Search
  • Follow NativePlanet
Share
» » గుల్మార్గ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !

గుల్మార్గ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !

కాశ్మీర్ లో కల గుల్మార్గ్ ప్రదేశం పర్యాటకులకు ఒక రిసార్ట్ వంటిది. సంవత్సరంలో ఎపుడైనా సరే చూడదగిన వాతావరణం ఈ ప్రదేశంలో కలదు.

ఇక్కడ గొందోలాస్ అనబడే కేబుల్ కార్లు ప్రసిద్ధి. ప్రపంచంలో ని ఆకాశం ఎత్తులకు ఈ కేబుల్ కార్లు మిమ్ములను తీసుకు వెళతాయి. గుల్మార్గ్ అంటే ' పూల మార్గం ' అని అర్ధం చెప్పవచ్చు. మార్చ్ నుండి అక్టోబర్ వరకూ ఈ ప్రదేశం మరింత ఆహ్లాదకరంగా వుంటుంది.

శ్రీనగర్ నుండి ఒక పగలు ప్రయాణంలో చూసి రావచ్చని చెపుతారు. కాని ఒకసారి ప్రదేశం చూస్తె, మీకు దానిని వదలాలనిపించక మరికొన్ని రోజులు కూడా బస చేస్తారు.

ఈ ప్రదేశాన్ని యూసఫ్ షా చాక్ అనే రాజు పదహారవ శతాబ్దంలో స్థాపించాడు. అతని తర్వాత వచ్చిన మొగలాయీలు, బ్రిటిష్ వారు గుల్మార్గ్ ను మరింత అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ఇక ఇపుడు మన దేశంలోని బాలి వుడ్ ఈ ప్రదేశాన్ని దాని షూటింగ్ లతో మరింత పెంచి పోషిస్తోంది.

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

గుల్మార్గ్ ఎలా చేరాలి ?

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లో రెండు లేదా రెండున్నర గంటల ప్రయాణంలో గుల్మార్గ్ చేరవచ్చు. టాక్సీ అద్దె సుమారు రెండువేల రూపాయలు గా వుంటుంది.

Photo Courtesy: Basharat Alam Shah

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

గుల్మార్గ్ జీవ వైవిధ్యం

గుల్మార్గ్ వన్య జీవ రక్షిత ప్రాంతం లో మీరు అనేక పక్షులను చూడవచ్చు. పక్షి పరిశీలకులకు ఇది ఒక స్వర్గంగా వుంటుంది. మాస్క్ డీర్ , ఫ్ల్యింగ్ ఉడుత, రెడ్ ఫాక్స్, బ్లాకు మరియు బ్రౌన్ బేర్ వంటివి చూడవచ్చు.

Photo Courtesy: Basharat Alam Shah

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

రింగ్ రోడ్ మరియు లోయలు

ఇక్కడ ఇన్నర్ మరియు ఔటర్ రింగ్ రోడ్ లు కలవు. వీటిపై నడుస్తూ ప్రకృతి అందాలు చూడవచ్చు. లేదా ఒక పోనీ అద్దెకు తీసుకుని ఎక్కి తిరగవచ్చు. స్ట్రా బెర్రీ వాలీ తప్పక చూడదగిన ప్రదేశం. గుల్మార్గ్ లో ప్రపంచ ఎత్తైన, ఇండియా లో పొడవైన గోల్ఫ్ కోర్సు కలదు. నేడు హిందీ సినిమా షూటింగ్ లలో చూపబడే మహారాణి టెంపుల్ తప్పక చూడదగిన ఆకర్షణ.

Photo Courtesy: Basharat Alam Shah

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

స్కయింగ్ (వింటర్ లో మాత్రమే)

ఈ ప్రదేశం గోల్ఫ్ కోర్సు పైమార్గంలో ఖిలన్ మార్గ అనే పేరుతో కలదు. ఈ మార్గంలో స్కయింగ్ చేస్తారు. స్కయింగ్ కు అవసరమైన పరికరాలు రూ.500 కు అద్దెకు దొరుకుతాయి.

Photo Courtesy: Peter

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

ఆల్ పత్తర్ లేక్

మీలోని యువ రక్తం ఉర్రూత లూగుతూంటే, ఆల్ పత్తర్ లేక్ వరకూ ట్రెక్కింగ్ చేయండి. దీనినికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

Photo Courtesy: Ajay Panachickal

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పుణ్య స్థలం మరియు జలాపాతం

బాబా రిషి అనే ముస్లిం ప్రవక్త కల ప్రదేశంలో ప్రార్ధించండి. అక్కడ నుండి నిగ్లి నల్లా అనే మంచు కరగిన నీటి జలపాతం వెళ్లి చూడండి.

Photo Courtesy: Basharat Alam Shah

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

మౌంటేన్ బైకింగ్

స్కయింగ్ సీజన్లో కాకుంటే, మౌంటెన్ బైకింగ్ జూన్ నుండి సెప్టెంబర్ వరకూ చేయవచ్చు. సైకిల్ పై కొండల పై నుండి జారిపోవచ్చు.

Photo Credit: julian correa

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

పూల మార్గంలో ప్రదేశ అందాలు !

గొందోలాస్

గుల్మార్గ్ లో గొందోలాస్ అనబడే కేబుల్ కారులు ప్రసిద్ధి. సుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తునుండి కిందకు లోయలలోకి చూస్తూ ప్రయాణిస్తారు. దీని ప్రయాణ ధర సుమారు రూ.300 మాత్రమే. షాపింగ్ కూడా ఇక్కడ చేయవచ్చు. అయితే, శ్రీనగర్ తో పోలిస్తే, ధరలు అధికం.

Photo Courtesy: Vladimir Yaitskiy

మరిన్ని గుల్మార్గ్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X