Search
  • Follow NativePlanet
Share
» »పరమపావనం పంచభూత లింగ దర్శనం !

పరమపావనం పంచభూత లింగ దర్శనం !

By Mohammad

పంచభూతములు ముఖపంచకమై .. ఆరు రుతువులు ఆహార్యములై ఈ పాట గుర్తుందా ? సాగరసంగమం సినిమాలోది! కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కమలహాసన్, జయప్రద అద్భుతంగా నటించారు. పాట బాగానే విన్నారు మరి ఆ పంచభూతాలు ఏమిటి ?

భూమి, ఆకాశం, గాలి, నిప్పు, నీరు - వీటిని పంచభూతాలు అంటారు. ఇవి సమస్త ప్రాణకొటి కి ఆధారమైనది. ఈ ఐదింటిని సూచిస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థలాలు. ఈ పంచ భూత స్థలాలు 5 శివలింగాలను సూచిస్తాయి. పంచ భూత స్థలాలన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అందులో నాలుగు స్థలాలు 'దేవాలయాల భూమి' గా పిలువబడుతున్న తమిళనాడు రాష్ట్రంలో మరియు ఒక్కటి మాత్రం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.పంచభూత లింగ క్షేత్రాలలో మూడు ( చిదంబరం, కాంచీపురం, శ్రీ కాళహస్తి) ఒకే అక్షాంశం మీద ఉండటం ఒక అద్భుతం ! అవి ఏవేవి ? ఎక్కడున్నాయి ? ఎలా వెళ్ళాలి ? తెలుసుకుందామా !

ఏకాంబరేశ్వర ఆలయం

ఏకాంబరేశ్వర ఆలయం

ఎక్కడ ఉంది ?

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం లో

దేనిని సూచిస్తుంది ?

పృధ్వీ లేదా భూమి లేదా నేల

చిత్ర కృప : Simply CVR

ఏకాంబరేశ్వర ఆలయం

ఏకాంబరేశ్వర ఆలయం

ఏకాంబరేశ్వర దేవాలయం శివునికి అంకితం చేయబడినది. ఇందులో 1,008 శివలింగాలు ఉన్నాయి. ఆలయ గోపురం ఎత్తు 57 మీటర్లు. స్థానిక ఇతిహాసకథ ప్రకరం, పార్వతి దేవి ఇక్కడున్న మామిడి చెట్టు కింద తపస్సు చేసెను. అది ఇప్పటికీ ఆలయం లోపలే ఉంది. సంతానం లేనివారు వారు చెట్టు కింద పడే మామిడి ని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం

ఇది కూడా చదవండి : కాంచీపురం - పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sreeraman Thiagarajan

ఏకాంబరేశ్వర ఆలయం

ఏకాంబరేశ్వర ఆలయం

ఎలా వెళ్ళాలి ?

చెన్నై నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురానికి బస్సులో లేదా రైళ్లో ప్రయాణించి చేరుకోవచ్చు. చెన్నై నుండి కాంచీపురానికి ప్రతి రోజూ రైలు, బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి

చిత్ర కృప : Ashok Prabhakaran

జమ్బులింగేశ్వర ఆలయం

జమ్బులింగేశ్వర ఆలయం

ఎక్కడ ఉంది ?

తమిళనాడు రాష్ట్రంలోని తిరువానై కావాల్ లో

దేనిని సూచిస్తుంది ?

జలము లేదా నీరు

చిత్ర కృప : Dheepika . K

జమ్బులింగేశ్వర ఆలయం

జమ్బులింగేశ్వర ఆలయం

జమ్బులింగేశ్వర దేవాలయం ఎత్తైన ప్రాకారాలతో, 5 ఎకరాలలో విస్తరించి ఉన్నది. ఆలయ గర్భగుడి లో శివలింగం జమ్బుకేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. దక్ష హింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవటానికి శివుడు జముకేశ్వరంలో తపస్సు చేసాడని కధనం. గర్భగుడి కి సమీపంలో పార్వతి దేవి అవతారమైన అఖిలాండేశ్వరి దేవాలయాన్ని గమనించవచ్చు.

ఇది కూడా చదవండి : ట్రిచీ : అరుదైన దేవాలయాల సముదాయం !

చిత్ర కృప : Anand Kumar

జమ్బులింగేశ్వర ఆలయం

జమ్బులింగేశ్వర ఆలయం

ఎలా చేరుకోవాలి ?

ట్రిచి లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సు లలో ప్రయాణించి 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్బులింగేశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు

చిత్ర కృప : Railwayliker

కాళహస్తి ఆలయం

కాళహస్తి ఆలయం

ఎక్కడ ఉంది ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో, తిరుపతి కి 40 కిలోమీటర్ల దూరంలో

దేనిని సూచిస్తుంది ?

వాయువు లేదా గాలి

చిత్ర కృప : Vin09

కాళహస్తి ఆలయం

కాళహస్తి ఆలయం

గుడి లోని శివలింగాన్ని కాళహస్తీశ్వరుని గా కొలుస్తారు. శివలింగం నుండి వచ్చే గాలి కి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంది. గర్భగుడిలో శివలింగం రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. కాళహస్తి ని 'దక్షిణకాశీ' అని కూడా పిలుస్తారు.

ఇది కూడా చదవండి : కాళహస్తి ఆలయం

చిత్ర కృప : McKay Savage

కాళహస్తి ఆలయం

కాళహస్తి ఆలయం

ఎలా చేరుకోవాలి ?

తిరుపతి నుండి రైల్లో లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి కాళహస్తి చేరుకోవచ్చు. కాళహస్తి - తిరుపతి మధ్య దూరం 36 కిలోమీటర్లు

చిత్ర కృప : satish.skht

నటరాజ స్వామి దేవాలయం

నటరాజ స్వామి దేవాలయం

ఎక్కడ ఉంది ?

తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో

దేనిని సూచిస్తుంది ?

ఆకాశం లేదా నింగి

చిత్ర కృప : Nagarjun Kandukuru

నటరాజ స్వామి దేవాలయం

నటరాజ స్వామి దేవాలయం

శివుడు ఆనందతాండం చేసిన ప్రదేశం కనుకనే ఇక్కడ శివుడు నటరాజ రూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడి విశేషం, భక్తులకు ఏ విధమైన లింగాకారం కనిపించదు. నిరాకారమైన అంతరాలమే కనిపిస్తుంది. అదే చిదంబర రహస్యం. ఇది రూప రహిత లింగం అదే ఆకాశ లింగం గా ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి : చిదంబర రహస్యం

చిత్ర కృప : Dinesh Kumar (DK)

నటరాజ స్వామి దేవాలయం

నటరాజ స్వామి దేవాలయం

ఎలా వెళ్ళాలి ?

చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో చెన్నై - తిరుచ్చి మార్గంలో ఉన్న చిదంబరం కలదు. చెన్నై నుండి రైళ్ళు, బస్సులు చిదంబరం పట్టణానికి ప్రతిరోజూ నడుస్తుంటాయి

చిత్ర కృప : Vinoth Thambidurai

అరుణాచలేశ్వర ఆలయం

అరుణాచలేశ్వర ఆలయం

ఎక్కడ ఉన్నది ?

తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై

దేనిని సూచిస్తుంది ?

అగ్ని

చిత్ర కృప : Vinoth Chandar

అరుణాచలేశ్వర ఆలయం

అరుణాచలేశ్వర ఆలయం

అరుణాచలేశ్వర ఆలయం ప్రఖ్యాత హిందువులు పుణ్య క్షేత్రం. దేవాలయం 4 ముఖ ద్వారపు గోపురాలతో, 10 అంతస్తులు కలిగి, 10 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. ఇక్కడ శివలింగం ను అగ్ని లింగ రూపంలో కొలుస్తారు.

ఇది కూడా చదవండి : అరుణాచలేశ్వర ఆలయ మహత్యం

చిత్ర కృప : Adam Jones

అరుణాచలేశ్వర ఆలయం

అరుణాచలేశ్వర ఆలయం

ఎలా వెళ్ళాలి ?

చెన్నై నుండి 182 కిలోమీటర్ల దూరంలో తిరువన్నమలై కలదు. ఇక్కడికి రైల్లో, బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Rajesh Singh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X