Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ గుడ్డుతో కొడితేనే కోరికలు తీరేది

ఇక్కడ గుడ్డుతో కొడితేనే కోరికలు తీరేది

బాబా నగర్ సేన్ దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాబానగర్ సేన్ అనే దేవాలయం కూడా అదే కోవకు చెందినది. ఇక్కడ కోడిగుడ్లను ముడుపుగా చెల్లిస్తారు. అది కూడా దేవాలయం గోడలకు వేసి కొట్టడం వల్ల తమ మొక్కులు చెల్లించుకొంటారు. ఇటువంటి దేవాలయం దేశంలో మరెక్కడా కూడా లేదు. అయితే వైశాఖ మాసంలో మాత్రమే ఈ రకమైన మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని ఎవరు, ఎప్పుడు ప్రారంభించారన్న విషయం పై సరైన ఆధారాలు లేవు. అయితే ఈ సంప్రదాయం దాదాపు 60 ఏళ్ల నుంచి మాత్రం కొనసాగుతోందని తెలుస్తోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

రూ.25వేలు కంటే తక్కువగా భూతల స్వర్గం కాశ్మీర్ అందాలన్నీ మీ సొంతం...

1. ఎక్కడ ఉంది ఈ దేవాలయం

1. ఎక్కడ ఉంది ఈ దేవాలయం

Image Source:

బాబానగర్ సేన్ అనే అద్భుతమైన దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ దేవాలయంలోని గోడకు కోడిగుడ్డను దూరం నుంచి విసురుతారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అంటే ఎప్రిల్ నెలలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. అప్పుడు భక్తులు పూజా సామాగ్రితో పాటు కోడి గుడ్డును కూడా తీసుకొస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కొంతమంది కోడి గుడ్డును అక్కడ ఉన్న గోడకు వేసి కొడితే మరికొంతమంది తమ కోర్కెలు తీర్చినందుకు ముడుపు చెల్లిస్తున్నామని పేర్కొంటూ ఇక్కడ కోడిగుడ్డును పగలగొడుతారు.

2. మూడు రోజుల పాటు ఈ ఉత్సవం.

2. మూడు రోజుల పాటు ఈ ఉత్సవం.

Image Source:

మైశాఖ మాసం ప్రారంభంలోనే మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడికి స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో మాత్రమే దేవాలయంలోని గోడకు కోడిగుడ్డను వేసి కొడుతారు.

3. కోటి రుపాయలకు పైగా వ్యాపారం.

3. కోటి రుపాయలకు పైగా వ్యాపారం.

Image Source:

దేవాలయం వద్ద భక్తుల నమ్మకాన్ని స్థానిక వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర రూ.5 మించదు. అయితే ఇక్కడి దేవాలయం వద్ద మాత్రం స్థానిక వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోడిగుడ్డు ధర రూ.20 మించి పోతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు రోజుల్లోనే ఒక్క కోడిగుడ్ల అమ్మాకాల వల్లే దాదాపు కోటిరుపాయాలకు పైగా వ్యాపారం జరుగుతుందని తెలుస్తోంది.

4. కొబ్బరిబోండాం, లడ్డు కూడా

4. కొబ్బరిబోండాం, లడ్డు కూడా

Image Source:

ఇక్కడ కేవలం కోడిగుడ్డునే కాకుండా కొబ్బరి బోండాం, లడ్డును కూడా భక్తులు కానుకగా సమర్పిస్తారు. ఈ సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారన్న విషయం పై సరైన సమాచారం లేదు. అయితే దాదాపు అరవై, డెబ్బై ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.

5. ఎలా చేరుకోవాలి

5. ఎలా చేరుకోవాలి

Image Source:

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు దగ్గర్లో ఉన్న బిలౌన అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. లక్నో నుంచి ఇక్కడికి నేరుగా బస్సులో ఉన్నాయి. మిగిలిన సమయాలతో పోలిస్తే వైశాఖ మాసం అంటే ఏప్రిల్ నెలలో ఈ దేవాలయం వద్ద రద్దీ కొంత ఎక్కువగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X