Search
  • Follow NativePlanet
Share
» »వివాహ సంతాన భాగ్యాన్ని కలిగించే ఈ లక్ష్మీ దేవిని శ్రావణ మాసంలో సందర్శిస్తే

వివాహ సంతాన భాగ్యాన్ని కలిగించే ఈ లక్ష్మీ దేవిని శ్రావణ మాసంలో సందర్శిస్తే

తుమకూరు దగ్గర్లోని గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం

శ్రావణ మాసంలో శక్తి స్వరూపాలైన పార్వతిదేవి, లక్ష్మీ దేవిలకు ప్రత్యేక పూజలు జరపడం అనాదిగా హిందూ సంప్రదాయంలో భాగం. ఆ దేవతలు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలు ఎంత దూరం ఉన్నా భక్తులు ముఖ్యంగా మహిళలు అక్కడికి వెళ్లి ఆ ఆది దేవతలకు పూజలు చేస్తుంటారు. అందులో గొరవన హళ్లి లక్ష్మీ దేవి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడికి వెళ్లి పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలు తొలిగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మంగళ, శుక్రవారాల్లో ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube

హిందూ దేవతల్లో మహాలక్ష్మీ అమ్మవారిది ప్రత్యేక స్థానం. ఆ దేవతను కొలవడం వల్ల తమ ఇళ్లల్లో సకల భోగ భాగ్యాలు సమకూరుతాయని అందరూ కోరుకొంటారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
అయితే మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక దేవాలయాలు చాలా అరుదు. మహావిష్ణువు కొలువు దీరిన దేవాలయంలో లక్ష్మి ఆయన చెంత ఉంటుంది. లేదా ఆ ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా కూడా ఉంటుంది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
ఇక వేంకటేశ్వరుడి దేవాలయంలో ఆయన వామ భాగంలో మహాలక్ష్మిని ప్రతిష్టించి ఆయనతో పాటు పూజలు చేస్తారు. కేవలం మహాలక్ష్మికి మాత్రమే దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
అటువంటి దేవాలయాలను వేళ్ల పై లెక్కబెట్టవచ్చు. అటువంటి కోవకు చెందినదే కర్నాటకలోని తుమకూరు జిల్లా గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఆమె భక్తులతో నీరాజనాలు అందుకొంటోంది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
అంతే కాకుండా ప్రస్తుతం ఆ దేవాలయం ట్రస్టీ అనేక దాత`త్వ కార్యక్రమాలు చేస్తున్నారు. బెంగళూరుకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం ఆసక్తికరం.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో గొరవన హళ్లి ప్రాంతంలో గోవుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అవి చేసే శబ్దాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి గొరవన హళ్లి అని పేరు వచ్చింనట్లు చెబుతారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో అరసు వంశానికి చెందిన అబ్బయ్య నిత్యం పశువులను మేపుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆయన నరసయ్యనపాళ్య గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లగా తనను ఇంటికి తీసుకు వెళ్లాల్సిందిగా ఒక ఆడ స్వరం వినిపించింది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
దీంతో అతను ఆ స్వరం వినిపించిన చోటు వెదుకగా విచిత్ర రంగులో మెరిసిపోతున్న ఒక రాతి పలక కనిపింది. దీంతో తన తల్లి అనుమతి తీసుకుని శిలా రూపాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి భక్తి శ్రద్ధలతో పూజించాడు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
దీంతో అతడు కొద్దికాలంలోనే ధనవంతుడిగా మారిపోయి తన కుటుంబంతో సుఖంగా జీవించసాగాడు. దీంతో అతని ఇంటికి లక్ష్మీ నివాసం అని పేరు వచ్చింది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
కొన్ని రోజుల తర్వాత అబ్బయ్య తమ్ముడైన తోటప్పయ్య లక్ష్మీ దేవిని పూజించడం మొదలుపెట్టాడు. ఒకరోజు లక్ష్మీ దేవి ఆయన కలలో కనిపించి తనకు గొరవనహళ్లిలో ఒక దేవాలయాన్ని నిర్మించి తన విగ్రహాన్ని అక్కడ పున:ప్రతిష్టించాలని సూచించింది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
దీంతో ఆయన లక్ష్మీ దేవి చెప్పినట్లే చేశారు. కొన్ని రోజుల పాటు ఆ దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్యాన్నదానాలు బాగానే జరిగాయి. అయితే అటు పై ఆ ఆలయం ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువై పోయారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
దీంతో ఆలయంలో పూజలు జరగలేదు. ఈ నేపథ్యంలో గొరవన హళ్లికి కోడలిగా వచ్చిన కమలమ్మ ఈ దేవాలయం స్థితిగతులను చూసి చాలా బాధపడింది. అటు పై ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఈ దేవాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థితికి అభివ`ద్ధి చేసింది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
క్రమంగా దేవాలయానికి భక్తుల రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా ఈ లక్ష్మీ దేవిని కొలిచిన వారి కష్టాలు తీరి వారు సంపన్నులుగా మారుతూ వచ్చారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
అంతేకాకుండా పెళ్లికాని అమ్మాయిలు 48 రోజుల పాటు గొరవన హళ్లి లక్ష్మీ దేవిని ఆరాదిస్తే వివాహ యోగం కలుగుతుందని నమ్ముతున్నారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
దీంతో కేవలం కర్నాటక నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
అంతేకాకుండా ఆషాఢమాసం చివరి శుక్రవారం ఇక్కడ జరిగే చండికా హోమం, శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయంలో వేల సంఖ్యలో మహిళా భక్తులు హాజరవుతారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కోసం కమలమ్మ మార్గదర్శనంలో ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి వచ్చే భక్తులకు వసతి కల్పిస్తున్నారు. ఇక్కడ నిత్యం రెండు పూటలా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
వీటితో పాటు సామూహిక వివాహాలు, వైద్య శిబిరాలు, ఉచిత కంటి ఆపరేషన్లు, విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ తదితర సేవాకార్యక్రమాలను ఈ దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
తుమకూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరవన హళ్లికి చేరుకోవడానికి తుమకూరు హైవేలోని దాబాస్ పేట మీదుగా రోడ్డు మార్గం చాలా బాగుంది. తుమకూరు నుంచి వచ్చేవారు కొరటగెరె మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

గొరవన హళ్లి మహాలక్ష్మీ దేవాలయం, తుమకూరు

P.C: You Tube
గొరవనహళ్లికి సమీపంలో చుట్టు పక్కల దేవరాయన దుర్గా, నామద చిలుమె, సిద్దర బెట్ట, సిద్ధగంగా, శివ గంగా వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X