Search
  • Follow NativePlanet
Share
» »3000వేల నాటి చెట్టు, పులి పంజా కాలుతో వినాయకుడు ఇక్కడే

3000వేల నాటి చెట్టు, పులి పంజా కాలుతో వినాయకుడు ఇక్కడే

తమిళనాడులోని త్రిమూర్తి విగ్రహాలు ఒకే ఆలయంలో కొలువుతీరి ఉన్న కొడుముడి దేవాలయానికి సంబంధించిన కథనం.

హిందూ పురాణాలను అనుసరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిపి త్రిమూర్తులని అంటారన్న విషయం మనకు తెలిసిందే. మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ముగ్గురికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ త్రిమూర్తులైన ముగ్గురికీ కలిపి ఒకే ఆలయం ఉండటం అరుదైన విషయం.

అటువంటి అరుదైన దేవాలయం మన తమిళనాడులోనే ఉంది. ఇక్కడ మేరు పర్వతం పడి శివలింగంగా మరిందని కథనం. అదే విధంగా ఇక్కడి విష్ణువును సందర్శించుకుంటే వివాహం కానివారికి త్వరగా వివాహమవుతుందని చెబుతారు.

ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మ ఓ చెట్టు రూపంలో ఉన్నారు. ఈ చెట్టుకు ఒక వైపున ముల్లులు ఉంటే మరో వైపున ఉండవు. అదే విధంగా ఈ చెట్టు ఆకును నీటిలో వేస్తే ఆ నీరు ఎన్ని రోజులైనా కలుషితం కావని స్థానిక భక్తుల నమ్మకం. అటువంటి అరుదైన దేవాలయం గురించిన మరిన్ని వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం....

 ఎవరు గొప్ప

ఎవరు గొప్ప

P.C: You Tube

పురాణ కథనం ప్రకారం ఆదిశేషుడికి, వాయుదేవుడికి మధ్య ఎవరు గొప్ప అనే అనే వాగ్వదం మొదలయ్యింది. చివరికి ఇద్దరూ తమ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకొంటాడు.

వాయు దేవుడు

వాయు దేవుడు

P.C: You Tube

ఇక వాయు దేవుడు అక్కడ గట్టిగా ఊదుతాడు. వాయు దేవుడి ప్రతాపానికి మేరు పర్వత శిఖరం ఐదు ముక్కలుగా విడిపోయి వేర్వేరు ప్రదేశాల్లో పడిపోయింది. అలా ఒక ముక్క ఈ కొడుమూడిలో పడి శివలింగం రూపు దాల్చిందని కథనం.

అగస్త్య మహామునికి

అగస్త్య మహామునికి

P.C: You Tube

ఆ లింగాన్నే ప్రస్తుతం ముఘ్దేశ్వర లింగం అని పిలుస్తూ నిత్య పూజలు జరుపుతున్నారు. అదే విధంగా శివుడి పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి బట్టలతో శివుడు పార్వతీ దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రాంతంలోనే మొదట దర్శనమిచ్చడాని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని సౌందర్య వల్లి పేరుతో కొలుస్తారు.

శివతాండవం

శివతాండవం

P.C: You Tube

అలాగే భరద్వాజ మహర్షి ఇక్కడ శివ తాండవాన్ని ప్రత్యక్షంగా చూశాడని పురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు పుష్కరాలు ఉన్నాయి. వాటిలో జలం పరమ పవిత్రమైనదని చెబుతారు.

 రాహు, కుజ దోషం

రాహు, కుజ దోషం

P.C: You Tube

అదేవిధంగా విష్ణుమూర్తి రూపాన్ని వీరనారాయణ పెరుమాళ్ అని పిలుస్తారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అనే పేరుతో కొలుస్తారు. పెళ్లికానివారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకొంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. రాహు, కేతు, కుజదోషం ఉన్నవారు కూడా ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

బ్రహ్మ దేవుడు

బ్రహ్మ దేవుడు

P.C: You Tube

ఈ ఆలయంలోనే బ్రహ్మ దేవుడు వన్ని (సీమజాల) చెట్టు రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ చెట్టు దాదాపు 3వేల సంవత్సరాలదని కథనం. ఆ చెట్టుకు ఒకవైపున ముల్లులు ఉంటే మరో వైపునా ఉండవు. అంతేకాకుండా దీనికి ఇప్పటి వరకూ పూలు కూడా పూయలేదు.

వినాయకుడు

వినాయకుడు

P.C: You Tube

ఇక్కడ ఆలయంలోని వినాయకుడి విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు శిరస్సుతో ఉన్న గజముఖుడికి కాళ్లు మాత్రం పులి పంజాలా ఉంటాయి. కాగా, కావేరి నదీ తీరంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.

ఎక్కడ ఉంది.

ఎక్కడ ఉంది.

P.C: You Tube

తమిళనాడులోని ఊరోడ్ జిల్లాలో ఉన్న కొడుముడి ఒక చిన్న పట్టణం. బెంగళూరు నుంచి ఇక్కడకు 292 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి ఇక్కడకు బస్సులు, రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X