Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ప్రసాదం ఆ నీటిలో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, చర్మవ్యాధులకు

ఇక్కడ ప్రసాదం ఆ నీటిలో వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, చర్మవ్యాధులకు

భారత దేశంలో దేవాలయాలు లేని ఊరు లేదు. ఒక్కొక్క దేవాలయాది ఒక్కొక్క విశిష్టత. ఇటుంటి కోవకు చెందినదే తెలంగాణలోని కేతకి సంగమేశ్వర దేవాలయం. ఇక్కడ నీటి గుండం నుంచి పూజా విధానం వరకూ అన్ని విశిష్టతలే. శివుడికి ఎక్కడా లేని విధంగా ఇక్కడ మొగలి రేకుతో పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ నీటి గుండం లో అద్భుతమే జరుగుతుంది. దీనిని చూడటానికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవాయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

కేతకి వనం

కేతకి వనం

P.C: You Tube

బ్రహ్మదేవుడు జ్జాన సముపార్జనకు అనువైన స్థలం కోసం వెదుకుతూ ఉండగా మెదక్ జిల్లాలోని ప్రస్తుతం ఝరాసంగంలోని సంగమేశ్వరాలయం ఉన్న కేతకి వనం అనువైన ప్రాంతంగా అనిపించింది. అక్కడ బ్రహ్మదేవుడు శివుడు కోసం తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మకు జ్జానాన్ని బోధిస్తాడు. అంతేకాకుండా బ్రహ్మ దేవుడి కోరిక మేరకు అక్కడే స్వయంభువుగా లింగ రూపంలో వెలుస్తాడు.

మొగలి పూవులతో

మొగలి పూవులతో

P.C: You Tube

అంతట బ్రహ్మ ఆ శివలింగానికి మొగలి పూవులతో పూజజేస్తాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. బ్రహ్మ, పరమేశ్వరుల సంగమంతో ఈ క్షేత్రం ఏర్పడం వల్ల దీనికి సంగం అని పేరు. కేతకి వనంలో పరమశివుడు కొలువై ఉండటంవల్ల ఈ క్షేత్రానికి కేతకీ సంబమేశ్వరాలయం అని పేరు. ఇక ఇక్కడి గుండంలోకి నీరు కాశీ నుంచి వస్తుంది కాబట్టి దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు.

రాజు చర్మవ్యాధి నయమవుతుంది.

రాజు చర్మవ్యాధి నయమవుతుంది.

P.C: You Tube

అంతేకాకుండా ఇక్కడ ఉన్న గుండంలో ఎనిమిది నదుల ఝరలు కలిస్తాయి కాబట్టి దీనిని ఝరాసంగమమని అంటారు. ఇక పురాత దేవాలయానికి సంబంధించిన ఓ గాథ ప్రచారంలో ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం భారత దేశాన్ని సూర్య వంశీయుడైన కుపేంద్ర రాజు పాలించేవాడు. ఆయనకు తీవ్ర మైన చర్మవ్యాధి ఉండేది. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలా కేతకీ వనానికి ఒక రోజు సైనికులతో కలిసి ఆయన వేటకు వెళ్లి తీవ్రంగా అలసిపోయాడు. దాహం తీర్చుకోవడానికి ఈ వనంలో ఉన్న కుండంలో నీరు తాగాడు. ఆశ్చర్యంగా అతని చర్మ వ్యాధి అప్పటికప్పుడు నయమై పోయింది. దీంతో ఆయన ఈ క్షేత్రం మహిమ తెలుసుకొని ఇక్కడి సంగమేశ్వరుడికి ఆలయం నిర్మించి నిత్య ధూప, దీపాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఔషద గుణాలు ఉండటం వల్లే

ఔషద గుణాలు ఉండటం వల్లే

P.C: You Tube

కాగా అన్ని దేవాలయాల్లో కుండం దేవాలయం ముందు భాగంలో ఉంటే ఇక్కడ దేవాలయం వెనుక భాగంలో ఉండటం విశేషం. ఈ కుండంలోకి నైరుతి దిశ నుంచి జలధార వస్తుంది. ఇక్కడ ప్రజలు పూజ అనంతరం ప్రసాదాలను విస్తరాకుల్లో పెట్టి ఈ కుండంలోని నీటిలో వదులుతారు. ప్రసాదం నీటి ధారకు వ్యతిక దిశలో ప్రయాణం చేస్తాయి. ఈ నీటిలో ఔషద గుణాలు ఉండటం వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానిక భక్తులు కమ్మకం. అందువల్లే ఈ నీటిలో స్థానం చేస్తే ఎటువంటి చర్మవ్యాధులైనా సమిసిపోతాయని చెబుతారు.

ఎలా చేరుకోవాలి.

ఎలా చేరుకోవాలి.

P.C: You Tube

హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై ఉన్న జహీరాబాద్ కు 17 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక సంగరెడ్డి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఈ ఝరా సంగమేశ్వర ఆలయం ఉంది. నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X