» »ఏర్కాడులో హ్యాపీ సమ్మర్ ట్రిప్....

ఏర్కాడులో హ్యాపీ సమ్మర్ ట్రిప్....

Posted By: Venkata Karunasri Nalluru

ఏర్కాడు అన్న ప్రదేశం "ఏరి" మరియు "కాడు" అన్న రెండు తమిళ పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఏరి అంటే సరస్సు అని, కాడు అంటే అడవి అని అర్థం. ఎర్కాడు తమిళనాడులోని సేలం పట్టణానికి దగ్గరలో వున్నది. దీనిని పేదల "ఊటీ" గా చెప్తారు. ఇది తూర్పు కనుమలలోని సెర్వరాయాన్ కొండల్లో ఉన్న పర్వత ప్రాంతం. దీనిని ఏర్కాడు లేదా ఎర్కాడు అంటారు.

చెన్నైకి ఏర్కాడు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సెర్వరాయాన్ పర్వత శ్రేణులలో వున్న ఏర్కాడులో వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో వుంది. అందుకే ఈ హిల్ స్టేషన్ ను పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శిస్తుంటారు. ఏర్కాడులో సమృద్ధిగా పెరిగిన చెట్లు, వన్య సంపద కలిగిన అభయారణ్యం ఉన్నాయి. కాఫీ, నారింజ, పనస, జామ, యాలకులు మరియు మిరియాల వంటి తోటలకు ప్రసిద్ధి చెందినది.

విశాఖ సాగరతీరాలు.. మీ కోసం..

ఏర్కాడు అందాలు

1. ఏర్కాడు ఎలా చేరుకోవాలి ?

1. ఏర్కాడు ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ఏర్కడులో ఎటువంటి విమానాశ్రయం లేదు దీనికి సమీపంలో 183 కి. మీ. దూరంలో తిరిచ్చి దేశీయ విమానాశ్రయం ఉంది. కోయంబత్తూర్, బెంగళూరు నగరాలు దగ్గరలో ఉన్న ఇతర విమానాశ్రయాలుగా ఉన్నాయి. తిరిచ్చి నుండి ట్యాక్సీ ల ద్వారా ఏర్కాడు చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఏర్కాడులో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు దీనికి సమీపంలో 35 కి. మీ. దూరంలో ఉన్న సేలం వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. దక్షిణ భారత దేశంలో ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లని సేలంలో తప్పకుండా ఆగుతాయి. జోలర్పట్టి, ఏర్కాడు నుండి 20 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్.

బస్సు లేదా రోడ్డు మార్గం

ఏర్కాడు - తమిళనాడు మరియు దాని ప్రక్క రాష్ట్రాల అన్ని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గాన్ని కల్గి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులతో బాటుగా ప్రైవేట్ బస్సులు కూడా ప్రతి రోజు సేలం నుండి ఏర్కాడుకు నడుస్తాయి.

Photo Courtesy: Santhosh

2. ఏర్కాడులో బస

2. ఏర్కాడులో బస

ఏర్కాడులో అనేక స్టార్ హోటళ్లతో పాటు చిన్నా, చితక హోటళ్లు చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్, రిసార్టులు మరియు గెస్ట్ హౌస్ అని ఇలా చాలానే ఉన్నాయనుకోండి. కానీ తమిళనాడు పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్న తమిళనాడు, యూత్ హాస్టల్ లు పర్యాటకులకు చౌకైన ధరలలో అందరికీ అందుబాటులో ఉంటాయి.

Photo Courtesy: sukriti_ragunath

3. ఏర్కాడు అందాలు

3. ఏర్కాడు అందాలు

ఏర్కాడులో అద్భుత సూర్యాస్తమం

Photo Courtesy: Thangaraj Kumaravel

4. బొటానికల్ గార్డెన్

4. బొటానికల్ గార్డెన్

ఫ్లవర్ క్యాంప్ సమయంలో అందమైన రంగు రంగుల పూలను ఒక క్రమ పద్దతిలో పేర్చి అందమైన ఆకారాలను తయారుచేస్తారు. ఈ పూల ప్రదర్శన చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.

Photo Courtesy: Aruna

5. టిప్పరరి వ్యూ పాయంట్

5. టిప్పరరి వ్యూ పాయంట్

ఏర్కాడు హిల్ స్టేషన్ కి దక్షిణాన టిప్పరరి వ్యూ పాయంట్ ఉన్నది. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ టూత్ రాక్స్ తో పాటుగా అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. టిప్పరరి రోడ్ మార్గం ద్వారా చేరుకొనే ఈ ప్రదేశం ఆధ్యాంతం ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన తెల్లటి రాళ్లు ఉల్కలు కింద పడటం వల్ల ఏర్పడినవిగా పరిగణిస్తారు.

Photo Courtesy: telugu native planet

6. అందమైన అభయారణ్యం

6. అందమైన అభయారణ్యం

ఏర్కాడులో ఒక అందమైన అభయారణ్యం ఉనండి. ఇక్కడ ఏపుగా పెరిగిన చెట్లు, వన్య మృగాలు సమృద్దిగా కనిపిస్తాయి. అడవి దున్న , లేడి, నక్కలు, ముంగీసలు, పాములు, ఉడుతలు వంటి వాటితో పాటుగా బుల్ బుల్ పిట్టలు, గడ్డలు, పిచ్చుకలు, కోకిల వంటి పక్షులను కూడా గమనించవచ్చు.

Photo Courtesy: anitaa.rajkumar

7. సెర్వరాయాన్ దేవాలయం

7. సెర్వరాయాన్ దేవాలయం

ఏర్కాడు లో కెల్లా అతి ఎత్తైన ప్రదేశం " సెర్వరాయాన్ ఆలయం" ప్రముఖంగా చూడవలసిన ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 5326 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం కావేరీ దేవత, సర్వరాయుడు. వీరిరువురిని గ్రామ దేవ దూతలుగా పరిగణిస్తారు.

Photo Courtesy: telugu native planet

8. అందమైన లోయలో రాజరాజేశ్వరి దేవాలయం

8. అందమైన లోయలో రాజరాజేశ్వరి దేవాలయం

రాజరాజేశ్వరి దేవాలయం ఏర్కాడు పర్వత ప్రాంతంలో ఉన్న దేవాలయాల మాదిరిగానే ఒక అందమైన లోయలో ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం దేవతలకే దేవత అయిన రాజరాజేశ్వరి. ప్రధాన దైవం చుట్టూ రుద్రా, విష్ణు, లక్ష్మి, బ్రహ్మ,సరస్వతి వంటి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, పరిసర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Photo Courtesy: Aruna

9. ఆకర్షించే సరస్సు

9. ఆకర్షించే సరస్సు

ఏర్కాడులో కాలు పెట్టగానే ఆకర్షించే మరో ప్రదేశం సరస్సు. పడవలో వెళ్తూ వుంటే ఎంతో ఉత్సాహంగా వుంటుంది.

Photo Courtesy: Mithunkundu1983

10. అతి దగ్గరగా వున్న రైల్వేస్టేషన్

10. అతి దగ్గరగా వున్న రైల్వేస్టేషన్

జోలర్పట్టి, ఏర్కాడు నుండి 20 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్.

Photo Courtesy: telugu native planet