Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు దేవాలయ గోపురాలు !

తమిళనాడు దేవాలయ గోపురాలు !

తమిల్ నాడు రాష్ట్రంలోని దేవాలయాలపై కల ఎత్తైన, బలమైన గోపురాలు, నేటి ఆధునిక ఇంజనీర్ లకు , శిల్పులకు ఒక వండర్ గా వుంటాయి. ఈ గోపురాలు వివిధ విగ్రహాలతో, లేదా ఇతర చెక్కడాలతో నిర్మించబడి ఆకర్షణీయంగా వుంటాయి. వీటి పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తే, వీటి నిర్మాణానికి మూలం ఈజిప్ట్ లోని పిరమిడ్ నిర్మాణాలని చెప్పవచ్చు. ఈ పిరమిడ్ నిర్మాణాలు విశ్వంలోని విశ్వశక్తిని ఆ నిర్మాణాలలో ప్రసరిస్తాయని నమ్ముతారు. మరికొందరు, ఈ గోపురాలు అక్కడ కల నివాస భవనాల మధ్య దేవాలయాన్ని వేరు చేసి తెలియ చేస్తాయని చెపుతారు.

ఈ రకంగా, ఈ గోపురాలు, దేవాలయ ప్రత్యేకతకు నిర్మించినా, లేక, ఒక విశ్ శక్తి ప్రసరణకు నిర్మించినా అవి మాత్రం ఆకర్షణీయంగా వుండి ఒక విభిన్నతను చాటుతూ వాటి ప్రత్యేకతను నిలుపుకున్టున్నాయి. చూసే వారికి కన్నులకు ఒక విందుగా ఉంటున్నాయి. మనదేశంలోని తమిల్ నాడులో ఈ గోపురాల ఆవిర్భావం, పల్లవ రాజుల కాలంలో మొదలైంది. పాండ్య రాజుల పాలన వచ్చే సరికి అంటే సుమారు 12వ శతాబ్దం నాటికి భారతీయుల మనస్సులో గోపురం ప్రభావం పెరిగిపోయింది. సంగం ల కాలంనాటి తమిళ కవులు ఈ గోపురాలను శాశ్వత ప్రవేశ ద్వారాలుగా కీర్తించే వారు.

ఈ గోపురాలపై చెక్కబడే ప్రతి చెక్కడం కూడా ఎంతో వివరవంతమైన అంశంగా వుంటుంది. ఎంతో శ్రమకోర్చి గోపురం నిండుగా చెక్కిన ఈ చెక్కడాలు చూసే వారికి సంతోషాన్ని ఇస్తాయి. ఈ గోపురాలు మన భూమిపై కల గొప్ప ఇతిహాస అంశాలని కూడా చెప్పవచ్చు. ఒక దేవాలయ గోపురం, ఆ దేవాలయ దేముడి యొక్క రూపాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. భక్తులు టెంపుల్ ప్రవేశం చేస్తూనే, తలలు వంచి నమస్కరించి ప్రాపంచిక సుఖాలను వదలి ప్రవేశిస్తారు. గోపురాల వైభవంలో మునిగి ఆనందించే భాగ్యం భక్తుడైన ప్రతి ఒక్కరికి దక్కుతుంది. తమిల్ నాడు లోని దేవాలయాల గోపురాలు ప్రతి ఒక్కటి అందానికి, వాటి నిర్మాణ కౌశలతకు పేరు గాంచాయి. మరి అట్టి దేవాలయాల గోపురాలు కొన్ని పరిశీలించి ఆనందిద్దాం.

తమిళ్ నాడు దేవాలయ గోపురాలు !
తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

శ్రీ రంగం లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయ గోపురం ఇండియా లోనే అత్యంత ఎత్తైనది. ఈ పట్టణం కావేరి నదీ ద్వీపంగా చెప్పబడుతుంది. ఈ టెంపుల్ కు 21 గోపురాలు కలవు. వీటిలోని రాజ గోపురం లేదా ప్రధాన గోపురం 236 అడుగుల పొడవుతో 13 కలశాలు కలిగి వుంటుంది. పై భాగంలో బరువైన రాగి నిర్మాణం కలిగి వుంటుంది. టెంపుల్ యొక్క ఏడు ప్రాకారాలు, లేదా గోడలు ఏడు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అవి పృథ్వీ ( భూమి),జల(నీరు),తేజ (ఫైర్), వాయు (ఎయిర్) ఆకాశ (స్పేస్) మనస్సు (మైండ్), బుద్ధి (తెలివి) గా చెపుతారు.

తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

మదురై మీనాక్షి టెంపుల్ గోపురం అన్ని గోపురాలలోకి చాలా అందంగా వుంటుంది. చక్కని పనితనం కలిగిన చెక్కడాలు, అత్యధిక ఎత్తులతో ఇక్కడ పది గోపురాలను నల్లని గ్రానైట్ రాతితో నిర్మించారు. తూర్పున కల అతి పురాతన గోపురం సుందర పాండ్య రాజులు నిర్మించారు. ఇది ఆ రోజులలో వారి వ్యక్తిగత దేవాలయంగా వుండేది. తమిల్ నాడులో ఈ టెంపుల్ పట్టణాలు ఆ రాజుల కాలంలో అభివృద్ధి చెందాయి.

తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

తిరువిల్లి పుతూర్ లోని దివ్య దేశం గోపురం తమిళ్ నాడు ప్రభుత్వ చిహ్నంగా వుంటుంది. మదురై నాయకల పాలనలో ఇది అతి పొడవైన గోపురంగా వుండేది. ఈ టెంపుల్ సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి విష్ణు దేవాలయాలలో బాగా ప్రసిద్ధి చెందినది. 59 మీటర్ల ఎత్తైన ఈ గోపురం 11 అంతస్తులు కలిగిన నిర్మాణం. శ్రివిల్లిపుతూర్ ఆళ్వార్ ప్రముఖులు అయిన పెరియాళ్వార్ మరియు అండాల్ ల జన్మస్థలం.

తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

అన్నామలై గోపురం ప్రతిష్టాత్మకమైనది. అన్నామలై లేదా అరుణాచల కొండలలోని తిరువన్నామలై టెంపుల్ కాంప్లెక్స్ దాని నాలుగు ప్రవేశ ద్వారాలలోను నాలుగు గోపురాలు కలిగి వుంది. ప్రధాన గోపురం లేదా రాజగోపురం తూర్పు వైపు కలదు. దీని నిర్మాణం విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయల కాలంలో ప్రారంభించబడి, సేవప్ప నాయక రాజు పాలనలో పూర్తి అయింది.

తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం. శైవులైన నయనార్లు నిర్మించారు. వీరు ఈశ్వరుడైన ఎకామ్బరేస్వరుడిని కొలిచే వారు. ఈ టెంపుల్ కాంచిపురంలో వుంది. దీని గోపురం కూడా ఎంతో పొడవైనది. ఈ దేవాలయం విజయనగర రాజుల వైభవానికి చిహ్నంగా వుండేది. పది హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో అయిదు విస్తారమైన ప్రాంగణాలు, ఒక వేయి స్తంభాల హాలు కలవు.

తమిళ్ నాడు గోపురాలు

తమిళ్ నాడు గోపురాలు

చిదంబరం గోపురం ఎంతో సుందరమైనది. ఈ టెంపుల్ ను తిల్లై నటరాజ టెంపుల్ అని పిలుస్తారు. దీనికి నాలుగు గోపురాలు నాలుగు దిశలకూ కలవు. ఒక్కొక్క గోపురానికి ఏడు అంతస్తులు వుంటాయి. గోపురాలు ప్రతి ఒక్కటి కూడా అందమైన నగిషీ చెక్కడాలతో సుందరంగా వుంటుంది. పడమర దిశగా కల గోపురం సుమారు 12 వ శతాబ్దం నాటిది. తూర్పు గోపురం పై అతి సుందరమైన 108 భరతనాట్య భంగిమలు కలవు. తప్పక చూడవలసిన దేవాలయాలలో చిదంబరం దేవాలయం ఒకటి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X