Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి సౌందర్యం ...పాలంపూర్ సొంతం..!

ప్రకృతి సౌందర్యం ...పాలంపూర్ సొంతం..!

ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాల నిలయంగా పేరొందినది హిమాచల్ ప్రదేశ్. అక్కడి ప్రకృతి పర్యాటకులకు ఉన్న బంధం విడదీయలేనిది. అటువంటి సహజసిద్ధమైన అందాలు నిత్యం సుదూర ప్రాంతాలవారిని సైతం రా రమ్మంటూ ఆహ్వానిస్తాయి. ఇక్కడి ప్రదేశాల్లో మీకు నచ్చినవి ఏవి అని పర్యాటకులను అడిగితే చెప్పడం కాస్త కష్టమే! ఎందుకంటే ఈ ప్రదేశాల్లో మనసును దోచే ప్రాంతాలు చాలనే ఉన్నాయి. అందులో పాలంపూర్ కు ఒక ప్రత్యేకత ఉంది. మన జర్నీ ప్లాన్ మొత్తాన్ని అక్కడే ఉండి, కట్టిపడేసేలా చేస్తుంది ఈ ప్రాంతం. మరి ఆ అందాలేంటో మనసారా ఆస్వాదిద్దాం రండి...

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రదేశం హిమాచల్ లోని కాంగ్రా వ్యాలీ. ఇక్కడి అహౌల్దార్ సర్వ్యూట్లోని ఒక అందమైన ప్రదేశం పాలంపూర్. స్థానిక భాష లో నీటి వసతి సమృద్దిగా వున్న ప్రదేశాన్ని 'పాలం' అని అంటారు. పూర్వం యీ ప్రాంతం ' జలంధర ' రాజ్యం లో వుండేది .

ఈ ప్రదేశాన్ని చూసిన తరువాత కొండలమీంచి అడుగడుగునా ప్రవహిస్తున్న సెలయేళ్లని చూసినతరువాత స్థానికులు పాలం అని ఈ వూరిని పిలవడం లో అతిశయోక్తి లేదు అని అనిపించక మానదు.

పాలంపూర్ కి దగ్గరౌతున్నకొద్దీ పెద్ద పెద్ద

పాలంపూర్ కి దగ్గరౌతున్నకొద్దీ పెద్ద పెద్ద

పాలంపూర్ కి దగ్గరౌతున్నకొద్దీ పెద్ద పెద్ద పైను వృక్షాలు , కొండవాలులలో పెరుగుతున్న 'తేయాకు తోటలు'కనువిందు చేస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు అహౌల్దార్ పర్వతాల్లోని చైన్ లో భాగం. బేజ్ నాథ్ మందిరం , పారాగ్లైడింగ్, మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బీడ్ బిల్లింగ్ ఇక్కడి ప్రత్యేకత.

కాంగ్రా వ్యాలీలో నడపబడుచున్న టారుట్రైన్ ద్వారా

కాంగ్రా వ్యాలీలో నడపబడుచున్న టారుట్రైన్ ద్వారా

కాంగ్రా వ్యాలీలో నడపబడుచున్న టారుట్రైన్ ద్వారా పాలంపూర్ లోని చాలా ప్రదేశాలను వీక్షింవచ్చు. వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఇది అనుకూలమైన ప్రదేశం. పాలం పూరు ను వీక్షించాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. ఢిల్లీ నుండి పాలంపూర్ కు సుమారు 530 కిలోమీటర్లు ఉంటుంది.

ఉత్తర భారత దేశపు ' డార్జిలింగ్ '

ఉత్తర భారత దేశపు ' డార్జిలింగ్ '

కాంగ్రా పట్టణానికి సుమారు 35 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేసి చేరుకోవచ్చు . పాలంపూర్ గురించి చెప్పుకోవాలంటే ఓ చిన్న పట్టణం . మిలిటరీ కంటోన్మెంటు వున్న ప్రదేశం . సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే ఉత్తర భారత దేశపు ' డార్జిలింగ్ ' అంటే సరిపోతుంది .

పాలంపూర్ లో పండే తేయాకు

పాలంపూర్ లో పండే తేయాకు

మిగతా వేసవి విడుదలలకి ఊటీ కి తేడా యేమిటి అంటే ముఖ్యంగా ' టీ ' తోటలనే చెప్పుకోవాలి. సిమ్లా, కులు, మనాలి, శ్రీనగర్ లలో టీ తోటల పెంపకం కనబడదు. పాలంపూర్ లో పండే తేయాకు మనదేశంలోకి అతి మేలైన రకంగా గుర్తించేరు. 1849 లో మొదటి సారిగా'ఆల్మోరా' నుంచి తేయాకు ను తెచ్చి ఈ ప్రాంతం లో వేసేరు. అప్పటి నుంచి యిక్కడ ప్రముఖ పంటగా తేయాకు సంతరించుకుంది.

పచ్చిక మైదానాలతో అహ్లాదకరంగా

పచ్చిక మైదానాలతో అహ్లాదకరంగా

ఓ వైపు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లున్న మంచుతో కప్పబడిన పర్వతాలు , గలగల ప్రవహిస్తున్న జలపాతాలు, మరో వైపు పచ్చిక మైదానాలతో అహ్లాదకరంగా వుంటుంది .

పాలంపూర్ లోని ' పారాగ్లైడింగు ' ప్రపంచ ప్రసిధ్ది

పాలంపూర్ లోని ' పారాగ్లైడింగు ' ప్రపంచ ప్రసిధ్ది

ఎనభైల తరువాత యీ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది . ప్రముఖ పర్యాటక స్థలంగా రూపొందించే నేపథ్యం లో ' కేబుల్ కారు ' , ' ఎంమ్యూజ్ మెంటు పార్కులు ' నిర్మించ బడ్డాయి . పర్యాటకుల నివాసనార్దం సౌకర్యాలు , భోజన సదుపాయాలు వచ్చేయి . పాలంపూర్ లోని ' పారాగ్లైడింగు ' ప్రపంచ ప్రసిధ్ది పొందింది అనే దానికి 2015 లో నిర్వహించబడిన ' ప్రపంచ పారా గ్లైడింగ్ ' పోటీల సాక్షం పాలంపూర్ పర్యాటక స్థలంగా నే కాక ప్రముఖ విద్యాకేంద్రం కూడా . ఉత్తర భారతదేశం లో ప్రధమస్థానం లో నిలచిన ఆయుర్వేద కళాశాల , అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రి వున్నాయి . వ్యవసాయ కళాశాల వున్నాయి .

నౌగల్

నౌగల్

పాలంపూర్ నగర శివార్ల లో ' నౌగల్ ' సెలయేరు యెత్తైన పర్వతాలమీదుగా జారుతూ కనువిందు చేస్తుంది . అక్కడకి ఓ వంద మీటర్ల దూరంలో వున్న ' బుంద్లా ' జలపాతం , దానికి ఆనుకొని కట్టిన , ' కేప్టెన్ సౌరబ్ సింగ్ కాలియా ' పేరు మీద నిర్మించిన ' సౌరబ్ వన్ విహార్ ' ని సందర్శించొచ్చు .

' ఖుమాని ' ఫలవృక్షాలు

' ఖుమాని ' ఫలవృక్షాలు

పాలంపూర్ లో అడుగడుగునా కనిపించే ' ఖుమాని ' ఫలవృక్షాలు కనువిందు చేస్తాయి . ఈ జాతి వృక్షాలు జమ్ము - కశ్మీరు లోని శ్రీనగరు లోయలోను , పాలంపూర్లోనూ పెరిగే అరుదైన ఫలజాతి . బాగా పండిన పళ్లు పసుపు రంగులో కాస్త పెద్ద రేగుపండు సైజులో వుంటాయి

హెరిటేజ్‌ విలేజ్‌

హెరిటేజ్‌ విలేజ్‌

పాలంపూర్‌కు కూతవేటు దూరంలో హిమచల్‌ హెరిటేజ్‌ విలేజ్‌ ఉంది. చాలామంది పర్యాటకులు అక్కడే విడిది చేసేందుకు ఇష్టపడతారు. హిమాచల్‌లో ఉండే ప్రజల జీవన విధానాన్ని దగ్గర నుంచి చూడాలనుకునేవారికి ఈ ప్రదేశం అనువైనది. అందుకనే ఆ గ్రామాన్ని ఎంచుకుంటారు. అక్కడ రోడ్డు ప్రయాణం చేసే సమయంలో దూరంగా కనిపించే ఇళ్లను చూస్తే చాలా ముచ్చటేస్తుంది.

హెరిటేజ్‌ విలేజ్‌

హెరిటేజ్‌ విలేజ్‌

ఎక్కువగా సందర్శకులు అక్కడి స్థానిక ఇళ్ళల్లో కొన్నిరోజులు ఉండి, వాళ్ల ఆచార - వ్యవహారాలు, ఆహార పద్ధతులతోపాటు దినచర్య ఏంటో పరిశీలించాలని కోరుకుంటారు. అయితే, అలాంటి అవకాశం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. హిమాచల్‌ హెరిటేజ్‌ విలేజ్‌ గురించి వివరించేందుకు నిత్యం స్థానిక గైడ్‌లు అందుబాటులో ఉంటారు. ఇక్కడ తక్కువ సమయంలోనే విభిన్న ప్రాంతాలను వీక్షించవచ్చు. ఎందుకంటే, హిమాచల్‌ హెరిటేజ్‌ విలేజ్‌ పచ్చని ప్రకృతి నడుమ ఉన్న ఓ అందమైన గ్రామం.

టాయ్‌ ట్రైన్‌లో ప్రయాణం

టాయ్‌ ట్రైన్‌లో ప్రయాణం

సందర్శకులు పక్షుల కిలకిలారావాలతో ఉదయం నిద్రలేస్తే ఆ అనుభూతులు మాటల్లో చెప్పగలమా?! అది ఎంత అందమైన ఉదయంగా కనిపిస్తుందో కదూ! లేలేత సూర్యకిరణాలు అడవిని చీల్చుకుంటూ మన గది కిటికీలను తాకినట్లు అనిపిస్తుంది. ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే! ఆ క్షణాన అలసట ఒక్కసారిగా ఎగిరిపోతుంది.

పురాతన రాతి నిర్మిత బేజనాథ్‌ మందిరం

పురాతన రాతి నిర్మిత బేజనాథ్‌ మందిరం

అక్కడికి దగ్గరలోనే పురాతన రాతి నిర్మిత బేజనాథ్‌ మందిరం ఉంది. ఆ ఆలయ నిర్మాణశైలి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దాంతోపాటు పారాగ్లేడింగ్‌, బీడ్‌ బిల్లింగ్‌, కాంగ్రావ్యాలీ ప్రాంతాలను ఒక్కొక్కటిగా టారుట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడొచ్చు. వీటి గురించి వేరు వేరుగా చెప్పడం కష్టమే!

హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని

హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని

హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని, పసుపు రంగులతో అలంకరించినట్లు కనిపించే అడవులు, తోటలు, మూన్‌లైట్‌ శాలువ చుట్టినట్లు పర్వతాలు, పర్వతాల మధ్యలో ఉండే రహదార్లు, అందరూ బాగుండాలని వినిపించే ప్రార్థనలు, రోడ్డు మధ్యలో మేకలు, గొర్రెలు.. వాటిని వెంబడిస్తున్న కాపలాదారులు.. కోయిల కుహు కుహులు ఇలా ఒక్కొక్కటిగా చెప్పే కంటే, పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది.

హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని

హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని

ఎలా వెళ్లాలి?

విమానంమార్గం:

కింగ్ ఫిషర్ రెడ్ ప్రతీ రోజూ న్యూ ఢిల్లీ నుండి పాలంపూర్‌కి 40 km దూరంలో ఉన్న కాంగ్రా విమానాశ్రయానికి (గగ్గల్ విమానాశ్రయం) విమానాలు నడుపుతుంది. విమానాలు వాతావరణ పరిస్థితుల బట్టి ఉంటాయి మరియు శీతాకాలాలలో సరిగా కనిపించక పోవటం వలన రద్దు చేయబడతాయి - మీ పర్యటనను తదనుగుణంగా ఏర్పాటు చేసుకోండి.

రైలు మార్గం:

పాలంపూర్ నేరో గేజ్ రైలు మార్గం ద్వారా పతంకోట్ నుండి అనుసంధానించబడి ఉంది. పతంకోట్ నుండి పాలంపూర్ వరకు ఉన్న దూరం దాదాపుగా 112 km. ముగ్దమనోహరమైన కాంగ్రా లోయ యొక్క అందాలను రైలులో వెళ్ళటం ద్వారా చూడవచ్చును. ఈ ప్రయాణం రెండు సొరంగాల గుంగా ఉంది 7 గంటలు పడుతుంది, వీటిలో ఒకటి కేవలం 250 అడుగులు ఉండగా మరొకటి 1000 అడుగుల పొడవు ఉంటుంది.

రోడ్డు మార్గం

పాలంపూర్ రోడ్డు ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలు మరియు పట్టణాలకి అనుసంధానించబడి ఉంది. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ (HRTC) ఢిల్లీ మరియు చండీఘర్ వంటి ప్రధాన నగరాల నుండి ఏసీ, డీలక్స్ మరియు సెమీ డీలక్స్ బస్సులను నడపటం ద్వారా ప్రయాణానికి ఉత్తమ మార్గంగా ఉంది. ప్రధాన నగరాల నుండి దూరం ఈ విధంగా ఉంది, ఢిల్లీ (530KM), చండీగర్ (240KM), సిమ్లా (259KM), మనాలి (205KM), ధర్మశాల (35KM) మొదలైనవి. HRTC వెబ్సైటు నుండి టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చును.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X