Search
  • Follow NativePlanet
Share
» » ఒకే చేతితో నిర్మించిన శివ దేవాలయంలో పూజలు కూడా కరువే

ఒకే చేతితో నిర్మించిన శివ దేవాలయంలో పూజలు కూడా కరువే

ఏక్ హథాలే దేవాలయం గురించిన కథనం.

లయకారకుడైన ఆ పరమశివుడిని పూజించడం అనాదిగా భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యప్తంగా ఉన్న హిందువులు పవిత్ర కార్యంగా భావిస్తున్నారు. ఆ శివుడిని లింగ రూపం కొలవడం చూస్తేనే ఉన్నాం.
ఇక పరమశివుడికి పురాణ కాలం నుంచి అనేక దేవాలయాలు నిర్మింపజేశారు. ఒక్కొక్క దేవాలయ నిర్మాణానికి అనేక పదుల సంవత్సరాలు వేల మంది కార్మికులు పనిచేసిన విషయం మనకు తెలుసు. అయితే ఒక దేవాలయం మాత్రం కేవలం ఒక రాత్రిలోనే అది కూడా ఒక చేతితోనే నిర్మించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube

ఈ విచిత్రమైన శివాలయం ఉత్తరాఖండ్ లోని పితౌర్ ఫడ్ బల్తిరి అనే గ్రామంలో ఉంది. ఈ దేవాలయాన్నిఒక చెయ్యి దేవాలయం (ఏక్ హథాలే దేవాలయం) అని అంటారు. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ఒక
చేతిలో నిర్మించారు.స్థానికులు చెప్పే వివరాల ప్రకారం ఒక శిల్పి ఈ దేవాలయాన్ని కేవలం ఒక రోజు రాత్రిలో నిర్మించారు.

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube
ఈ దేవాలయానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడి శివలింగాన్ని పూజించడానికి చాలా భయపడుతారు. అయితే ప్రతి రోజు ఈ దేవాలయాన్ని వేల
మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఈ దేవాలయంలోని శిల్పకళ.

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube
భారతీయ ప్రచీన శిల్పకళకు అద్దం పడుతుంది. అందువల్లే పర్యాటకులతోపాటు అనేక మంది పరిశోధకులు నిత్యం ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఒక కథ
ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి పూర్వం ఇక్కడ ఒక శిల్పి ఉండేవాడు. ఆయనకు ఒక చేయ్యి లేకపోయినా శిల్పాలు బాగా చెక్కేవాడు.

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube
ఆయితే ఆయన ప్రతిభను గుర్తించని గ్రామస్తులు ఆయన్ను ఎప్పుడూ హేళన చేస్తుండేవారు. దీంతో విసుగు చెందిన ఆ శిల్పి ఆ ఊరి నుంచి వెళ్లిపోవాలనుకొంటాడు. అయితే వెళ్లే ముందు తన ప్రతిభను ఆ ఊరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి గ్రామానికి దగ్గరగా ఉన్న గుట్ట పైకి చేరుకొని దేవాలయన్ని నిర్మిస్తాడు.

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube
శివలింగాన్ని కూడా ప్రతిష్టింపజేస్తాడు. ఉదయం గ్రామస్తులు వెళ్లి చూసే సమయానికి అక్కడ శిల్పి కనిపించడు. ఇదిలా ఉండగా ఆ శివాలయంలోని శివలింగం ప్రతిష్టించే సమయంలో జరిగిన ఒక అపశ్రుతి
వల్ల వ్యతిరేక దిశలో ప్రతిష్టించారు. అందువల్లే ఈ దేవాలయంలోని శివ లింగాన్ని ఎవరూ పూజించరు.

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

ఒక చేతితో ఒక రాత్రిలో కట్టిన శివాలయం

P.c. You Tube
ఒక వేళ పూజిస్తే ఆ కుటుంబంలో అనేక ఉపద్రవాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ మందిరం ఉత్తరాఖండ్ లని పితౌర్ ఫడ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. డెహ్రడూన్ నుంచి సులభంగా రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు వెళ్లవచ్చు.. రైలు మార్గం ద్వారా టన్ పుర, ఫితౌర్ ఫడ్ మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X