Search
  • Follow NativePlanet
Share
» »దిండిగల్ - సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫోర్ట్ !

దిండిగల్ - సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫోర్ట్ !

దిండిగల్ నగరానికి గల నిక్ నేమ్ లు : ది సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫోర్ట్, బిర్యానీ సిటీ, సిటీ అఫ్ లాక్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ టానరీ వంటి పేర్లతో పిలుస్తారు.

By Mohammad

దిండిగల్ తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ నగరానికి ఒకవైపు పళని కొండలు, మరోవైపు సిరుమలై కొండలు వ్యాపించి ఉన్నాయి. దిండిగల్ లో దిండు అంటే పిల్లో లేదా దిండు అని, కల్ అంటే రాయి అని అర్థం. ఈ నగరానికి గల నిక్ నేమ్ లు : ది సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఫోర్ట్, బిర్యానీ సిటీ, సిటీ అఫ్ లాక్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ టానరీ వంటి పేర్లతో పిలుస్తారు.

ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన కోటలు , దేవాలయాలు, నదులు మరియు ఇతర ఆకర్షణలు దిండిగల్ ను ఒక పర్యాటక ప్రాంతంగా మార్చేశాయి. వైగై, మురుడా మరియు మంజలరు నదుల సంగమ ప్రదేశాలలో ఉన్న ప్రదేశం ఇక్కడి మరో ప్రధాన దర్శనీయ స్థలం. ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలను సైతం దిండిగల్ చుట్టూ ఉన్న పర్వతాలలో చేయవచ్చు. బిర్యానీ కి దిండిగల్ ఫెమస్. ఇక్కడి బిర్యానీ రుచి చూడందే పర్యటన పూర్తికాదు !!

దిండిగల్ రాక్ ఫోర్ట్

దిండిగల్ రాక్ ఫోర్ట్

దిండిగల్ ఫోర్ట్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కొండలపై, సముద్రమట్టానికి 288 అడుగుల ఎత్తులో ఈ బృహత్తర నిర్మాణాన్నిమదురై పాలకులు శ్రీ ముత్తు కృష్ణ నాయకర్ నిర్మించాడు. చరిత్ర మీద ఆసక్తి గలవారు ఈ కోటను తప్పక వీక్షించాల్సిందే!

చిత్రకృప : Raghunath Thirumalaisamy

అబిరామి టెంపుల్

అబిరామి టెంపుల్

ఈ టెంపుల్ లో అబిరామి అమ్మన్ దేవతను పూజిస్తారు. నగరం నడి మధ్యలో ఉన్న ఈ దేవాలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుపుతారు. కోలు ను కూడా ఉంచుతారు. ఆది తమిళ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి పువ్వులతో అలంకరించబడిన పల్లకిలో ఊరేగిస్తారు.

చిత్రకృప : Raghunath Thirumalaisamy

ఆంజనేయర్ గుడి

ఆంజనేయర్ గుడి

నిలకోట్టై తాలూకాలోని అనపట్టి లో ఉంది ఈ ఆలయం. దీనిని మదురై రాణి మంగమ్మ చే 300 ఏళ్ళ క్రితం నిర్మితమైనది. సమీపాన పెరనై బ్రిడ్జి సందర్శించదగినది. బ్రిడ్జి లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో తాకినప్పుడు దేవాలయంలోని విగ్రహం సగం వరకు నీటిలో మునిగి ఉంటుంది.

చిత్రకృప : Rseics

తాడికొంబు పెరుమాళ్ కోవిల్

తాడికొంబు పెరుమాళ్ కోవిల్

దిండిగల్ నుండి 5 కి.మీ ల దూరంలో, కరూర్ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం లార్డ్ అలగార్. ఏప్రియల్, మే నెలలో 12 రోజుల పాటు గుడిలో పెద్ద ఎత్తున జాతర, ఉత్సవాలు జరుపుతారు. ఇది తమిళనాడు క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో వస్తుంది.

చిత్రకృప : Ranjithsiji

కోట్టై మరియమ్మన్ కోవిల్

కోట్టై మరియమ్మన్ కోవిల్

ఈ గుడి 200 సంవత్సరాల పురాతనమైనది. ఇందులోని ప్రధాన విగ్రహాన్ని టిప్పుసుల్తాన్ ప్రతిష్టించాడని నమ్ముతారు. ఈ దేవాలయంలో మురుగన్, వినాయకుడు, దుర్గా మరియు కాళీ మాత తో పాటు మిగితా విగ్రహాలకు పూజలు చేస్తారు. దీనిని చతురస్త్రాకారంలో నిర్మించారు.

చిత్రకృప : Ssriram mt

దిండిగల్ హిల్

దిండిగల్ హిల్

దిండిగల్ కొండలు ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. ఈ కొండలు పేరు మీద ఈ ప్రాంతానికి ఆపేరొచ్చింది. దిండిగల్ ఫోర్ట్ కూడా కొండపైనే ఉన్నది. కొండ పై నుండి పర్యాటకులు నగర విహంగ వీక్షణం చేయవచ్చు. కొండ పైకి ట్రెక్కింగ్ చేయవచ్చు.

చిత్రకృప : Mike Prince

కామరాజర్ లేక్ అండ్ డ్యాం

కామరాజర్ లేక్ అండ్ డ్యాం

అథూర్ గ్రామం సమీపాన కామరాజన్ లేక్ మరియు డ్యాం ఉన్నది. వీటి చుట్టూ అరటి తోటలు, కొబ్బరి చెట్లు, ఏలకుల ఎస్టేట్స్ మొదలుగునవి ఉన్నాయి. వేలావ్ జాతి పక్షులను సరస్సు ఒడ్డున వీక్షించవచ్చు.

చిత్రకృప : Kumarvaibhavame

బేగంబుర్ బిగ్ మాస్క్

బేగంబుర్ బిగ్ మాస్క్

ఈ మాస్క్ ను హైదర్ అలీ 300 సంవత్సరాల క్రితం కట్టించాడు. ఇందులో అయన చెల్లెలు అమ్మేర్ - ఉన్ - నిషా బేగం ను పాతిపెట్టారు. ఈమెనే బేగంబుర్ అని కూడా పిలుస్తారు. ఆమె పేరు మీదనే ఈ మాస్క్ కు ఆపేరొచ్చింది.

చిత్రకృప : Ssriram mt

సెయింట్ జోసెఫ్ చర్చి

సెయింట్ జోసెఫ్ చర్చి

క్రీ.శ. 1866 - 1872 మధ్య సెయింట్ జోసఫ్ చర్చి ని నిర్మించారు. ఇది రోమన్ క్యాథలిక్ చర్చి లలో ప్రధానమైనది. గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ వేడుకలు చర్చిలో ఘనంగా జరుపుతారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

చిత్రకృప : Ssriram mt

క్రిస్ట్ ది కింగ్ చర్చి

క్రిస్ట్ ది కింగ్ చర్చి

కొడైకెనాల్ కు కోకర్స్ వాక్ కు సమీపాన ఉన్నది క్రిస్ట్ ది చర్చి. గ్రానైట్ తో నిర్మితమైన ఈ చర్చి కలోనియల్ కాలం నాటిదిగా ప్రసిద్ధి చెందినది.

చిత్రకృప : Ssriram mt

చిన్నాలపట్టి

చిన్నాలపట్టి

చిన్నాలపట్టి దిండిగల్ లోని చిన్న నగరం. డ్యాం, సిరిమలై హిల్స్, మాతా మందిరం, డ్యాం, కుట్లడంపత్తి జలపాతాలు, థీమ్ పార్క్ మరియు లేక్ హౌస్ లు, రిసార్టులు వంటి టూరిస్ట్ స్పాట్ లు ఈ నగరంలో చూడవచ్చు.

చిత్రకృప : Kreativeart

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

దిండిగల్ లో చూడవలసిన ఇతర ఆకర్షణలు : కాశీవిశ్వనాథ ఆలయం, కామాక్షి అమ్మన్ దేవదానపట్టి, వైగై, మరుడా, మంజలరు నదులు, అవి కలిసే సంగమ ప్రదేశంలో ఉన్న పవిత్ర స్థలం, మాలకోట్టై కొండల మీదకు ట్రెక్కింగ్ మొదలుగునవి.

చిత్రకృప : Theni.M.Subramani

వంటకాలు

వంటకాలు

దిండిగల్ దక్షిణ భారతదేశంలో వంటకాలకు ప్రసిద్ధి చెందినది. ముఖ్యంగా బిర్యానీ కి దిండిగల్ బాగా ఫెమస్. అంతేకాదు మరెన్నో వంటకాలు ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడి వంటల రుచి చూడందే పర్యటన పూర్తికాదు!

చిత్రకృప : Arul Raj C

వాతావరణం

వాతావరణం

దిండిగల్ లో వాతావరణం ఎండాకాలం ఎండగా ఉంటుంది. కనుక వర్షాకాలం, చలికాలం పర్యటనకు ఉత్తమం. ఆ సమయంలోనే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పర్యటనకు అనుకూలిస్తుంది. సందర్శించు సమయం : సెప్టెంబర్ నుండి మర్చి వరకు.

చిత్రకృప : Bikash Das

బస

బస

దిండిగల్ ఒక నగరం. ఇక్కడ పర్యాటకులు రిసార్ట్, స్టార్ హొటల్స్ లలో ఉండవచ్చు. మధ్యతరగతి వారికి కూడా గదులు అందుబాటు ధరల్లోనే దొరుకుతాయి. లగ్జరీ, డీలక్స్, ఏసీ, నాన్ - ఏసీ తరగతి గదులు లభ్యమవుతాయి.

చిత్రకృప : Mike Prince

దిండిగల్

దిండిగల్

వాయు మార్గం : సమీపాన 84 కి.మీ ల దూరంలో మదురై ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుంచి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి దిండిగల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : దిండిగల్ లో రైల్వే స్టేషన్ కలదు. చెనని, కోయంబత్తూర్, కన్యాకుమారి, మదురై, త్రివేండ్రం తదితర ప్రాంతాల నుండి ఎల్లప్పుడూ రైళ్ళు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటాయి. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ మొదలగు రైళ్ళు ఆగుతాయి.

బస్సు మార్గం : దిండిగల్ గుండా రెండు జాతీయ రహదారులు పోతున్నాయి. చెనని, మదురై, కన్యాకుమారి మరియు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి ఇక్కడికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Karthikeyanvirus

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X