Search
  • Follow NativePlanet
Share
» »ఒక క్షేత్రం, రెండు దేవాలయాలు, అద్భుతాలు ఎన్నో చూసి తీరాల్సిందే....

ఒక క్షేత్రం, రెండు దేవాలయాలు, అద్భుతాలు ఎన్నో చూసి తీరాల్సిందే....

వాడపల్లి అగస్తేశ్వర దేవాలయం, వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ గురించిన కథనం

శివకేశవులకు భేదం లేదని నిరూపించే ఆలయాలు, క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి కోవకు చెందినదే ప్రస్తుతం ఇక్కడ మనం చెప్పుకోబోయే క్షేత్రం. ఇక్కడ నారాయణుడు నరసింహుడి రూపంలో ఉంటాడు. అదే విధంగా పరమేశ్వరుడు శివలింగం రూపంలో ఉంటాడు. ఇదిలా ఉండగా ఈ రెండు దేవాలయాలు కూడా ఆ కష్ణా నది ఒడ్డునే ఉంటాయి. ఈ రెండు దేవాలయాలకు సంబంధించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం....

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఆలయం తూర్పు దిక్కుగా ఉంటుంది. సంగమాభిముఖంగా ఉంటుంది. గుడిలో శివుడికి పానుపట్టం ఎత్తుగా ఉంటుంది. దాని మీద లింగం ఇంకో రెండు అడుగులు ఉంటుంది.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఈ శివలింగానికి శిరస్సు భాగంలో నీరు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉంటుంది. ఈ నీటి మట్టం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అయితే నీరు తోడితే మాత్రం మన చేతికి వస్తుంది.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఇక ఈ నీరు ఎక్కడ నుంచి వస్తోందన్న దానికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం తెలియడం లేదు. ఈ శివలింగానికి వెండితో కళ్లు, వెండి నాగుపాము అలంకరణ చేసి విశేష పూజలు చేసే సమయంలో చూడటానికి రెండు కళ్లు చాలవు.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఇక్కడ స్వామివారు దక్షిణాముఖంగా ఉంటారు. ఆలయం చిన్నదైనా భక్తుల కోరిన కోర్కెలు నెరవేర్చే స్వామిగా ఇక్కడి నరసింహ స్వామికి పేరుంది.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఇక్కడ అమ్మవారు స్వామి తొడ మీద కూర్చొని ఉంటారు. గర్భగుడిలో స్వామి ముఖానికి ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం ఉంటుంది.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

మరో దీపం స్వామి కింద కాళ్ల దగ్గర ఉంటుంది. ఇక్కడ స్వామి ముకానికి ఎదురుగా ఉన్న దీపం ఎప్పుడూ కదులుతూ ఉండగా కింద ఉన్న దీపం అసలు కదలదు.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

పైన్న ఉన్న దీపం స్వామి వారు శ్వాస తీసుకొని వదలుతున్నారనడానికి నిదర్శనమనిచెబుతారు. గాలికి ఈ దీపం కదులుతున్నదేమో అని ప్రశ్నిస్తే ఆ గర్భగుడిలోకి గాలి వచ్చే ఆస్కారమే లేదు.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

అంతే కాకుండా గాలికి కదిలినట్లయితే అదే గర్భగుడిలో కింద ఉన్న దీపం కదలదు కదా అని చెబుతారు. ఈ విషయం పై శాస్త్రీయ పరిశోధనలు జరిగినా ఫలితం తేలలేదు.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

ఈ క్షేత్రం నదీ సంగమ క్షేత్రం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం చేయడం, శ్రాద్ధ కర్మలు చేస్తుంటారు. ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులు ఉన్నాయి.

వాడపల్లి

వాడపల్లి

P.C: You Tube

అంతేకాకుండా పిడుగురాళ్లు వెళ్లే బస్సులు వాడపల్లి నుంచే వెలుతాయి. దగ్గరగా మిర్యాల గూడ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల ద్వారా వాడపల్లికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X