Search
  • Follow NativePlanet
Share
» »దొడ్డ గణేశ ఆలయం, బెంగళూరు !

దొడ్డ గణేశ ఆలయం, బెంగళూరు !

By Mohammad

దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు మహానగరంలో కలదు. కన్నడలో దొడ్డ అనే 'పెద్ద' అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉన్నది. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడి కి దగ్గరలో ఈ వినాయక కలదు. ఈ ఆలయ నిర్మాత బెంగళూరు ను తీర్చిదిద్దిన కెంపెగౌడ.

చరిత్ర

ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు కనిపించాయట. అందులో ఒక్కదాని మీద వినాయక ప్రతిమను చూసి, వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద (ఏకశిలా విగ్రహం) ఆ విగ్రహాన్ని మలచమని ఆఙ్ఞాపించాడట. ఇంకేం .. నాటి సంఘటన రూపమే ఈనాడు మనకు చూస్తున్న దొడ్డ గణపతి.

దొడ్డ గణపతి ఆలయ గోపురం

దొడ్డ గణపతి ఆలయ గోపురం

చిత్ర కృప : Mallikarjunasj

దొడ్డ గణపతి దేవాలయం

దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు లోని బసవన గుడి బుల్ టెంపుల్ పక్కనే కలదు. ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ రెండు ఆలయాలను చూడకుండా ఉండలేరు. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు 'కరగ' ఉత్సవ సంబరాలు !

విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.

దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం

దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం

చిత్ర కృప : HARE Srinivasa

స్వామి వారి అలంకరణ

వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తె జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది.

ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఈసారి బెంగళూరు వెళితే స్వామిని తప్పక వెళ్లి చూసిరండి!

ఆలయ సందర్శన సమయం

దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినయ చవితి నుంచి ఉత్సవాలు వైభవం గా జరుపుతారు.

బసవన గుడి ప్రవేశద్వారం

బసవన గుడి ప్రవేశద్వారం

చిత్ర కృప : Brynn

బసవన గుడి

బసవన గుడి బెంగళూరు దక్షిణ ప్రాంతంలో కలదు. దీనిని 'బుల్ టెంపుల్' లేదా 'వృషభ ఆలయం' గా పిలుస్తారు. నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్ద నంది ఆలయం ఇది. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతిలోంచి మలిచారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంది. ఏడాదికొకసారి, డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత (వేరుశెనగ పండగ) ప్రధాన ఆకర్షణ.

ఆలయ సందర్శన వేళలు : వారంలో అన్ని రోజులూ గుడి తలుపులు తెరిచే ఉంటారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 : 30 నుండి రాత్రి 9 గంటల వరకు.

నంది విగ్రహం, బుల్ టెంపుల్

నంది విగ్రహం, బుల్ టెంపుల్

చిత్ర కృప : Sarvagnya

బెంగళూరు చేరుకోవడం ఎలా ?

బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు - బెంగళూరు సిటీ, యశ్వంతపుర కలవు. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X