Search
  • Follow NativePlanet
Share
» »అదూర్ - కేరళ సంప్రదాయాల పట్టణం !

అదూర్ - కేరళ సంప్రదాయాల పట్టణం !

పార్ధసారధి దేవాలయం అదూర్ పట్టణంలో ప్రధాన ఆకర్షణ. పండాలం మహదేవ దేవాలయం, పట్టుపురకాల్ దేవి దేవాలయం, పుతేన్ కావిల్ భాగవతి దేవాలయం, శ్రీనారాయణపురం విష్ణు దేవాలయం కూడా ప్రసిద్ధి చెందిన మతపర కేంద్రాలు.

By Mohammad

కేరళ రాష్ట్రంలోని పాతానంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం ఒక సాంప్రదాయక విలవలు కలది. అక్కడి సంస్కృతి, దేవాలయాలు, స్ధానిక పండుగలు, ప్రదేశాలు అన్నీ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. అడూర్ పట్టణం తిరువనంతపురానికి 100 కి.మీ.లు మరియు ఎర్నాకుళం కు 140 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన రెండు నగరాలకి మధ్య గల అదూర్ పట్టణం మరింత పేరొందింది.

ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కల దేవాలయాలు, వివిధ వేడుకలకు ప్రసిద్ధి గాంచాయి.పార్ధసారధి దేవాలయం పట్టణంలో ప్రధాన ఆకర్షణ. పండాలం మహదేవ దేవాలయం, పట్టుపురకాల్ దేవి దేవాలయం, పుతేన్ కావిల్ భాగవతి దేవాలయం మరియు శ్రీనారాయణపురం మహావిష్ణు దేవాలయం అదూర్ లో ప్రసిద్ధి చెందిన మతపర కేంద్రాలు.

కొట్టాయం - ప్రకృతిలో ఒక అద్భుత ప్రదేశం !

ఇక్కడే కల సెయింట్ జార్జ్ ఆర్దోడాక్స్ చర్చి మరియు సెయింట్ మేరీ ఆర్దోడాక్స సిరియన్ కేధడ్రల్ చర్చిలు క్రైస్తవ భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తాయి. ఈ ప్రాంత సాంస్కృతిక చరిత్రకు ఈ చర్చిలు, దేవాలయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. కేరళలో అతి ప్రాచీనమైన మూలం మార్కెట్ అదూర్ లోనే కలదు. పర్యాటకులకు మంచి షాపింగ్ అనుభవాలను అందిస్తుంది.

పండాలం మహదేవ దేవాలయం

పండాలం మహదేవ దేవాలయం

పండాలం మహదేవ దేవాలయం కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇది అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఈ ప్రాచీన మత పర స్ధలం పండాలం పట్టణంలో అంటే అదూర్ కు 10 కి.మీ.ల దూరంలో కలదు.

చిత్రకృప : Karmalilhari

పండుగలు

పండుగలు

ఈ దేవాలయం పట్టణ నడిబొడ్డున ఉండటంచేత భక్తులను ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయ ప్రధాన దైవం శివ భగవానుడు. ప్రతి ఏటా జరిగే కెట్టుకాజచ్చ పండుగ ఈ దేవాలయంలో పర్యాటకులకు భక్తులకు ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Sanju

పండాలం ప్యాలెస్

పండాలం ప్యాలెస్

పండాలం ప్యాలెస్ అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఇది పాండాలం రాజ కుటుంబానికి స్వస్ధలం. రాజభవనం పండాలం లో అదూర్ పట్టణానికి 10 కి.మీ.ల దూరంలో కలదు. కేరళ చరిత్రలో ఈ రాచ కుటుంబం విశిష్ట స్ధానాన్ని కలిగి ఉంది. ఈ వంశస్ధులు, మదురై కు చెందిన పాండ్య రాజుల వంశీకులని చెపుతారు.

చిత్రకృప : Anoopan

పండాలం ప్యాలెస్

పండాలం ప్యాలెస్

పండాలం ప్యాలెస్, చారిత్రక ప్రాధాన్యతే కాక, మతపర విశిష్టత కూడా కలిగి ఉంది. ఇతిహాసాల మేరకు, స్వామి అయ్యప్ప పడాలం రాజ వంశంలో జన్మించాడు. అయ్యప్ప విగ్రహం కల ఒక దేవాలయం అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఈ దేవాలయం అచ్చంగా శబరిమలై దేవాలయ నమూనాలో ఉంటుంది.

చిత్రకృప : Anoopan

పండాలం ప్యాలెస్

పండాలం ప్యాలెస్

ఈ ప్రాంతంలో మకరవిళక్కు పండుగను విశిష్టతతో ఆచరిస్తారు. అయ్యప్ప స్వామి ఆభరణాలు పండాలం నుండి శబరిమలైకు ఒక ఘనమైన ఊరేగింపులో పండుగకు మూడు రోజుల ముందు తరలిస్తారు. దైవత్వం దానితోపాటు జరిపే వివిధ పండుగలు పండాలం ప్యాలెస్ ను ఒక పర్యాటక ఆకర్షణగా నిలిపాయి.

చిత్రకృప : Anoopan

పార్థిసారధి దేవాలయం

పార్థిసారధి దేవాలయం

శ్రీక్రిష్ణ భగవానుడిదైన కారణంగా కేరళ రాష్ట్రానికి వచ్చే చాలామంది పర్యాటకులు అదూర్ పట్టణానికి వస్తారు. పార్ధ సారధి దేవాలయంలో గణేషుడు, శివుడు కూడా పూజలు అందుకుంటారు. ఈ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే పది రోజుల పండుగ వేడుకలకు కేరళలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు వస్తారు.

చిత్రకృప : Saatvik.Jacob

గజమేళ వేడుక

గజమేళ వేడుక

పండుగ చివరి రోజు వేడుకగా దేవాలయంలో గజమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది ఒక ప్రధాన ఆకర్షణ. తొమ్మిది ఏనుగులు, అనేక అలంకరణలతో దేవాలయ ముందు భాగంలో ఒక గొప్ప ఊరేగింపుగా నడుస్తాయి. ఈ దేవాలయంలో ఘనంగా జరిగే మరో పండుగ క్రిష్ణుడి పుట్టిన రోజు పండుగ. చాలామంది స్ధానికులు జానపద కళలు, డ్యాన్సులు ప్రదర్శిస్తారు.

చిత్రకృప : Saatvik.Jacob

చర్చి

చర్చి

సెయింట్ జార్జ్ ఆర్తోడాక్స్ చర్చి, అదూర్ పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో ఉన్న చందనపల్లి గ్రామంలో కలదు. ఈ చర్చిని 1810 సంవత్సరంలో నిర్మించారు. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద చర్చిగా చెపుతారు.

చిత్రకృప : telugu native planet

చర్చి

చర్చి

ఈ చర్చి దాని శిల్ఫ శైలి అద్భుతాలకు పేరు గాంచింది. క్రైస్తవ, ముస్లిం, హిందూ కట్టడాల తీరు కలిగి ఉంటుంది. దీని గోపురాలు గోధిక్ శైలి, సీలింగ్ పర్షియన్ పద్ధతిలో ఉంటుంది. చర్చిలో ఒక రాతిపై మతప్రవక్తల, దేవ దూతల శిల్పాలు చెక్కడం ఒక ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Charles Haynes

పట్టుపురక్కాల్ దేవి దేవాలయం

పట్టుపురక్కాల్ దేవి దేవాలయం

పట్టుపురక్కాల్ దేవి దేవాలయం అదూర్ లో మరో ప్రసిద్ధి గాంచిన దేవాలయం. ఈ దేవాలయం పండాలి వలియకోయిక్కల్ దేవాలయం పరిసర ప్రదేశాలలో ఉంటుంది. దీనిలో మత భధ్రకాళి ప్రధాన దైవం. పార్వతి అవతారంగా చెపుతారు.

చిత్రకృప : Rahulreghunathmannady

భక్తి భావనలు

భక్తి భావనలు

ఈ దేవాలయం సంవత్సరం పొడవునా భక్తులను వందల సంఖ్యలో ఆకర్షిస్తూంది. ఈ పురాతన దేవాలయం పాండ్య రాజుల కాలం నాటిది. ఇతర దేవాలయాల వలెనే పట్టుపురక్కాల దేవి దేవాలయం కూడా అదూర్ మతపర చరిత్రకు విశిష్టంగా నిలుస్తుంది. దేవాలయ పరిసరాలు చేరితే చాలు భక్తి భావనలు ఉబికి పొంగుతాయి.

చిత్రకృప : spykster

పుతేన్కాలి భగవతి దేవాలయం

పుతేన్కాలి భగవతి దేవాలయం

పుతేన్కాలి భగవతి దేవాలయం అంటే మాత భధ్రకాళికి చెందినది. ఇది అదూర్ పట్టణానికి 8 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయం నిర్మాణంపై ఒక కధ కలదు. ఇతిహాసం మేరకు ఈ దేవాలయం కురంపాలకు చెందిన పాలప్పలిల్ కుటుంబంలోని ఒక వ్యక్తి నిర్మించాడు. అమ్మవారు ఈ వ్యక్తి భక్తికి మెచ్చి అతనికి కొన్ని ఆధ్యాత్మిక మహిమలు కలిగించిందని చెపుతారు.

చిత్రకృప : Abhinarayan

భధ్రకాళి విగ్రహం

భధ్రకాళి విగ్రహం

దేవాలయంలో భధ్రకాళి విగ్రహం ప్రతిష్టించారు. ఈ దేవత ఎనిమిది చేతులుకల భధ్రకాళిగా కనపడుతుంది. పుధేన్కావిల్ భగవతి దేవాలయం అదరూర్ చరిత్రలో ఒక ప్రధాన ప్రదేశం. ఈ దేవాలయానికి సంవత్సరం పొడవునా, భధ్రకాళి భక్తులు వస్తూనే ఉంటారు.

చిత్రకృప : Sankarrukku

శ్రీ నారాయణపురం మహావిష్ణు దేవాలయం

శ్రీ నారాయణపురం మహావిష్ణు దేవాలయం

శ్రీ నారాయణపురం మహావిష్ణు దేవాలయం అదూర్ లో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక స్ధలం. ఈ దేవాలయం అదూర్ పట్టణానికి 5 కి.మీ.ల దూరంలోని సుందరమైన ఒక గ్రమం పేరు మననకాల లో ఉంటుంది. శ్రీనారాయణపురం మహావిష్ణు దేవాలయం చాలా ప్రాచీనమైనది దీనిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం.

చిత్రకృప : telugu native planet

దశావతార చార్తు పండుగ

దశావతార చార్తు పండుగ

దేవాలయంలో దశావతార చార్తు పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఏటా 10 రోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి రోజూ దశావతారాలలో ఒక అవతారం వేస్తారు. దశావతారం పండుగ కారణంగానే ఈ దేవాలయం పర్యాటకులలో మరియు భక్తులలో ఎంతో ప్రసిద్ధి గాంచింది.

చిత్రకృప : Arunvroy

కేధడ్రల్ చర్చి

కేధడ్రల్ చర్చి

సెయింట్ మేరీస్ ఆర్ధోడాక్స్ సిరియన్ కేధడ్రల్ చర్చి అదూర్ పట్టణానికి 15 కి.మీ.ల దూరంలో కలదు. ఇది చాలా ప్రాచీనమైనది. చరిత్ర మేరకు ఈ చర్చిని క్రీ.శ. 717 సంవత్సరంలో నిర్మించారు. ఈ చర్చి కేరళలోని ప్రాచీన చర్చిలలో ఒకటి. కేరళ రాష్ట్ర మతపర చరిత్రకు ఒక విశిష్టత కల్పిస్తోంది.

చిత్రకృప : telugu native planet

త్రిచెండి మంగళం మహదేవ

త్రిచెండి మంగళం మహదేవ

త్రిచెండి మంగళం మహదేవ ఆలయం పెరింగనాడ్ గ్రామంలో కలదు. ఇది అదూర్ పట్టణానికి 5 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో శివుడు ఉంటాడు. పండుగల కాలంలో ఈ దేవాలయానికి వేలాది భక్తులు తరలి వస్తారు. కెట్టుకజచ్చ ఈ దేవాలయం నిర్వహించే పండుగలలో ప్రధానమైనది.

చిత్రకృప : telugu native planet

అదూర్ జంక్షన్

అదూర్ జంక్షన్

వాయు మార్గం : అదూర్ కు 140 కి. మీ ల దూరంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : అదూర్ కు సమీపాన 125 కి. మీ ల దూరంలో ఎర్నాకులం రైల్వే స్టేషన్ కలదు. స్టేషన్ బయట టాక్సీ అద్దెకు తీసుకొని అదూర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : ఎర్నాకులం, త్రివేండ్రం, కొచ్చి, పాతానాంతిట్ట,కొటారక్కర, గురువాయూర్, కొల్లం తదితర ప్రాంతాల నుంచి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అదూర్ కు నడుస్తాయి.

PC: Saatvik.Jacob

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X