» »హైదరాబాద్ లో దెయ్యాలు ఉన్న భవంతుల్లోకి వెళ్లారా

హైదరాబాద్ లో దెయ్యాలు ఉన్న భవంతుల్లోకి వెళ్లారా

Written By: Beldaru Sajjendrakishore

దెయ్యం... దీనికి సరైన నిర్వచనం కాని శాస్త్రీయ ఆధారాలు కాని ఉండవు. అయితే ఇది నిత్యం ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. శాస్ర్త, సాంకేతికత ఎంత అభివద్ధి చెందినా ఈ దెయ్యం గురించి నిత్యం ఏదో ఒక చోట చర్చ జరుగుతూతే ఉంటుంది. ఇందుకు మన హైదరాబాద్ అతీతమేమి కాదు.

ఎంతో చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ఈ నగరం ప్రస్తుతం ఐటీ రంగంలో కూడా మేటిగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దెయ్యాలు ఇప్పటికీ తిరుగుతున్నాయని నమ్ముతున్నారు. ఇందులో శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఉప్పల్ స్టేడియంలు కూడా ఉండటం విశేషం

1. ఫిల్మ్ సిటీ దగ్గరగా....

1. ఫిల్మ్ సిటీ దగ్గరగా....

Image source:


హైదరాబాద్ శివారులో ఉన్న ఫిల్మ్ సిటీ ప్రాంతం నిజాం కాలంలో యుద్ధ క్షేత్రమని చరిత్ర చెబుతోంది. ఎంతో మంది రాజులు, సైనికులు ఈ యుద్ధ క్షేత్రంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వారంతా దెయ్యాలుగా మారి ఇప్పకిటీ అక్కడ తిరుగుతుంటారని చెబుతారు.

2. అద్దాల పై ఉర్థూ అక్షరాలు

2. అద్దాల పై ఉర్థూ అక్షరాలు

Image source:

ముఖ్యంగా ఇక్కడి స్టార్ హోటల్స్ లో దిగే పర్యాటకుల రూంలలోని అద్దాల పై ఉర్థూ అక్షరాలు కనిపించడం, బాత్ రూంలో ఉంటే బయటి నుంచి గొల్లాలు పెట్టడం వంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రాత్రి సమయాల్లో అస్పష్ట మాటలు కూడా గదిలో వినిపిస్తుంటాయని పర్యాటకులు చెబుతుంటారు.

3.కుందన్ భాగ్ లోని దెయ్యాల కొంప

3.కుందన్ భాగ్ లోని దెయ్యాల కొంప

Image source:


హైదరాబాద్ లోని కుందన్ బాగ్ లో 2002 ఏడాదిలో ఒక ఇంట్లో 56 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరి బిడ్డల శవాలను పోలీసులు గుర్తించారు. వారు చనిపోయి అప్పటికే దాదాపు మూడు నెలలు కావొస్తోందని వైద్యులు నిర్థారించారు.

4. రక్తపు సీసాలను వేలాడ దీసేవారు

4. రక్తపు సీసాలను వేలాడ దీసేవారు

Image source:


వారు బతికున్నప్పుడు కూడా విచిత్రంగా ప్రవర్తించేవారని చుట్టు పక్కల వారు చెబుతారు. అర్థరాత్రి పూట ఇంట్లో కొవ్వొత్తలు వెలిగించడం, రాత్రి సమయంలో మహిళ గొడ్డలితో తిరగడం, వారి గార్డెన్ లో రక్తంతో నింపిన సీసాలను ఉంచడం వంటివి చేసేవారని తెలుస్తోంది. ఇక వారు చనిపోయిన తర్వాత ఆ ఇంటి చుట్టు పక్కలకు ఎవ్వరూ వెళ్లేవారు కాదు.

 5. శంషాబాద్ ఎయిర్ పోర్ట్

5. శంషాబాద్ ఎయిర్ పోర్ట్

Image source:

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ సమయంలో అనేక అల్లర్లు జరిగాయి. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి ముందుకు రాని వారిలో కొంతమందిని చంపారని తెలుస్తోంది. మరికొందరిని బలవంతంగా వారే ప్రాణాలు తీసుకునేలా చేశారు.

6. తల పూర్తిగా వెనక్కు తిరిగింది

6. తల పూర్తిగా వెనక్కు తిరిగింది

Image source:

ఈ విషయమై విచారణ జరిగే సమయంలో ఒక వ్యక్తి తన తలను పూర్తిగా వెనక్కు తిప్పి విచారణ అధికారులను భయపెట్టి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇప్పటికీ ఆ విమానాశ్రయంలో రాత్రుల సమయంలో వింత శబ్దాలు వినిపిస్తుంటాయని అక్కడి వారు చెబుతారు.

7. గోల్కొండ...కథల ఖిల్లా

7. గోల్కొండ...కథల ఖిల్లా

Image source:

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. వాటికి రెట్టింపు సంఖ్యలో ఈ కోటకు సంబంధించిన కథనాలు ఉన్నాయి. కాకతీయులు 13వ శతాబ్దంలో ఈ కోటను మొదట నిర్మించగా తర్వాత అనేక మంది రాజులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.

8. షూటింగ్ చేసే వారికి అనుభవం

8. షూటింగ్ చేసే వారికి అనుభవం

Image source:

ఈ క్రమంలో ఈ కోటలో దాచిని బంగారు, వజ్రాలు వైడ్యూర్యాల కోసం రాజులు మొదలుకొని కాపలా సైనికుల వరకూ అనేక కుతంత్రాలు పన్ని ఒకరిని ఒకరు హత్య చేసుకున్నారు. ఇలా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వారు దెయ్యాలుగా మారి రాత్రి సమయంలో ఆ గోల్కొండ కోటలో తిరుగుతూ ఉన్నారని చెబుతారు. రాత్రి సమయంలో షూటింగ్ లు జరుపుకొనే సమయంలో ఆ దెయ్యాల తాలూకు చిత్రాలు ఇప్పటికీ చిత్రించబడుతున్నాయని చెబుతారు.

9. ఉప్పల్ స్టేడియం

9. ఉప్పల్ స్టేడియం

Image source:

2005లో ఇద్దరు వ్యక్తులు తాము ఒక మూలలో నల్లటి ఆకారాన్ని చూశామని చెప్పారు. అంతే కాకుండా మమ్ములను చంపడానికి వచ్చిందని కూడా తెలిపారు. దీనిని మొదట ఎవరూ నమ్మలేదు. అయితే తదుపరి రోజుల్లో చాలా మందికి ఈ ఆకారం కనిపించింది. దీంతో ఇప్పటికీ అక్కడ పనిచేసే వారు ఒంటరిగా ఉండటానికి భయపడుతారు.

10.తారామతి బారాదరి

10.తారామతి బారాదరి

Image source:


తారమతి బరాదారి హైదరాబాదు లోని చారిత్రాత్మక ప్రదేశం; ఇది ఇబ్రహీంబాగ్ ఓ ఒక భాగంగా ఉంది. ఇది అబ్దుల్లా కుతుబ్ షా హైదరాబాద్ ను పరిపాలించే సమయంలో పర్షియన్ నిర్మాణ శైలిలో ఈ కట్టడాన్ని నిర్మించారు.

11. ఏకాంతంగా గడుపుతారు.

11. ఏకాంతంగా గడుపుతారు.

Image source:


తారామతి అనే వేశ్య స్వరాన్ని రెండుకిలోమీటర్ల దూరంలో గల గోల్కొండనుండి వినాలని అబ్దుల్లా కుతుబ్ షా అనుకునేవాడు. ఆమె అద్భుతమైన గాత్రం గాలితో ప్రయాణించి కోటలోని రాజుగారిని చేరేదట. ఇప్పటికీ రాత్రి సమయంలో ఈ పాట వినిపిస్తుందని చెబుతారు. అంతేకాకుండా ఈ భవనంలో రాత్రి సమయంలో వారిరువురూ ఏకాంతంగా గడుపుతారని ఆ సమయంలో అక్కడకు ఎవ్వరూ వెళ్లకూడదని స్థానికుల కథనం

12.డేడ్ లాక్ ఘర్

12.డేడ్ లాక్ ఘర్

Image source:

హైదరాబాద్ లోని సీతాఫల్ మండీ ప్రాంతలో దాదాపు 40 ఏళ్ల క్రితం ఒకటిన్నర లక్షల రుపాయల ఖర్చుచేసి ఈ భవనాన్ని నిర్మించారు. దీంతో దీనికి డేడ్ లాక్ ఘర్ అనే పేరు వచ్చింది. అయితే ఈ ఇంటి యజమాని గ`హప్రవేశం రోజే అతని భార్య చనిపోయింది. అటు పై ఆయన దీన్ని మరొకరికి అమ్మేశాడు.

13. అలా కొనడం ఇలా చనిపోవడం

13. అలా కొనడం ఇలా చనిపోవడం

Image source:


అతని భార్య కూడా ఒంటికి నిప్పు పెట్టుకుని బలవన్మరణం చెందింది. దీంతో భయపడిన సదరు ఓనరు ఈ ఇంటిని మరో వ్యక్తికి అమ్మాడు. అతను కూడా ఈ భవనం కొన్న వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ భవనం చుట్టు పక్కలకు వెళ్లడానికి చాలా మంది భయపడుతున్నారు.

14. తలలేని మొండం

14. తలలేని మొండం

Image source:


హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీ లోని ఒక ఇంటిని తల లేని ఒక దెయ్యం కాపాలా కాస్తూ ఉందని ఇప్పటికీ నమ్ముతారు. దాదాపు 50 ఏళ్ల క్రితం తన వద్ద అప్పు తీసుకొని సకాలంలో తీర్చని యువకుడిని చంపేశాడు. ఇతనే దయ్యం గా సదరు ప్రాంతంలో తిరుగుతున్నాడని చెబుతారు.

15. మంచి దెయ్యం

15. మంచి దెయ్యం

Image source:


అయితే ఈ తలలేని దయ్యం ఇప్పటి వరకూ ఒక్కరికీ హాని చేయలేదని తెలుస్తోంది. చాలా మందికి రాత్రి సమయంలో తలలేని మొండం సదరు ఇంటి వద్ద కనిపిస్తుందని స్థానికులే కాకుండా ఆ ప్రాంతం గుండా వెళ్లే వారు చెబుతుంటారు.

16. ఒకప్పటి కళాశాల

16. ఒకప్పటి కళాశాల

Image source:


ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కు పక్కగా ఒక పాడుపడిన భవనం కనిపిస్తుంది. ఆ భవనం లోకి వెళ్లినవారు తిరిగి వచ్చినట్లు దాఖలాలలు లేవని ఇక్కడి వారు చెబుతారు. గతంలో ఈ భవనం ఓ వైద్య విద్య కళాశాల. అయితే కొన్నేళ్ల క్రితం దీన్ని మూసివేశారు.

17. ఆ అదృశ్యం వెనక

17. ఆ అదృశ్యం వెనక

Image source:

ఆ సమంయలో కళాశాల విద్యార్థులు తమ ప్రాక్టికల్స్ కు వినియోగించే శవాలను అక్కడ నుంచి తరలించి ఖననం చేయలేదు. ఈ శవాలే దెయ్యాలుగా మారి ఈ భవనం లోపలికి వెళ్లే వారి ప్రాణాలు తీస్తున్నాయన్న కథనం ప్రచారంలో ఉంది.

పైన చెప్పిన విషయాలకు ఆధారాలు లేవు. అయినా ఇప్పటికీ హైదరాబాద్ లో దెయ్యాలు ఉన్నాయన్న ప్రాంతాలు ఏవంటే వీటి గురించే మొదట చెబుతారు.