• Follow NativePlanet
Share
» »తాజ్ మహల్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా?

తాజ్ మహల్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

తాజ్ మహల్ ఆ అందాల కట్టడంలో ఎన్నో రహస్యాలు ఇప్పటికీ మిస్టరీలుగానే వున్నాయి.ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ కట్టడంలో రహస్యాలా?చాలా చిత్రంగా వుంది కదా.కానీ ఇది నిజంగా నిజం.ప్రపంచంలోని 7వింతల్లో ఒకటిగా సొంతం చేసుకున్న ఆ అందాల కట్టడం తాజ్ మహల్.అవును.తాజ్ మహల్ గురించి మీకేం తెలుసు? తాజ్ మహాల్ ఇది 17వ శతాబ్దంలో తన ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కు కట్టించాడని మన హిస్టరీ పుస్తకాలలో చదివాం.దాని గురించి అంతవరకే తెలుసు మనందరికీ.కానీ ఆ అందాల కట్టడంలో అబ్బురపరిచే రహస్యాలు దాగున్నాయంటే నమ్ముతారా?నమ్మాల్సిన నిజమే.

తాజ్ మహల్ కట్టడంలో అణువణువూ చేతితో రాసిన రాతలు కనిపిస్తాయి. దాదాపు 99 పేర్లు అల్లా గురించి వుంటాయి.ఈ ఆర్కిటెక్చర్ ని చూసి చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వుంటారు.ఇంత అందంగా ఎలా అక్కడ రాశారన్నది ఇప్పటికీ దొరకని సమాధానమే.ఇక తాజ్ మహల్ ఎప్పుడూ ఒకే రంగులో వుండదు.రెండు రంగుల్లోకి మారుతూ వుంటుంది.ఆశ్చర్యంగా వుంది కదా. ఉదయాన పింక్ కలర్ లో అబ్బురపరిస్తే సాయంత్రం పూట మిల్కీ వైట్ తో అలరిస్తుంది.ఈ రంగులు ఈ కట్టడానికి మరింత అందాన్ని తెస్తాయి. అదెలా సాధ్యమైంది అనేది మాత్రం మిస్టరీయే.

ఇది కూడా చదవండి:తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

తాజ్ మహల్ వెనుక మనకు తెలియని రహస్యాలు

1. నిర్మాణం

1. నిర్మాణం

మరో ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ కట్టడం కోసం 32 మిలియన్ ఇండియన్ రుపీస్ ఖర్చుపెట్టారు ఆ రోజుల్లో. ఇక 22 మంది పనివారు, 1000 ఏనుగులు ఈ కట్టడం నిర్మాణంలో పాల్గొన్నాయి.
ఈ నిర్మాణం పూర్తీ కాటానికి దాదాపు 21 ఏళ్ళు పట్టింది.

PC:youtube

2. కట్టడం

2. కట్టడం

తాజ్ మహల్ లో నాలుగు మినార్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవి భూకంపాన్ని తట్టుకోవటానికి నిర్మించారు.అంతే తప్ప ప్రత్యేకంగా కట్టలేదు.ఈ కట్టడంలో కొన్ని రూమ్లు ఇప్పటికీ సీక్రెట్ గానే వున్నాయి.వాటిని ఇంతవరకు ఎవరూ ఓపెన్ చేయలేదు.షాజహాన్ ఆ రూమ్లని అప్పుడు సీల్ చేసాడని అవలాగే వున్నాయని చెప్పుకుంటారు.ప్రభుత్వం కూడా ఈ గదుల్ని ఓపెన్ చేయటానికి సాహసించలేదు.

PC:youtube

3. మిస్టరీ

3. మిస్టరీ

ఈ స్మారక కట్టడంలో చిన్నచిన్న నీటి ప్రవాహాలు వున్నాయి. అవి కూడా నమ్మశక్యం కాని విధంగా వున్నాయి.ఇప్పటికీ ఆ మిస్టరీని సైంటిస్ట్ లు కూడా చేధించలేకపోతున్నారంటే అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.ఈ కట్టడాన్ని ఎక్కడా ఎటువంటి తేడా లేకుండా పర్ఫెక్ట్ గా నిర్మించారు.

ఫతేపూర్ సిక్రీ - అక్బర్ కట్టించిన సుందర నగరం !

PC:youtube

4. గార్డెన్

4. గార్డెన్

చివరకు గార్డెన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వుంటుంది.సమాధులు కూడా చాలా కరెక్ట్ గా షాజహాన్ సమాధి ముంతాజ్ కంటే చాలా పెద్దదిగా వుంటుంది.ఈ విషయం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీగానే వుంది.

అందాల తాజ్ ...అన్నీ చిత్రాలే !

PC:Gayathri vutlapally

5. చరిత్రకారులు

5. చరిత్రకారులు

ఈ అపూర్వ కట్టడం గతంలో హిందూ దేవాలయం తేజో మహల్ అని కొంత మంది చరిత్రకారులు చెప్తూవుంటారు.అంతేకాదు ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. అది ప్రేమకు చిహ్నమని మరికొంత మంది చరిత్రకారులు చెప్తారు.

బంగారు త్రికోణ పర్యటన !

PC:Gerard McGovern

6. తేజోమహలి

6. తేజోమహలి

అయితే అప్పట్లో ముస్లిం పాలకులు అనేక దేవాలయాలను కొల్లగొట్టారని కొన్నింటిని నామరూపాలు లేకుండా చేస్తే మరికొన్నింటిని మసీదులుగా మార్చారు అనే వాదనలు కూడా వున్నాయి.ప్రసిద్ధ చరిత్రకారుడు తాజ్మహల్ నిజానికి హిందూ శివాలయమని, దాని అసలు పేరు తేజోమహలి అని అనేక ఆధారాలతో తాజ్ మహల్ ది ట్రూ స్టోరీ పేరుతో ఎప్పుడూ 1965 లోనే గ్రంథం రాశాడు.

PC: Sumitpriya123

7. తాజ్ మహల్ నిర్మాణం

7. తాజ్ మహల్ నిర్మాణం

తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653 లో పూర్తిచేశారు.అయితే ఇది షాజహాన్ నిర్మించలేదని షాజహాన్ కాలానికి ముందు నుంచే వుందని ఓక్ తన గ్రంథలో రాశారు.దీని గురించి సమాచారం తెలుసుకోవాలంటే అక్కడున్న సీక్రెట్ గదులు ఓపెన్ చేస్తే తెలుస్తుందని చెప్పారు.

తాజ్ మహల్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు !!

PC:Swapnil.Karambelkar

8. సీక్రెట్ గదులు

8. సీక్రెట్ గదులు

ఆయన అభిప్రాయం ప్రకారం ఆ సీక్రెట్ గదుల్లో ఎన్నో శిల్పాలు దాగున్నాయని తెలుస్తుంది.ఏదేమైనా భారతమాతకు ఇదో సుందర కళాభరణం.

తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

PC:Mahbub Hossain Shaheed (mahosha)

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి