Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !!

తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !!

By Mohammad

తమిళనాడు అంటే అందరికీ గుర్తిచ్చేది ఆలయాలు. అందుకే తమిళనాడుని "ఆలయాల భూమి" అంటారు. ఇక్కడ ఉన్నట్లు ఆలయాలు దేశంలోని మరే రాష్ట్రంలో ఉండవు. ఈ రాష్ట్రంలో చూడటానికి ఆలయాలేనా ఇంకేమైనా ఉన్నాయా అనే విషయానికి వస్తే ...

తమిళనాడు అక్కడి సహజ అందాలకు, ప్రకృతికి మరియు సంస్కృతికి నిదర్శనం. తమిళనాడు పర్యాటకులను విశేషంగా అలరిస్తున్నది. ఇక్కడి హిల్ స్టేషన్, బీచ్ లు, జలపాతాలు, ఆలయాలు ఇలా ఎన్నో అంశాలు ఆకట్టుకుంటున్నవే. ఎన్ని ఉన్నా జలపాతాల వద్ద మాత్రం పర్యాటకులు సందడి సందడి గా కనిపిస్తారు. ఇక్కడి వాతావరణం, ప్రకృతి అలా మారుస్తుంది అంతే ..! ఈ రాష్ట్రంలో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు రెండూ కూడా కలుస్తాయి.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన జలపాతాలు !

తమిళనాడు రాష్ట్రంలో కొన్ని చెప్పుకోదగ్గ జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల వద్దకి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తుంటారు. పై నుండి కిందపడే ఆ జలాధార సుందర దృశ్యాన్ని తనివితీరా ఆస్వాదించి ఆనందపడతారు. జలపాతాల దగ్గరికి వెళ్ళి, పడుతున్న జలాధార కింద నిలబడి మిక్కిలి ఆనందం పొందుతుంటారు పర్యాటకులు. చిన్నా, చితక జలపాతాలు చాలానే ఉన్నా కూడా తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు కొన్నే ఉన్నాయి. మరి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం పదండి ..!

హొగనెక్కల్ జలపాతం, ధర్మపురి

హొగనెక్కల్ జలపాతం, ధర్మపురి

హొగనెక్కల్ జలపాతం బెంగళూరు నగరం నుండి 180 కి. మీ. దూరంలో ధర్మపురి జిల్లాలో ఉన్నది. కావేరి నది మీద ఉండే ఈ జలపాతాన్ని "భారతదేశ నయాగరా జలపాతం" అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో కనిపించే కార్బోనేట్ శిలలు ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే పురాతనమైనవి. తెప్పల్లో విహరిస్తూ చేపలు పట్టుకోవడం, జలపాతాన్ని వీక్షించడం ఇక్కడి ప్రత్యేకత.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి హొగనెక్కల్ జలపాతానికి వన్ డే రోడ్ ట్రిప్ జర్నీ !

చిత్ర కృప : Sankara Subramanian

కుంబక్కరై జలపాతం, థేని

కుంబక్కరై జలపాతం, థేని

కుంబక్కరై జలపాతం పడమటి కనుమల లోని కొడైకెనాల్ హిల్స్ నుండి పుట్టాయి. ఇవి పెరియకులం కు 9 కి. మీ. ల దూరం లోని కుమ్బక్కరాయి ప్రదేశం నుండి వస్తాయి. ఈ ప్రదేశం థేని కి 24 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ పక్షుల ధ్వనులు ఆనందించవచ్చు. సందర్శకులు ఈ జలపాతాల నీటిలో స్నానం చేస్తారు. ఇక్కడ ఒక మురుగన్ విగ్రహం కూడా కలదు.

చిత్ర కృప : Ashok Prabhakaran

తలైయార్ జలపాతం, దిండిగుల్

తలైయార్ జలపాతం, దిండిగుల్

దిండిగుల్ ప్రాంతంలోని పళని కొండల్లో తలైయర్ జలపాతం ఉన్నది. ఇది 975 అడుగుల ఎత్తున ఉండి, తమిళనాడు రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది. కొడైకెనాల్ ఘాట్ రోడ్ మార్గంలో, పశ్చిమం వైపు 3.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న డమ్ డమ్ రాక్ వ్యూ పాయంట్ నుండి తలైయార్ జలపాత దృశ్యాన్ని వీక్షించవచ్చు.

చిత్ర కృప : anu partha

కుర్తాలం, తిరునల్వేలి

కుర్తాలం, తిరునల్వేలి

కుర్తాలం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో కలదు. దీనిని "దక్షిణాది ప్రకృతి చికిత్సాలయం" గా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం ఏడాది పొడవునా పర్యాటకులతో నిండుగా, సందడిగా ఉండటానికి కారణం ఇక్కడి 9 జలపాతాలు. వీటిలో కొన్ని జలపాతాలు ప్రమాదకర ప్రదేశాల్లో ఉన్నాయి. మిగతా చోట్ల సందర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాటిలో తనివితీరా జలకాలాడొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు కేరింతలు కొట్టవచ్చు.

ఇది కూడా చదవండి : కుర్తాలం లోని జలపాతాల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Sankara Subramanian

మంకీ జలపాతం, పొల్లాచి

మంకీ జలపాతం, పొల్లాచి

మంకీ ఫాల్స్ సహజ జలపాతాలు. ఇది అన్నామలై కొండలకు 30 కి. మీ. ల దూరంలో ఉన్నది. ఈ జలపాతాలు పొల్లాచి - వాల్పరై రోడ్ మార్గంలో కలవు. ఇక్కడ సుందరమైన ప్రకృతి అందాలు చూడవచ్చు. మంకీ ఫాల్స్ కు ప్రవేశ రుసుము రూ.15 గా కలదు. ఇక్కడికి వెళ్ళి సరదాగా నీటిలో ఆడవచ్చు.

ఇది కూడా చదవండి : పొల్లాచి - సినిమా షూటింగ్ ల ఊరు !!

చిత్ర కృప : Siva301in

అగయ గంగై, కొల్లి హిల్స్

అగయ గంగై, కొల్లి హిల్స్

అగయ గంగై 300 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతుంది. అన్ని వైపులా పర్వతాలతో చుట్టబడిన అగయ గంగై జలపాతం సమీపంలో అరపలీస్వరార్ ఆలయం ఉంది. ఈ ఆలయం కింద నుంచి ఈ జలపాతం ను చేరుకోవటానికి 1000 మెట్లు ఉన్నాయి. అగయ గంగై వద్ద శబ్ధం వినటానికి థ్రిల్లింగ్ ఉంటుంది. పాల వలె జాలు వారుతున్న నీటి ధార చూసి చాలా మంది ఆకాశ గంగ గా భావిస్తుంటారు.

ఇది కూడా చదవండి : కొల్లి హిల్స్ - ప్రకృతి ఒడిలో పరవశం !

చిత్ర కృప : Saravana Raja

సెయింట్ క్యాథరీన్ జలపాతం, కోటగిరి

సెయింట్ క్యాథరీన్ జలపాతం, కోటగిరి

సెయింట్ క్యాథరీన్ వాటర్ ఫాల్స్, నీలగిరి జిల్లా లోని కోటగిరి హిల్ స్టేషన్ లో కలదు. ఈ జలపాతాలు రెండు పాయలుగా చీలి సుమారు 250 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. మేట్టుపలయం నుండి కోటగిరి వెళ్ళే మార్గం లో అరవేను ప్రదేశంలో ఇది ఉన్నది. ఈ జలపాతాలను పూర్తిగా చూడాలంటే, మీరు డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ కు వెళ్ళాలి. రోడ్డు మార్గం గుండా వాటర్ ఫాల్ పై భాగానికి కూడా వెళ్ళవచ్చు.

చిత్ర కృప : Sandip Bhattacharya

బేర్ షోల జలపాతం, కొడైకెనాల్

బేర్ షోల జలపాతం, కొడైకెనాల్

బేర్ షోల జలపాతం అభయారణ్య అడవిలో ఉంది. కొడైకెనాల్ బస్ స్టాండ్ కి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చాలా పొడవైనది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి నీళ్ళు తాగడానికి తరచుగా ఎలుగుబంట్లు వచ్చేవట అందుకే ఈ జలపాతాలకు ఆ పేరు వచ్చిందని భావిస్తారు. ఈ ప్రాంతం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్థలం ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. హనిమూన్ కి వచ్చే ప్రతి జంట జలపాతాన్ని తప్పక చూస్తారు.

చిత్ర కృప : tarique

కటారి జలపాతం, కూనూర్

కటారి జలపాతం, కూనూర్

కటారి జలపాతం నీలగిరిలో మూడవ పెద్ద జలపాతం. కటారి జలపాతం ఎత్తు 180 మీటర్లు ఉంటుంది. కూనూర్ కేంద్రం నుండి 10 కిలోమీటర్ల దూరంలో కుంద రహదారి వద్ద ఉన్నది. ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. కటారి జలపాతం తో పాటుగా లా జలపాతం కూడా కూనూర్ కి దగ్గరలో ఉన్నది. ఈ ప్రదేశం ఎత్తు మరియు పరిసరాలు అద్భుతమైన అందాల్ని కలిగి ఉంటాయి.

ఇది కూడా చదవండి : కూనూర్ - ఎప్పటికీ నిద్రిస్తున్న లోయ !

చిత్ర కృప : Shankarkarthikeyan

పైకారా జలపాతం, ఊటీ

పైకారా జలపాతం, ఊటీ

పైకారా జలపాతం, ఊటీ లో ప్రవహించే పైకారా నది మీద ఏర్పడింది. ఇక్కడి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది. దీనితో పాటు పవర్ ప్లాంట్, పైకారా సరస్సు మరియు విశాలమైన సినిమా షూటింగ్ ల ప్రదేశం వెన్ లాక్ డౌన్స్ మైదానం చూడవచ్చు. స్థానికులకు, టూరిస్ట్‌లకు మరియు సినిమా షూటింగ్ లకు వెన్ లాక్ డౌన్స్ ఒక పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. సరస్సులో బోట్ విహారం చేస్తూ చుట్టుప్రక్కల అందాల్ని మీ కెమరాలలో బంధించవచ్చు.

ఇది కూడా చదవండి : ఉల్లాసపరిచే ఊటీ రైలు ప్రయాణం !

చిత్ర కృప : E&R Clikz - Away !

సిరువాణి జలపాతం, కోయంబత్తూర్

సిరువాణి జలపాతం, కోయంబత్తూర్

పశ్చిమ కనుమల్లో పుట్టి ప్రవహించే సిరువాణి నది మీద ఏర్పడిన సిరువాణి జలపాతం కోయంబత్తూర్ జిల్లాలో ఉన్నది. ఈ నది సిరువాణి కొండల్లో ప్రవహిస్తూ జలపాతంలా కిందకు పడే సన్నివేశం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రధాన మార్గం నుండి కిలోమీటరు మేర దూరం ఉన్న ఈ స్థలానికి, జలపాత శబ్ధం వింటూ అటువైపు అడుగులేస్తూ కాలినడకన ప్రయాణించవచ్చు.

చిత్ర కృప : Sridar

ఫేరీ జలపాతం, కొడైకెనాల్

ఫేరీ జలపాతం, కొడైకెనాల్

కొడైకెనాల్ లో ఉన్న మరొక జలపాతం ఫేరీ జలపాతం. పంబా నది మీద ఏర్పడ్డ ఈ జలపాతం, కొడైకెనాల్ సరస్సుకు 5 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడికి కూడా పర్యాటకులు వస్తుంటారు. కోడైకెనాల్ కి వచ్చే యాత్రికులు తమ పర్యటనలో భాగంగా ఫేరీ జలపాతాన్ని తప్పక సందర్శిస్తారు.

చిత్ర కృప : Subramanyan Guhan

కిలియుర్ జలపాతం, ఎర్కాడ్

కిలియుర్ జలపాతం, ఎర్కాడ్

తమిళనాడు రాష్ట్రంలోని ఎర్కాడ్ హిల్ స్టేషన్ లో కిలియుర్ జలపాతం ఉన్నది. ఈ జలపాతం ఎర్కాడ్ సరస్సు మీద ఏర్పడి పర్యాటకులను రంజింపజేస్తున్నది. సరస్సు నుండి 3 కి. మీ. దూరంలో ఉండి, నిటారు మార్గం గుండా కాలినడకన చేరుకోవచ్చు. ఇది తూర్పు కనుమల్లోని సెర్వరాయన్ కొండల్లో విస్తరించిన మైదానంలో ప్రవహిస్తున్నది.

ఇది కూడా చదవండి : ఏర్కాడు - పేదల ఊటీ !

చిత్ర కృప : swarat_ghosh

సిల్వర్ కాస్కేడ్ జలపాతం, కొడైకెనాల్

సిల్వర్ కాస్కేడ్ జలపాతం, కొడైకెనాల్

కొడైకెనాల్ లోని కొడైకెనాల్ సరస్సు యొక్క ఔట్ ఫ్లో నీటి నుండి ఏర్పడిందే ఈ సిల్వర్ కాస్కేడ్ జలపాతం. చూడటానికి ఈ జలపాతం చిన్నదే అయినా కొడైకెనాల్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలలో దీనికి స్థానం కల్పించబడింది. పై నుండి కిందకు పదే ఈ నీటి ధార వద్ద ఫోటోలు తీసుకొనేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు.

చిత్ర కృప : Nandha Kumar AC

కుట్లదంపట్టి జలపాతం , మధురై

కుట్లదంపట్టి జలపాతం , మధురై

కుట్లదంపట్టి జలపాతం, తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో గల వడిపట్టి తాలూకా లోని కుట్లదంపట్టి అనే గ్రామంలో కలదు. ఈ జలపాతం 27 మీటర్ల ఎత్తు నుండి కిందకు పదే తీరు స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. చాలా మందికి ఈ జలపాతం మధురై లో ఉన్నదని తెలీదు. ఇది మధురై కి 30 కి. మీ. దూరంలో, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో తమిళనాడు అటవీ శాఖ వారిచే నిర్వహించబడుతున్నది.

ఇది కూడా చదవండి : మీనాక్షి ఆలయం - మమతానురాగాల నెలవు !

చిత్ర కృప : Kesavan Muthuvel

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X