Search
  • Follow NativePlanet
Share
» »మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా?

మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా?

By Venkatakarunasri

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం చెపుతారు. ఈ పండుగ వేడుకలలో లెక్కకు మించిన దీపాలు ప్రతి ఇంటా వెలుగుతాయి. రంగు రంగుల మిరుమిట్లు గొలిపే కాంతుల టపాసులు పేలుస్తారు. ప్రజలు వారి వారి ఆచారాలు, సంప్రదాయాలతో ఈ పండుగను ప్రతి ఇంటా వైభవోపేతంగా నిర్వహిస్తారు. మరి అటువంటి పండుగను వివిధ రాష్ట్రాలలో ఎలా జరుపుతారనేది పరిశీలిద్దాం. భారత దేశంలో దక్షిణాదిన కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీర్ వరకూ గల రాష్ట్రాలలోని ప్రజలు విభిన్న సంస్కృతులు కలిగి వున్నారు. అయినప్పటికీ వీరందరూ కొన్ని పండుగ వేడుకలను వారి వారి స్థానిక ఆచారాలు, సంప్రదాయాలతో దాదాపు ఒకే సమయంలో జరుపుకుంటారు. వాటిలో దీపావళి పండుగ ఒకటి. దీనిని దీపాల వెలుగుల పండుగ అని అంటారు.

వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగ

వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగ

దేశంలో అట్టహాసంగా జరిగే ఈ దీపావళి పండుగ పెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగను వివిధ ప్రాంతాలలో మూడు నుండి అయిదు రోజుల వరకూ జరిపి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా, ప్రతి వారూ తమ స్నేహితులను, బంధువులను కలుసుకొని ఆనందిస్తారు. స్వీట్ లు ఒకరితో మరి ఒకరు పంచుకొని సంతోషంగా గడుపుతారు.

pc: youtube

వివిధ రాష్ట్రాల దీపావళి వేడుకలు

వివిధ రాష్ట్రాల దీపావళి వేడుకలు

భారత దేశం విభిన్న సంస్కృతుల నిలయం. అనేక మతాలు, అనేక కులాలు ప్రజలలో కలవు. అయినప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతానికి అందరూ కట్టుబడి వారి వారి ఆచారాలు సంప్రదాయాలు ఆచరిస్తూ, ఇతర మతాల వారి సంప్రదాయాలను కూడా గౌరవిస్తారు.

pc: youtube

వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగ

వివిధ రాష్ట్రాలలో దీపావళి పండుగ

ఈ దేశంలో పరమత సహనం అనాది కాలంగా వస్తోంది. ప్రజల జీవితాలలో ఇతరుల పట్ల అవగాహనా శక్తి అధికమైంది. ప్రతి వ్యక్తి కూడా తన విసిష్టతలను కాపాడుకుంటూ తన మతంలోని ఆచారాలూ సంప్రదాయాలూ పాటిస్తాడు. అనాది కాలంగా వస్తున్న, ఈ దీపావళి పండుగను దేశంలో అన్ని మతాలవారూ వివిధ తీరులలో ఆనందిస్తూనే వున్నారు.

కర్నాటక

కర్నాటక

కర్నాటక రాష్ట్రంలోని కన్నడిగులకు ఈ పండుగ లోని ఒకటవ మరియు మూడవ రోజులు ప్రత్యేకత కలిగినవి. ఆశ్వీయుజ కృష్ణ చతుర్దశి అంటే దీపావళి మొదటి రోజును వీరు నరక చతుర్దశి అనే పేరుతో ఆచరిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, తాను నరకాసుర రాక్షుసుడిని వధించిన తర్వాత, తన శరీరం ఆ రక్తం నుండి శుభ్రపరచు కొనేటందుకు అభ్యంగన స్నానం ఆచరించాడని చెపుతారు. అందుకు గుర్తుగా కుటుంబం లోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ రోజు అభ్యంగన స్నానం చేస్తారు.

pc: youtube

కర్నాటక

కర్నాటక

తాము స్నానం చేసే నీటిలో గంగా మాత వుందని, శరీరానికి మర్దన చేసే నూనె లో లక్ష్మి దేవి వుందని భావిస్తారు. ప్రతి రోజూ స్నానం చేసినప్పటికీ, ఈ రోజు చేసే అభ్యంగన స్నానానికి ప్రత్యేకత చూపుతారు. దీపావళి మూడవ రోజును బాలి పాడ్యమిగా భావిస్తారు. ఈ రోజున కుటుంబంలోని మహిళలు ఇంటిముందు చక్కగా రంగోలి అలంకరిస్తారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు. ఈ బాలి పాడ్యమి కి సంబంధించిన కధలు ఎన్నో కలవు. ఈ రోజున బలి చక్రవర్తి ప్రతి ఇంటికి వస్తాడని చెపుతారు. తులసి పూజ వరకూ వేడుకలు జరుగుతాయి

మహారాష్ట్ర

మహారాష్ట్ర

మహారాష్ట్ర లో ప్రజలు ఈ పండుగను అయిదు రోజుల పాటు జరుపుతారు. వీరు ఒక ఆవుకు దాని దూడకు హారతి ఇవ్వటంతో పండుగ మొదలు పెడతారు. అమావాస్య నాడు లక్ష్మి పూజ చేస్తారు. లక్ష్మి దేవి విగ్రహం వద్ద ఇంటిలోని ఆభరనాలు వుంచి పూజ చేస్తారు. తమకు అధిక ఐశ్వర్యం, జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇంటిలో తమకు నచ్చిన అనేక రకాల తీపి, ఇతర వంటకాలు చేసుకొని తిని ఆనందిస్తారు. ఇరుగు పొరుగులకు పంచి పెడతారు. రాత్రి అయ్యిందంటే చాలు, నల్లని అమావాస్య రోజు రాత్రి చీకటిలో బాణా సంచా కాలుస్తారు.

pc: youtube

ఓడిషా

ఓడిషా

ఓడిషా లో ఈ పండుగను పెద్దల పండుగ గా ఆచరిస్తారు. తమ పూర్వీకులు ఈ అమావాస్య రోజున ఆకాశంలో వచ్చి విహరిస్తున్నారని భావిస్తారు. వారి ఆత్మ శాంతి కి మోక్షం కలిగేందుకు, వెలుగులు చూపాలని బాణ సంచా కాలుస్తారు. ఓడిషా లో ఈ అంశం పండుగలోని ప్రధాన అంశంగా వుంటుంది. మాత లక్ష్మి దేవికి పూజలు చేస్తారు. వివిధ టవున్ లలో కాళి మాత పూజ నిర్వహిస్తారు.

pc: youtube

వెస్ట్ బెంగాల్ మరియు అస్సాం

వెస్ట్ బెంగాల్ మరియు అస్సాం

వెస్ట్ బెంగాల్ లోని ప్రజలు ఈపండుగ రోజును మాత కాళి దేవి కి ప్రత్యేకం గా భావించి ఆ దేవి పూజలు జరుపుతారు. రాత్రి వేళ బాణ సంచా కాలుస్తారు. బిహార్ లోని మిధిలా ప్రాంతం, అస్సాం లోను కాళి దేవి పూజతో పాటు లక్ష్మి మరియు గణేశ విగ్రహాలకు కూడా పూజలు చేస్తారు. తమ కుటుంబాలను క్షేమంగా ఉంచమని, సకల సంపదలూ ప్రసాదించమని ఆ దేవతలను వేడుకుంటారు. బంధు మిత్రులతో కలసి ఇష్టమైన వంటకాలు తింటూ ఆనందిస్తారు.

pc: youtube

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

ఆంద్ర ప్రదేశ్ లో ఈ పండుగ అతి వైభవంగా జరుగుతుంది. ఈ రోజులో వీరు హరి కధలు పెట్టి శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన ఘట్టాలు వివరిస్తారు. పండుగ మూడు రోజులు జరుపుతారు. మొదటి రోజు నరక చతుర్దశి నాడు అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు. ఇండ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ రోజున నరకాసురిడిని, శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ వదిన్చిందని చెపుతారు.

pc: youtube

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

శ్రీ కృష్ణ, సత్యభామల విగ్రహాలను పెట్టి పూజిస్తారు. రెండవ రోజు అయిన అమావాస్య నాడు మాత లక్ష్మి దేవి ప్రతి ఇంటికి వస్తుందని ఆమెకు పూజలు చేసి స్వీట్ లు పంచుతారు. నూతన దుస్తులు ధరిస్తారు. ఇండ్ల ద్వార బంధాలకు మామిడి తోరణాలు , పూల దండలు వేసి పండుగ కళ తెప్పిస్తారు. రాత్రి వేళ ఎంతో అట్టహాసంగా బాణ సంచా కాలుస్తారు.

గుజరాత్

గుజరాత్

దేశంలో దీపావళి వేడుకలలో బాణసంచా కాల్చటం అనేది గుజరాత్ లోనే మొదలైంది. తర్వాతి కాలంలో ఈ ఆచారం ఇతర రాష్ట్రాలకు పాకింది. గుజరాత్ లో నరక చతుర్దశి రోజును 'ధన్ తెరాస్' అంటారు. ఉత్తర భారత దేశంలో దీనిని చిన్న దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున వీరు లక్ష్మి పూజ చేసి తమ కొత్త గుజరాతి సంవత్సరాన్ని ఆరంభిస్తారు.

pc: youtube

గుజరాత్

గుజరాత్

ధన తెరాస్ రోజున బంగారం కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు. అన్ని కొత్త పనులకూ ఈ దీపావళి అమావాస్య వీరు అతి శుభ ప్రదమైనది గా భావిస్తారు. మూడవ రోజును ' భాయ్ బీజ' అంటారు. ఈ రోజు పండుగలో సోదరీ మణులు తమ సోదురుల క్షేమాన్ని కోరుతూ వారికి పూజలు చేస్తారు. గుజరాత్ లో ఈ పండుగ అయిదు రోజులపాటు అతి వైభవంగా వివిధ ఆచారాలతో జరుగుతుంది. ఈ రకంగా, మన దేశంలో దీపావళి వివిధ వర్గాల ప్రజలకు వివిధ రకాల సందేశాలు ఇస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X