Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలోని అతి ప్రాచీన ఈ ఐదు దేవాలయల దర్శనంతో మోక్షం మీ చెంతనే...

కర్ణాటకలోని అతి ప్రాచీన ఈ ఐదు దేవాలయల దర్శనంతో మోక్షం మీ చెంతనే...

కర్నాటకలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల గురించి కథనం.

భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం కర్నాటక. ముఖ్యంగా ఇక్కడ ఉన్న దేవాలయాల్లోని శిల్ప కళను మన సంప్రదాయాలకు ప్రతి బింబం. ఈ దక్షిణాధి రాష్ట్రంలో తమిళనాడు తర్వాత అత్యతం ప్రాచీన, పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయలు కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి. వీటి దర్శనానికి కేవలం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

టెంపుల్ టూరిజంలో తమిళనాడు తర్వాత అత్యధిక ఆదాయం గడిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటదే అగ్రస్థానం అని ఇక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇక్కడి దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కర్నాటలో అత్యంత పురాణ ప్రాధాన్యత కలిగిన, ప్రాచూర్యం పొందిన దేవాలయాల గురించి క్లుప్తంగా ఈ కథనంలో...

కొల్లూరు మూకాంబిక దేవాలయం

కొల్లూరు మూకాంబిక దేవాలయం

P.C: You Tube

మంగుళూరు నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూర్ లో ముకుంబిక దేవి ఆలయం ఉంది. ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం పశ్చిమ కనుమలలో కొడచాద్రి కొండలలో నిర్మించబడింది. ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల క్రితం నిర్మించిందని నమ్ముతారు. దేవాలయానికి వెనుక ఉన్న పురాణం కథనం ప్రకారం స్థానిక ప్రజలను పీడిస్తున్న కామాసుర అనే రాక్షసుడితో పార్వతి దేవి యుద్ధం చేస్తూ మొదట అతన్ని మూగవాడిగా చేసి చంపేసింది. అందువల్లే ఇక్కడ అమ్మవారిని మూకాంబిక పేరుతో కొలుస్తారు. నవరాత్రి సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఆలయ ట్రస్ట్ భక్తులకు ఉచిత ఆహారాన్ని అందిస్తోంది.

ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం

ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ భక్తులు మూలవిరాట్టును నేరుగా చూడటానికి వీలు కాదు. కేవలం ఒక కిటికీ ద్వారా మాత్రమే చూడటానికి వీలవుతుంది. పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి పరమభక్తుడైన కనకదాసు నిమ్నకులానికి చెందినవాడు. ఒకసారి ఈ దేవాలయంలోని శ్రీకృష్ణుడి దర్శానికి వెలితే కులాన్ని సాకుగా చూపిస్తూ ఆయన్ను ఆలయంలోకి పంపించలేదు. దీంతో భక్తితో పాట పడాగా శ్రీ శ్రీకృష్ణుడి విగ్రహం ఆశ్చర్య కరంగా వెనక్కు తిరిగింది. ఇప్పటికీ అదే స్థితిలో ఉంది. అందువల్లే ఇక్కడి మూలవిరాట్టును ప్రవేశ ద్వారం నుంచి కాకుండా దానికి ఎదురుగా ఉన్న గోడలో కల కిటికీ గుండా చూస్తాం. ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వేలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారు.

ధర్మస్ధల మంజునాథ ఆలయం

ధర్మస్ధల మంజునాథ ఆలయం

P.C: You Tube

ధర్మస్ధల మంజునాథ ఆలయం నేత్రావతి నది ఒడ్డున కలదు. కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఇది ఒకటి. ఆ పరమశివుడిని ఇక్కడ మంజునాథుడి పేరుతో కొలుస్తాడు. కోరిన కోర్కెలు వెంటనే తీర్చే దేవుడిగా మంజునాథుడిని ఆరాధిస్తారు. ప్రతి రోజూ కనీసం 25 వేల మంది ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. ఇది ప్రముఖ జైన క్షేత్రం కూడా .

 గోకర్ణ మహాభలేశ్వర్ దేవాలయం

గోకర్ణ మహాభలేశ్వర్ దేవాలయం

P.C: You Tube

గోకర్ణం ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అంతే కాకుండా ఇది బీచ్ టూరిజానికి కూడా ప్రాచూర్యం పొందింది. పురాణాల ప్రకారం రావణుడు ఆత్మలింగాన్ని శివుడి నుంచి పొందుతాడు. దీనిని తీసుకొని లంకకు వెలుతూ వినాయకుడు వల్ల ఆ ఆత్మలింగం గోకర్ణలో భూమిని తాకుతుంది. దీంతో ఆత్మలింగం ఇక్కడే ఉండిపోగా పరమశివుడు మహాభలేశ్వర్ పేరుతో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలోని శివుడు అత్యంత శక్తిమంతుడని భక్తుల నమ్మకం. ఇక్కడి గణపతి దేవాలయం కూడా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి.

విరూపాక్ష దేవాలయం, హంపి

విరూపాక్ష దేవాలయం, హంపి

P.C: You Tube

కర్నాటకలోని తుంగభద్ర నదీ తీరంలో హంపిలో ఈ విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పరమశివుడు విరూపాక్షుడి పేరుతో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందింది. ఈ దేవాలయంలోని శిల్పసంపద ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కర్నాటకలో విదేశీయులు ఎక్కువగ సందర్శించే దేవాలయాల్లో ఈ విరూపాక్ష దేవాలయం మొదటి వరుసలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X