Search
  • Follow NativePlanet
Share
» »గోదావరి పుష్కరాలు ఎక్కడ ?? ఎలా ??

గోదావరి పుష్కరాలు ఎక్కడ ?? ఎలా ??

పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయా నదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

మేక్మైట్రిప్ కూపన్లు : హోటళ్ళ బుకింగ్ ల మీద రూ . 2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి*

బృహస్పతి సింహరాశి లో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఇది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. 1979, 1991, 2003 పుష్కరాలు జరుగగా ఇప్పుడు అంటే 2015 లో జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో నది ఒడ్డున ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ప్రత్యేక ఘాట్ లను ఏర్పాటు చేసి వైభవంగా పుష్కరాలు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో సుమారుగా 4 కోట్ల నుంచి 5 కోట్ల మంది భక్తులు, తెలంగాణ లో 8 కోట్ల మంది భక్తులు స్నానం చేస్తారని అంచనా. ఇది ఎక్కువ కూడా కావచ్చు.

ప్రస్తుతం మీకు ఇక్కడ పుష్కరాలు ఏఏ ప్రదేశాలలో జరుగుతున్నాయి, అక్కడ మీరు ఏఏ ఆలయాలను సందర్శించాలి అక్కడికి ఎలా వెళ్ళాలి వంటి విలువైన సమాచారాన్ని తెలియజేస్తూ ...

2015 గోదావరి పుష్కరాలు

2015 గోదావరి పుష్కరాలు

2015 వ సంవత్సరంలో జూలై మాసం 14 వ తేదీ నుండి జూలై మాసం 25 వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. జూలై 14 వ తేదీన ఉదయం 6 గంటల 26 నిమిషాలకు ప్రత్యేక పూజలు, గోదావరి హారతితో పుష్కరాలను ప్రారంభించనున్నారు. 12 రోజులపాటు జరిగే పుష్కరాలలో నదీ ప్రవాహా రాష్ట్రాలు (మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్) తీరం వెంబడి పలు ఘాట్ లు ఏర్పాటుచేస్తున్నారు.

Photo Courtesy: roopa

నిర్మల్

నిర్మల్

నిర్మల్ , తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున హైదరాబాద్ మహానగారానికి 220 కి. మీ. దూరంలో ఉన్నది. నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. గోదావరి పుష్కరాలు ఈ ఏడాది ఇక్కడ జరుగుతుండటంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఇక్కడ గోదావరి నదిని ' వృద్ధ గంగ ' అని పిలుస్తారు. శ్రీ రాముడు అరణ్యవాసంలో భాగంగా సీతా దేవితో కలిసి ఇక్కడ కొంత కాలం ఈ గోదావరి నది ఒడ్డునే నివసించారని ప్రశస్తి.

సందర్శించవలసిన ఆలయాలు :
ఇక్కడికి పుష్కరాలకి వచ్చే వారు నిర్మల్ పట్టణానికి సమీపంలోని సోన్ అనే చిన్న గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొనవచ్చు.

ఎలా వెళ్ళాలి ??
నిర్మల్ కి డైరెక్ట్ గా ఎటువంటి రైలు సదుపాయం మరియు విమాన సదుపాయం లేదు. కనుక నిర్మల్ వచ్చే వారు హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగి అక్కడి నుంచి మహాత్మా గాంధీ బస్టాండ్ వెళ్ళి నిర్మల్ వెళ్లే ప్రభుత్వ బస్సులను ఎక్కి చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 222 కి. మీ. కనుక సుమారుగా 4 గంటల 30 నిమిషాలు పడుతుంది.

Photo Courtesy: telangana gov

బాసర

బాసర

బాసర, గోదావరి నది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో కల ఒక పుణ్య క్షేత్రం. హైదరాబాద్ మహా నగరానికి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ప్రదేశంలో గోదావరి నది ఒడ్డున వెలసిన సరస్వతి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ గోదావరి పుష్కరాలు జరుగుతుండటంతో ప్రభుత్వం వారు ఎన్నో సాంస్కృతిక కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. ఇక్కడికి పుశ్రాల సమయంలో సుమారు లక్ష మంది భక్తులు దర్శించవచ్చని భావిస్తున్నారు. ఇక్కడున్న సరస్వతి ఆలయంలో పిల్లలకు బడికి చేర్చే ముందు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ దేవి నవరాత్రులు 10 రోజులపాటు చాలా ఘనంగా జరుగుతాయి.

ఇక్కడ చూడవలసిన ఆలయాలు :

శ్రీ మహంకాళి ఆలయం, దత్తాతేయ ఆలయం, శ్రీ వైశ్యా మహాశి గుహ, వేదవతి శిల, గోదావరి నది ఒడ్డున వెలసిన ప్రముఖ శివాలయం.

ఎలా వెళ్ళాలి

ఈ ప్రదేశానికి రైలు, రోడ్డు మార్గం బాగానే ఉంది. మీరు ప్రభుత్వ బస్సుల ద్వారా ప్రయాణించాలంటే హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి గాని లేదా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి గాని బాసర చేరుకోవచ్చు. మీకు ఇక్కడి నుంచి పుష్కరాల సమయంలో ప్రత్యేక బస్సులు లభ్యమవుతాయి. ఒకవేళ మీరు రైలు మార్గం ఎంచుకున్నట్లయితే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు.

Photo Courtesy: { pranav }

ధర్మపురి

ధర్మపురి

ధర్మపురి తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాలో గల ఒక పట్టణం. ప్రస్తుతం గోదావరి పుష్కరాలు ఇక్కడ జరగనున్నాయి. ఇక్కడ గోదావరి నది ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది కనుక దక్షిణ వాహిని గా పేరుగాంచినది. ఇక్కడ పుష్కరాల సమయంలో కొన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు.

సందర్శించ వలసిన ఆలయాలు :

భక్తులు ఇక్కడున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో లక్ష్మి నరసింహ స్వామి వారి రెండు పవిత్ర విగ్రహాలు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి ??

ఇక్కడికి డైరెక్ట్ గా ఎటువంటి రైలు మరియు విమాన సదుపాయం లేదు. కనుక రైలు సదుపాయమే ఉత్తమం. ధర్మపురి కి ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ మంచెరియాల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నది. హైదరాబాద్ నుంచి మంచెరియాల్ కి రైళ్లు ఉన్నాయి. కనుక హైదరాబాద్ లో రైలు ఎక్కి, మంచెరియాల్ లో రైలు దిగి, అక్కడి నుంచి ధర్మపురి కి బస్సు ఎక్కాలి.

Photo Courtesy: telangana gov

కాళేశ్వరం

కాళేశ్వరం

కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ఒక గ్రామము. ఇది హైదరాబాద్ నగరానికి 300 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రస్తుతం ఈ ఏడాది ఇక్కడ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రదేశం మూడు నదుల సంగమం అంటే ఇక్కడ పవిత్ర గోదావరి మరియు దాని ఉపనదులైన సరస్వతి మరియు ప్రాణహిత నదులు కలుస్తాయి. ఈవిధంగా కలిసే ప్రదేశమే త్రివేణీ సంగమం. ఇది గోదావరి పుష్కరాల కేంద్రం. ఇక్కడున్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసినది మరియు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో ఉన్నది. ఇక్కడ ఒకే వేదికపై కనిపించే రెండు శివలింగాలు ప్రత్యేకమైనవి.

సందర్శించవలసిన ఆలయాలు :

శ్రీ శుభానంద ఆలయం, శ్రీ సరస్వతి ఆలయం, శ్రీ దత్తతేయ స్వామి ఆలయం, శ్రీ ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం

ఎలా వెళ్ళాలి ??

బస్సు మార్గం

కాళేశ్వరం కి ప్రతీరోజు హైదరాబాద్, వరంగల్ , గుంటూరు, విజయవాడ, కామారెడ్డి, కరీంనగర్, కోరుట్ల, మెట్‌పల్లి, గోదావరిఖని మరియు రామగుండం బస్సు డిపోల నుండి 60 బస్సులు తిరుగుతుంటాయి.

రైలు మార్గం

కాళేశ్వరం కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రామగుండం రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుండి రైలు పట్టుకొని రామగుండం చేరండి. అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా కాళేశ్వరం చేరుకొండి.

Photo Courtesy: kaleshwaram Temple

భద్రాచలం

భద్రాచలం

తెలంగాణ రాష్ట్రం లోనే కాక దేశం మొత్తంలో కెల్ల రాముని దివ్య క్షేత్రాలలో పవిత్రమైన భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. హైదరాబాద్ నుండి ఇక్కడికి సుమారుగా 312 కి. మీ. దూరంలో ఉన్నది. మామాలుగానే ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు భక్తులు వేల సంఖ్యలో సందర్శిస్తుంటారు. ఇక్కడ శ్రీ రామ నవమి రోజున జరిగే సీతా - రామ కళ్యాణం చాలా ముఖ్యమైన, పవిత్రమైన ఘట్టం. ఇక్కడ ఈ ఏడాది గోదావరి పుష్కరాలు జరుగుతుండటంతో, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవచ్చని భావిస్తున్నారు. గోదావరి పుష్కరాలలో భాగంగా 12 వ రోజు జరిగే ఘట్టంలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనవచ్చని అంచనా. ఇక్కడ జరిగే మేళా లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వారికి స్నాన ఘట్టాలను అధిక సంఖ్యలో అందిస్తున్నది. పుష్కరాలు అయిపోయేంతవరకు ఇక్కడ ప్రతీరోజు భక్తులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పుష్కరాలకి వచ్చేవారు శ్రీ రాముని ఆలయాన్ని తప్పక సందర్శించండి.

ఇక్కడ సందర్శించ వల్సిన ప్రదేశాలు
రాముని ఆలయాన్ని చూసిన తరువాత చూడవలసిన ప్రదేశాలు
పర్ణశాల,జతాయుపాక(ఏటపాక) ,గుండాల,శ్రీ రామగిరి

ఎలా వెళ్ళాలి ??
బస్సు ద్వారా

హైదరాబాద్, వరంగల్, తిరుపతి, బాసర, కరీంనగర్, రాజమండ్రి మొదలగు ప్రాంతాల నుంచి భద్రాచలం బస్ స్టాండ్ కి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడుపుతుంది. అంతే కాక పుష్కరాల సమయంలో ప్రత్యేక బస్సులను అందిస్తున్నది.

రైలు ద్వారా

భద్రాచలానికి సమీపంలో 40 కి. మీ. దూరంలో భద్రాచలం రోడ్ స్టేషన్ కలదు. ఇక్కడ నుంచి ఊరిలోకి బస్సులో ప్రయాణించడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం కి ప్రతీరోజు సికింద్రాబాద్ - మనుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ( ట్రైన్ నం : 12752 ) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాలకి బయలుదేరుతుంది.

కారు ద్వారా

మీకు సొంతవాహనం ఉంటే హైదరాబాద్ నుంచి భద్రాచలానికి సుమారుగా 7 ( 312 కి. మీ) గంటల సమయం పడుతుంది.

Photo Courtesy: Ankitha P / Belur Ashok

పట్టు సీమ

పట్టు సీమ

పట్టు సీమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల ఒక గ్రామం. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. కొన్ని లక్షల మంది భక్తులు గోదావరి పుష్కరాల సమయంలో పట్టుసీమ ను సందర్శించవచ్చని అంచనా. ఈ ప్రదేశం వీర భధ్ర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం గోదావరి నది మధ్యలో ఉన్న ఒక కొండమీద వెలసినది. ఈ ఆలయానికి చేరుకోవటానికి బోట్ మార్గమే గతి. ఇక్కడికి వస్తే పాపికొండల అందాలను చూడటం మరవద్దు.

Photo Courtesy: dr a k

కొవ్వూరు

కొవ్వూరు

కొవ్వూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మండలం. ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇక్కడ జరిగే పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గోదావరి నది ఒడ్డున ఉన్న పుష్కర్ ఘాట్ లో భక్తులు మునిగి స్నానం చేస్తారు.

సందర్శించవలసిన ఆలయాలు :

కొవ్వూరు లో అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిలో శివాలయం, రామాలయం , షిర్డి సాయి బాబా ఆలయం ముఖ్యమైనవి.

ఎలా చేరుకోవాలి ??

కొవ్వూరు మండలం విశాఖపట్టణం మరియు విజయవాడ వంటి నగరాలనుంచి బస్సు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడునది.

Photo Courtesy: ravisankarprasad polisetty

రాజమండ్రి

రాజమండ్రి

రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో, గోదావరి నది ఒడ్డున ఉన్న పెద్ద నగరం. ఈ నగరం విజయవాడ మరియు వైజాగ్ మహానగరాల మధ్యలో కలదు. ఈ ప్రదేశం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రసిద్ధి. ప్రస్తుతం ఉన్న జనాభాను అనుసరించి, రాజమండ్రి లో జరిగే పుష్కర మేళా లో లక్షల మంది ప్రతీరోజు హాజరవుతారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో మునిగి వారి పాపాలను కడుక్కుంటారు. ఇక్కడ సాంస్కృతిక, సంప్రదాయ కార్యాక్రమాలు పుష్కరాల సమయంలో జరగటానికి రంగం సిద్ధమైనది. రాజమండ్రి మార్కండేయ ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం కూడా ఉంది. పుష్కరాలకి వచ్చే వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడున్న పుష్కర ఘాట్ లు వరుసగా కోటి లింగాల ఘాట్, పుష్కర ఘాట్, గౌ తమ ఘాట్, శ్రద్ధానంద ఘాట్ మరియు పద్మావతి ఘాట్.

సందర్శించవలసిన ఆలయాలు
ఇక్కడున్న మార్కండేయ ఆలయం కాకుండా చూడ వలసిన ఆలయాలు
శ్రీ రామ ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, పాపి కొండలు

ఎలా చేరుకోవాలి ??

రోడ్డు మార్గం ద్వారా
రాజమండ్రి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల నుంచి చక్కగా అనుసంధానించబడినది. ఈ ప్రదేశంకి బాగా కనెక్ట్ కాబడిన ముఖ్య ప్రదేశాలు విజయవాడ, విశాఖపట్టణం మరియు హైదరాబాద్ వంటి నగరాలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి.

రైలు మార్గం
ఈ ప్రాంతానికి రైలు మార్గం కూడా బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు గౌతమి ఎక్స్‌ప్రెస్ రాజమండ్రికి ఉన్నది.

విమాన మార్గం

రాజమండ్రి కి దగ్గరలో మధురపాడి వద్ద సుమారుగా 18 కి. మీ. దూరంలో దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన సేవలు ఉన్నాయి.

Photo Courtesy: godavari pushkaralu

ధవళేశ్వరం

ధవళేశ్వరం

ధవళేశ్వరం రాజమండ్రి లోని సబ్ అర్బన్ ప్రదేశం. రాజమండ్రి కి కేవలం 4 కి. మీ. దూరంలో ఉంది. జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉన్నది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇక్కడ రెండు పుష్కర్ ఘాట్ లు ఉన్నాయి. అవి ఒకటేమో శివాలయం దగ్గర లో రాముని పాదముద్ర ఉన్న చోట, మరొకటేమో గోదావరి నది వద్ద ఉన్నది. భక్తులు ధవళేశ్వరంకి రాజమండ్రి నుంచి చేరుకోవచ్చు.

Photo Courtesy: godavari pushkaralu

నరసాపురం

నరసాపురం

ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లో గల నరసాపురం ఒక ముఖ్య పట్టణం. ఇది ఒక మునిసిపాలిటీ గా, మండలముగా, రెవెన్యూ డివిజన్ గా ఉన్నది. విశిష్ట గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రధాన పట్టణం నరసాపురం.

రోడ్డు మార్గం
నరసాపురం ఆంధ్ర రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాల నుంచి, పట్టణాల నుంచి మరియు గ్రామాల నుంచి రోడ్డు సదుపాయాన్ని చక్కగా కలిగి ఉంది. దీనికి దగ్గరలో 214 ఏ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి ఒంగోలు లోని జాతీయ రహదారి 5 తో అనుసంధానించబడునది. దీని వల్ల కలకత్తా - చెన్నై మధ్య రాకపోకల సమయం చాలా వరకు తగ్గింది.

రైలు మార్గం

నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి స్టేషన్. ఈ పట్టణం హైదరాబాద్ ( నరసాపురం ఎక్స్‌ప్రెస్, 1979 వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు) తో చక్కగా కనెక్ట్ చేయబడింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో విజయవాడ - భీమవరం - నరసాపురం రైల్వే లైన్ ఉన్నది. ఇక్కడ అన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు 9 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి.

జల మార్గం

నరసాపురం పోర్ట్ ( మైనర్ పోర్ట్ ) జలమార్గం ద్వారా కూడా అనుసంధానించబడినది. ఫిషింగ్ హార్బర్ మరియు ఓఎన్ జీసి ఇక్కడ కలదు.

Photo Courtesy: Satya murthy Arepalli

అంతర్వేది

అంతర్వేది

అంతర్వేది తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామము. ఇది లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ధి. గోదావరి పుష్కరాలు ప్రస్తుతం ఇక్కడ జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి - ఫిబ్రవరి నెలలో భీమఏకాదశి పర్వదినాన జరిగే ఉత్సవాలకి ప్రతీతి.

ఎలా వెళ్ళాలి??

భక్తులు అంతర్వేది కి లాంచీల ద్వారా నరసాపురం ఫెర్రి నుంచి చేరుకోవచ్చు. అంతే కాక బస్సు మార్గం ద్వారా అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి, కాకినాడ ల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి కలవు.

Photo Courtesy: { pranav } / Kishore Guntuku

నాందేడ్

నాందేడ్

నాందేడ్ పట్టణం మహారాష్ట్రలోని మరధ్వాడా ప్రాంతం మధ్య భాగంలో గోదావరి నది ఒడ్డున కలదు. మొగలాయిలు భారత ఉపఖండాన్ని పాలించినప్పటి నుండి నాందేడ్ ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకొంది. కాలక్రమేణా ఇది ఒక పవిత్ర నగరంగా కూడా విరాజిల్లుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పుష్కరాలు నిర్వహిస్తుంది. నాందేడ్ లో భక్తులు పెద్ద ఎత్తున హాజరయి స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ గోదావరి తీరాన వెలసిన ఉంకేశ్వర్ దేవాలయం భక్తులు తప్పక సందర్శించాలి.

సందర్శనీయ దేవాలయాలు

వివిధ మత అనుభవాలు కల నాందేడ్ లో ఉంకేశ్వర దేవాలయం చూసిన తరువాత చూడవలసినది నీటి బుగ్గలు. ఇక్కడ 43 డిగ్రీ సెల్షియస్ వేడిలో నీరు నీటి బుగ్గలనుండి ప్రవహిస్తుంది. దీనిలో ఔషధ గుణాలున్నాయని చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని చెపుతారు.

రవాణా వ్యవస్థ

ఎలా చేరుకోవాలి ??
విమానం ద్వారా

నాందేడ్ లో విమానాశ్రయం ఉన్నా, హైదరాబాద్ నుండి ఎటువంటి విమాన సెర్వీసులు లేవు. కానీ ముంబై, పూణే వంటి నగరాలనుంచి విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం

హైదరాబాద్ నుండి నాందేడ్ కి డైరెక్ట్ గా 22 రైళ్లు నడుస్తుంటాయి. హైదరాబాద్ నుండి 201 కి. మీ. దూరంలో ఉన్న నాందేడ్ కి రైలులో ప్రయాణిస్తే పట్టే సమయం 3 గంటల 44 నిమిషాలు.

రోడ్డు మార్గం

హైదరాబాద్ నుండి నాందేడ్ కి రోడ్డు మార్గం 311 కి. మీ. ప్రయాణ సమయం 5 గంటల 30 నిమిషాలు. మహారాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా తెలంగాణ ప్రభుత్వ బస్సుల ద్వారా నాందేడ్ కి ప్రయాణించవచ్చు.

Photo Courtesy: rajesh

చిరునామా

చిరునామా

గోదావరి పుష్కరాల కోసం మరింత సమాచారం కొరకు సంప్రదించాల్సిన చిరునామా
126 & 127 స్వర్ణజయంతి కాంప్లెక్స్,

అమీర్ పేట్ ,

హైదరాబాద్ - 500 018.

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
+91 99661 06666
+91 99666 35204
+91 99855 56666

Photo Courtesy: raghu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X