Search
  • Follow NativePlanet
Share
» »రామభక్త హనుమాన్ అంటే వీరికి నచ్చదు

రామభక్త హనుమాన్ అంటే వీరికి నచ్చదు

హనుమంతుడిని పూజించని ద్రోణగిరి అనే గ్రామానికి సంబంధించిన కథనం.

By Kishore

జీవి అన్న తర్వాత ముఖ్యంగా మనవుడు తప్పు చేయడం సహజం. ఆ చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం కూడా ధర్మం. ఈ విషయం చిన్న, పెద్ద తేడా ఉండకూడదు. అయితే దేవుడే తప్పు చేస్తే అతనికి కూడా శిక్ష విధించాలా? అలా విధించడం వల్ల మనకు ఏమైనా పాపం చుట్టు కుంటుందా? సిరి సంపదలన్నీ నశించిపోతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలు మానవులకు దేవుడిని శిక్షించే శక్తి ఉందా? అన్న సందేహమూ కలగక మానదు. అయితే ఇందుకు సమాధానం భారత దేశంలోని ఓ పల్లెలో దొరుకుతుంది. అక్కడ ప్రజలు మూకుమ్ముడిగా కలియుగ దైవంగా, చిరంజీవిగా పేరుగడించిన రామ భక్తుడు, అపర బలసంపన్నుడైన ఆంజనేయుడుని వీరు తమ శత్రువుగా భావిస్తారు. ఇక్కడ ఆయనకు పూజ ఉండదు. అంతే కాకుండా హనుమంతుడికి ఎటువంటి దేవాలయం కూడా ఇక్కడ ఉండదు.

ఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు అంతేనా అనేక కథలు కూడాఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు అంతేనా అనేక కథలు కూడా

1. ఎక్కడ ఉంది ఆ ఊరు...

1. ఎక్కడ ఉంది ఆ ఊరు...

Image Source:

ప్రక`తి సంపదకు నిలయమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలి జిల్లాలో ద్రోణగిరి పర్వతం పైన ద్రోణగిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామ ప్రజలెవరూ హనుమంతుడిని పూజించరు. జోషి మఠానికి దగ్గరగా ఈ గ్రామం ఉంది.

2. హనుమంతుడిని బహిష్కరించడానికి కారణం ఏమిటి?

2. హనుమంతుడిని బహిష్కరించడానికి కారణం ఏమిటి?

Image Source:

ఈ గ్రామంలో హనుమంతుడిని ద్వేషించడం వెనుక పురాణ కథనం ఉంది. రామ, రావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్చపోతాడు. ఆ మూర్చ నుంచి లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడిని సంజీవిని మొక్కలను తీసుకొని రావాల్సిందిగా రాముడు ఆదేశశిస్తాడు.

3. పర్వతం లోని ఒక భాగం

3. పర్వతం లోని ఒక భాగం

Image Source:

ఆ మొక్కలను అన్వేషిస్తూ హనుమంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకుంటాడు. అక్కడ ద్రోణ పర్వత ప్రాంతంలో ఆ సంజీవిని మొక్కలు ఉన్నాయని తెలుసుకొన్న హనుమంతుడు ఆ పర్వతంలోని ఒక భాగాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలకు ఆ పర్వతం, ఆ మొక్కలు దైవంతో సమానం. దీంతో తమ దైవాన్ని తమ నుంచి దూరం చేసినందుకు గాను హనుమంతుడి పై వారు ద్వేషం పెంచుకుంటారు.

4. మహిళలకు బహిష్కారం

4. మహిళలకు బహిష్కారం

Image Source:

హనుమంతుడికి ఆ సంజీవిని మూలికలు, అవి ఉన్న ద్రోణ పర్వతం గురించి ఓ మహిళ ఉప్పందిస్తుంది. ఈ విషయం తెలుసుకొన్న గ్రామ ప్రజలు అప్పటికప్పుడు ఆ మహిళను ఊరి నుంచి బహిష్కరిస్తారు. అంతే కాకుండా ఇప్పటికీ అక్కడ ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవంలో మహిళలకు ప్రవేశం లేదు. అంతే కాకుండా ఆ రోజు పురుషులు ఎవరూ మహిళలు వండిన వంటలను తినరు

5. ఆ పర్వతం ప్రస్తుతం ఎక్కడ ఉంది

5. ఆ పర్వతం ప్రస్తుతం ఎక్కడ ఉంది

Image Source:

సంజీవిని మూలికల ఉపయోగించి లక్ష్మణుడికి తెలివి తెప్పించిన తర్వాత ఆ పర్వతాన్ని ఆంజనేయుడు తిరిగి యథాస్థానంలో ఉంచినట్లు వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తుంది. అయితే ఆ పర్వతాన్ని లంకలోనే వదిలిపెట్టి వచ్చేసినట్లు తులసీదాస్ రాసిన రామాయణంలో పేర్కొనబడింది. ఈ విషయంలో చాలా మంది ఆ పర్వతం లంకలో ఉందనే ఇప్పటికీ భావిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X