ఇట్టే మరిచిపోతారు. వర్షాలు బాగా పడే సమయంలో ఈ జలపాతం కిందికి వెళ్లడం అంత మంచిది కాదు.

ఎంత దూరం.... హైదరాబాద్ నుంచి 257 కిలోమీటర్లు, కుంతల జలపాతానికి కేవలం 22 కిలోమీటర్లు

దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు... బాసర సరస్వతి దేవాలయం, నిర్మల్, కవ్వాల్ అభయారణ్యం, ప్రాణహిత అభయారణ్యం, సువర్ణపురి

తలకోన

తలకోన

P.C: You Tube

చిక్కటి అడవి మధ్యలో ఉన్న తలకోన జలపాతం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. ఈ తలకోన జలపాతంలోని నీటికి వివిధ రోగాలను నయం చేసే శక్తి ఉందనినమ్ముతారు. ఔషద మొక్కల నుంచి తరలి వచ్చే నీరు జలపాతం ఏర్పడటం ఇందుకు కారణమని చెబుతారు.

ఎంత దూరం.... పీలేరుకు 49 కిలోమీటర్లు, తిరుపతికి 58 కిలోమీటర్లు

దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు... సిద్దేశ్వరస్వామి దేవాలయం, తిరుమల, తిరుపతి, శ్రీ కాళహస్తి, తుంబుర తీర్థం, జింకలపార్కు, టీటీడీ ఉద్యానవనం

తాడిమడ జలపాతం

తాడిమడ జలపాతం

P.C: You Tube

దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి పడే ఈ జలపాతం ఈ వర్షాకాలంలో చూడదగిన జలపాతాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. అనంతగిరి నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతం వద్దకు చేరుకోవడం ఎంతో హాయిగా ఉంటుంది. వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది ట్రెక్కర్స్ వస్తుంటారు.

ఎంత దూరం...అరకు నుంచి 30 కిలోమీటర్ల దూరం, అనంతగిరి నుంచి 3కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 645 కిలోమీటర్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X