Search
  • Follow NativePlanet
Share
» »500 ఏళ్లైనా చెక్కుచెదరని ఖిల్లా రహస్యాలన్నీ మీకు తెలుసా

500 ఏళ్లైనా చెక్కుచెదరని ఖిల్లా రహస్యాలన్నీ మీకు తెలుసా

గోల్కొండ కోట ఇండో, పర్షియన్ శైలి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఎంత దూరంలో ఎంతమంది శత్రువులు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవడానికి సుమారు 500 ఏళ్ల క్రితమే ఈ గోల్కొండ కోటను నిర్మాణం వాడిన ఇంజనీరింగ్ సాంకేతికత ఉపయోగ పడింది. ధ్వని, ప్రతిధ్వని అనే సాంకేతికతో నిర్మించిన ఈ విధానం అప్పట్లో మిగిలిన కోటల నుంచి ఈ గోల్కొండ కోటను విభిన్నంగా ఉంచింది. అంతేకాకుండా నాలుగు కోటల సమూహమైన ఈ గోల్కొండ కోట శత్రుదుర్భేద్యంగా ఉండేది. ఈ కోట లోపల బావులే కాకుండా పంట కాలువలు కూడా ఉండేవి. ఇక వజ్రాల వ్యాపారానికి కూడా ఈ కోట ఎంతో ప్రాముఖ్యం చెందినది. దాదాపు 67 ఏళ్లపాటు ఈ గోల్కొండ కోట నిర్మాణం కొనసాగింది. ఇటువంటి మరెన్నో వివరాలు మీ కోసం...

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

గొల్ల కొండ నుంచి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ఖిల్లా వెనుక ఆసక్తికర కథనం ఉంది. క్రీస్తుశకం 1143లో మంగళవరం అనే రాళ్ల గుట్ట పై ఓ గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఈ వార్త అప్పటి ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయులకు చేరవేయబడింది. వెంటనే ఆ స్థలములో రాజు ఓ మట్టి కట్టడాన్ని నిర్మించారు. అటు పై రాళ్లతో అత్యంత పటిష్టంగా ఈ కోటను నిర్మించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

అటు పై ఈ ప్రాంతం చేతులు మారీ కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. కాగా, ఏదైన కట్టడాన్ని కింది నుంచి పైకి కడుతారు. కానీ గోల్కొండ కోటను పై నుంచి కిందికి కడుతూ వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

క్రీస్తు శకం 1518 లో సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో కోట నిర్మాణం ప్రారంభించగా, క్రీస్తుశకం 1585 మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం వరకూ నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 67 ఏళ్లపాటు ఐదుగురు రాజుల హయాంలో ఈ కోట నిర్మాణం జరిగిందని స్పష్టమవుతోంది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఇక గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి చెందినది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం, పిట్ వజ్రం, హోప్ వజ్రం, ఓర్లాఫ్ వజ్రం ఈ రాజ్యములోని పరిటాల కొల్లూరు గనుల నుంచి వచ్చాయి.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

గోల్కొండ గనుల నుంచి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. అందువల్లే నిజాం చక్రవర్తులు అప్పట్లో ప్రపంచంలోని అత్యతం ధనవంతుల జాబితాలో ఉండేవారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

నిజం నవాబులు మొగలు చక్రవర్తుల నుంచి స్వాతంత్యం పొందిన తర్వాత హైదరాబాదను క్రీస్తు శకం 1724 నుంచి క్రీస్తు శకం 1948 లో భారత్ లో విలీనమయ్యేతంవరకూ పరిపాలించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం. ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పటిష్టపరుచుటలో కుతుబ్ షాహీలదే ప్రధాన పాత్ర. వారు ఈ కోట నిర్మాణం కోసం వారు పర్షియా నుంచి నిపుణులను రప్పించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

గోల్కొండ నిర్మాణం పర్షియన్ ఆర్కిటెక్చర్ అద్భుతానికి ప్రతీకగా చెబుతారు. 500ఏళ్ల క్రితం వినియోగించిన ఇంజనీరింగ్ విధానం ఆశ్చర్యపరుస్తుంది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పై వారికి సమాచారం చేరవేసేందుకు ధ్వని, ప్రతిధ్వని అనే విధానాన్ని ఈ కోట నిర్మాణంలో వినియోగించారు. అందువల్లే ఈ కోట ఇంత ప్రాచూర్యం చెందింది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

కోట కింద భాగంలో చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో లోపల ఉండే బాలాహిసార్ వద్ద ఆ శబ్ధం వినిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం కనిపించకుండా ముందు కర్టెన్ వాల్ కూడా నిర్మించారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

దీని వల్ల శత్రు సైన్యం తికమక పడే అవకాశం ఉంది. కోటలో ఊట బావులు, వర్షపు నీటి నిల్వ బావులు ఏర్పాటు చేశారు. వీటిలోకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గం చెరువు నుంచి నీళ్లు వచ్చేవి.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

దీని కోసం మట్టి పైపులు, ఇనుప చక్రాలు వాడేవారు. ఇటువంటి నిర్మాణ విధానాలు అప్పట్లో దేశంలోని ఏ ఇతర కోట నిర్మాణంలోనూ వాడలేదని చెబుతారు. కోట నిర్మాణం పద్మవ్యూహాన్ని పోలినట్లు ఉంటుంది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

120 మీటర్ల ఎత్తున్న నల్లరాతి కొండ పై గోల్కొండ కోటను నిర్మించారు. ఇది 87 అర్థచంద్రాకార బురుజులతో 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన సింహద్వారాలు ఉన్నాయి.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

రాజ దర్బారుకు చేరాలంటే మూడు మార్గాలు ఉన్నాయి. ఇక్కడి మెట్లు పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. శత్రువులు కోటలోపలికి ప్రవేశించినా చివరికి సైనిక స్థావరాల్లోకి వెళ్లేలా ఈ మెట్లను నిర్మించడం అప్పటి ఇంజనీరింగ్, యుద్ధ తంత్ర నైపుణ్యానికి తార్కాణం.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఈ కోటకు ఉన్న ప్రధాన ద్వారాలను ఇనుముతో నిర్మించారు. కోటలోకి చేరుకోవడానికి 380 రాతి మెట్లున్నాయి. ఇక ఈ కోటకు అన్ని వైపులా ఫిరంగులు ఉండేవి. వీటిలో కొన్నింటిని మనం ఇప్పటికీ చూడవచ్చు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

బాలామిసార్ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బడి బౌలికి కొద్ది దూరంలో మెట్ల కిందుగా పారే ఒక కాలువ ఉండేది.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఇది దగ్గర్లోని చెరువు కోటకు 5 మైళ్ల దూరంలో ఉంది. కోటలో ఉన్న తోటలకు, పొలాలలకు ఈ కాలువ ద్వారానే నీరు మళ్లించి పంటలను పండించేవారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

P.C: You Tube

ఈ కోటలో దాద్ మహల్ కూడా చూడదగినది. ఇక్కడికి అప్పట్లో ప్రజలు వచ్చి తమ కష్టాలను చెప్పుకొనేవారు. రాజు ఈ దాద్ మహల్ లోని బాల్కని నుంచి వాటిని విని తగు సహాయం చేసేవారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X