Search
  • Follow NativePlanet
Share
» » ఈ సరస్సులో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్లే

ఈ సరస్సులో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్లే

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న నైనిటాల్ లో ఉన్న నైనితాల్ సరస్సు గురించి కథనం.

భారత దేశంలోని ఉత్తరాఖండ్ లో సరస్సుల జిల్లాగా పేరు గాంచిన నైనిటాల్ అంటేనే ప్రతి ఒక్కరూ హనీమూన్ కు అత్యంత అనువైన ప్రాంతంగా చెబుతారు. ప్రకృతి రమణీయత, అక్కడి వాతావరణం ఇందుకు కారణం. అయితే అదే నైనిటాల్ లో ఓ సరస్సు పురాణ ప్రాధాన్యత కలిగినది.

ఈ సరస్సులో మునిగితే భారత దేశంలోనే అత్యంత పవిత్ర సరోవరంగా పేరుగాంచిన మానస సరోవరంలో మునిగినంత పుణ్యం వస్తుందని చెబుతారు. ఇక ఈ నైనిటాల్ చుట్టు పక్కల ప్రకృతి రమణీయత కలిగిన ప్రాంతాలే కాకుండా పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

ముఖ్యంగా భారత దేశంలో శక్తి పీఠాల్లో ఒక పీఠాన్ని కూడా మనం ఆ సరస్సు ఒడ్డున చూడవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ సరస్సుతో పాటు ఆ శక్తి పీఠానికి సంబంధించి పురాణ ప్రాధాన్యతతో కూడిన పూర్తి సమాచారం ఈ కథనంలో మీ కోసం....

హిమాలయ పర్వత శ్రేణుల్లో

హిమాలయ పర్వత శ్రేణుల్లో

P.C: You Tube

హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న నైనిటాల్ లోనే నైనితాల్ సరస్సు ఉంది. నైనితాల్ పేరులోని నైనీ అంటే కన్ను అని, తాల్ అంటే సరస్సు అని అర్థం. మొత్తంగా నైనితాల్ అంటే కన్ను ఆకారంలో ఉన్న సరస్సు అని అర్థం.

పురాణాల్లో కూడా

పురాణాల్లో కూడా

P.C: You Tube

నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2084 మీటర్లు అంటే 6837 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సు ప్రక`తి రమణీయతకే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రానికి కూడా నిలయం. ఈ సరస్సు ప్రస్తావన పురాణాల్లో కూడా కనిపిస్తుంది.

 స్కాంద పురాణం

స్కాంద పురాణం

P.C: You Tube

ముఖ్యంగా ఈ సరస్సు గురించిన ప్రస్తావన స్కందపురాణంలో సైతం కనిపిస్తుంది. అప్పట్లో ఈ సరస్సును ముగ్గురు బుుషుల సరస్సు అని పిలిచేవారు. ఇందుకు సంబంధించిన కథనం ఇప్పటికీ ప్రాచూర్యంలో ఉంది.

వారికి దాహం వేసింది

వారికి దాహం వేసింది

P.C: You Tube

అత్రి, పులస్త్య, పులాహ అనే ముగ్గురు బుుషులు ఒకసారి ప్రస్తుతం నైనితాల్ ఉన్న సరస్సు ప్రాంతానికి వచ్చారు. వారికి ఆ సమయంలో దప్పికయ్యింది. అయితే చుట్టు పక్కల ఎక్కడా వారికి దాహం తీర్చుకోవడానికి అనువైన ప్రాంతం కనపడలేదు.

ఆ గొయ్యే నేటి నైనితాల్

ఆ గొయ్యే నేటి నైనితాల్

P.C: You Tube

దీంతో వారు పెద్ద గొయ్యి తవ్వగా నీరు ఉబికి వచ్చింది. దీంతో వారు తమతో పాటు ఉన్న మానస సరోవరం నీటిని ఆ సరస్సులో కనిపి దాహం తీర్చుకున్నారు. ఆ పెద్ద గొయ్యే ఇప్పుడు నైటితాల్ సరస్సుగా మారిందని చెబుతారు.

మానస సరోవరంలో స్నానం చేసినట్లే.

మానస సరోవరంలో స్నానం చేసినట్లే.

P.C: You Tube

ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలో స్నానంచేసినంత పుణ్యం వస్తుందని చెబుతారు. దేశంలో ఉన్న 51 శక్తి పీఠాల్లో ఒకటైన నైనాదేవి ఆలయం కూడా ఇక్కడకు దగ్గరగా ఉంది. నైనితాల్ సరస్సుకు ఉత్తర దిశలో ఈ దేవాలయం ఉంది.

దాక్షాయని ఎడమ కన్ను పడిన ప్రాంతమే.

దాక్షాయని ఎడమ కన్ను పడిన ప్రాంతమే.

P.C: You Tube

పురాణాల ప్రకారం దాక్షాయణి ఎడమ కన్ను పడిన ప్రాంతమే నైనితాల్ అని చెబుతారు. అందువల్లే ఈ సరస్సుకు అతి దగ్గర ఆ దేవి దేవాలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నైనా దేవి దేవాలయానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

నైనా అనే గోపాలుడు

నైనా అనే గోపాలుడు

P.C: You Tube

అందులో ముఖ్యమైనవి. ఈ దేవాలయం నైనా అనే ఒక గోవుల కాసే బాలుడి వల్ల నిర్మించబడిందని చెబుతారు. ఒకరోజు ఆ బాలుడు పశువులను మేత కోసం నైనా దేవి ఆలయం ఉన్న ప్రాంతానికి తీసుకెళుతాడు.

కలలో కనిపించి

కలలో కనిపించి

P.C: You Tube

ఆ పశువుల మందలో ఉన్న ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను ఇస్తుంది. అదే రోజు రాత్రి ఆ బాలుడి కలలో దుర్గామాత కనిపించి ఆ రాయి తనకు ఆసనమని అక్కడ దేవాలయాన్ని నిర్మింపజేయాల్సిందిగా చెబుతుంది.

దేవాలయాన్ని నిర్మిస్తారు.

దేవాలయాన్ని నిర్మిస్తారు.

P.C: You Tube

ఈ విషయాన్నిపశువుల కాపరి అయిన నైనా రాజుకు తెలియజేస్తాడు. రాజు అక్కడికి స్వయంగా వచ్చి విషయాన్ని స్వయంగా తెలుసుకొని అక్కడ దేవాలయాన్ని నిర్మించి దానికి ఆ పశు పాలకుడైన నైనా పేరు పెట్టాడని చెబుతారు.

మహిష పీఠంగా కూడా

మహిష పీఠంగా కూడా

P.C: You Tube

అదే విధంగా ఈ నైనాదేవి ఆలయాన్ని మహిష పీఠంగా పిలుస్తారు. పూర్వం మహిషాసుర అనే రాక్షసరాజు వివాహం కాని స్త్రీ వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా శివుడి నుంచి వరం పొందుతాడు. వర గర్వంతో మహిషాసురుడు ప్రజలను అష్ట కష్టాల పాలు చేస్తుంటాడు.

దుర్గా అనే దేవతను

దుర్గా అనే దేవతను

P.C: You Tube

దీంతో మహిసాసురుడిని అంతమొందించుటకు దేవతలందరూ కలిసి దుర్గా అనే దేవతను స`ష్టిస్తారు. ఆ దేవతలకు అనేక రకాల ఆయుధాలను భహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత అందాన్ని చూసి ఆమెను వివాహమాడాలని ప్రయత్నిస్తాడు.

జై నైనా అని

జై నైనా అని

P.C: You Tube

అయితే దుర్గమాత మాత్రం తన కంటే శక్తివంతుడైన వాడిని మాత్రమే వివాహం చేసుకొంటానని చెబుతుంది. దీంతో వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దుర్గాదేవి మహిసాసురను ఓడించి వాడి కళ్లు రెండింటిని పీకేస్తుంది. దీంతో దేవతలు జై నైనా అని నినదిస్తారు. అందువల్లే ఆ దేవి పేరు నైనాదేవిగా మారిందని చెబుతారు.

కిల్ బరీ

కిల్ బరీ

P.C: You Tube

ఇక నైనితాల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిల్ బరీ కూడా అందమైన పిక్నిక్ ప్రాంతం. ఇక్కడి పచ్చటి ఓక్, ఫైన్, రోడోడెండ్రాన్ వంటి చెట్లు మన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ సుమారు 580 జాతులకు చెందిన వివిధ రకాల పక్షులు ఉన్నాయి.

బోలెడు పర్యాటక కేంద్రాలు

బోలెడు పర్యాటక కేంద్రాలు

P.C: You Tube

ఇక నైనితాల్ కు దగ్గరగా హనుమాన్ ఘరీ, ఘెరకల్, అరబిందో ఆశ్రమం, పాన్గోట్, బారా బజార్, స్నోవ్యూ, గుహల తోట, గుర్నీ హౌస్, సరియాతాల్, టండి సడక్, టిఫిన్ టాప్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చ్ తదితర ప్రాంతాలు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X