Search
  • Follow NativePlanet
Share
» »సంస్కృత మాట్లాడే గ్రామం, పక్షులు ఆత్మహత్యలు చేసుకొనే గ్రామం. ఏమిటి ఈ వింత? మీరు కారణాలు చెప్పగలరా?

సంస్కృత మాట్లాడే గ్రామం, పక్షులు ఆత్మహత్యలు చేసుకొనే గ్రామం. ఏమిటి ఈ వింత? మీరు కారణాలు చెప్పగలరా?

భారత దేశంలో కొన్ని విచిత్రమైన గ్రామాలకు సంబంధించిన కథనం.

ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు భారత దేశం. ఈ సువిశాల భారత దేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాలు, వ్యవహారాలు ఒకరికి ఆచర్యంగా అనిపిస్తాయి. మరికొన్ని విషయాలకు సంబంధించి శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇందులో కొన్ని దేవాలయాలు ఉండగా, మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. అటువంటి కొన్ని గ్రామాల సమహారమే ఈ కథనం. ఇందులో నాగుపాములను ఇంట్లో పెంచుకొనే గ్రామం, పక్షులు సామూహికంగా ఆత్మహత్య చేసుకొనే గ్రామం, వేల సంవత్సరాలుగా అగ్ని వెలువడుతున్న గ్రామం తదితర విషయాలు ఉన్నాయి.

భయపడరు

భయపడరు

P.C: You Tube

పాము అంటే మనం ఆమడ దూరం పరుగెడుతాం. అయితే మహారాష్ట్రలోని షెత్పాల్ గ్రామ ప్రజలు మాత్రం పామును చూసి భయపడరు. చిన్న పిల్లలు కూడా వాటితో ఆడుకొంటారు.

విషపూరితమైనవే ఎక్కువ

విషపూరితమైనవే ఎక్కువ

P.C: You Tube

ఇంట్లోకి బంధువులు వచ్చినట్లు పాములు స్వేచ్ఛగా వస్తాయి. ఇంట్లో ఫ్యానులకు, గోడలకు పాములు వేలాడుతూ ఉంటాయి. ఈ గ్రామంలో విషపూరితమైన పాములే ఎక్కువ.

ది విలేజ్ ఆఫ్ స్నేక్స్

ది విలేజ్ ఆఫ్ స్నేక్స్

P.C: You Tube

అయినా అవి ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా హాని చేయలేదని స్థానికులు చెబుతారు. ది విలేజ్ ఆఫ్ స్నేక్స్ గా పిలిచే షెత్పాల్ గ్రామంలో ప్రజలంతా పాములతో సహవాసం చేస్తున్నా ఇంత వరకూ ఒక్కరు కూడా పాముకాటు వల్ల చనిపోలేదు.

సంస్కృత గ్రామం

సంస్కృత గ్రామం

P.C: You Tube

కర్నాటకలోని ఓ గ్రామం మొత్తం సంస్కృతంలోనే మాట్లాడుతారు. వారికి కన్నడతో పాటు తెలుగు, తుళు తదితర భాషలు వచ్చినా సంస్కృత భాషను మాట్లాడటానికే మొగ్గు చూపుతారు.

కూరగాయలమ్మే వ్యక్తి నుంచి

కూరగాయలమ్మే వ్యక్తి నుంచి

P.C: You Tube

ఇక్కడ కూరగాయలమ్మే వ్యక్తి నుంచి గుడిలో పూజారి వరకూ అంతా సంస్కృత భాషలోనే మాట్లాడానికి మొగ్గుచూపుతారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముస్లీంలు కూడా సంస్కృత భాషలోనే మాట్లాడటం. దాదాపు 500 ఏళ్లుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

జ్వాలా ముఖి ఆలయం

జ్వాలా ముఖి ఆలయం

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి గ్రామం లో జ్వాలాదేవి ఆలయం ఉంది. ఇది శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ పర్వతి దేవి స్వరూపమే జ్వాలామాత. ఈ ఆలయంలో నిరంతరాయంగా జ్యోతివెలుగుతూనే ఉంటుంది.

వందల ఏళ్ల నుంచి

వందల ఏళ్ల నుంచి

P.C: You Tube

ఆలయంలోని ఓ రాయి మధ్య నుంచి ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఈ జ్యోటి వెలుగుతూ ఉన్నట్లు చెబుతారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు.

తలుపులు లేని గ్రామం

తలుపులు లేని గ్రామం

P.C: You Tube

దొంగతనాలు, దోపిడీలు జరగని ప్రాంతం ఈ భూమండలం మీద ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. అయితే మహారాష్ట్రలోని ఒకే ఒక గ్రామం మాత్రం దీనికి మినహాయింపు. ఇక్కడ ఈ కలియుగం మొదలైనప్పటి నుంచి ఒక్క దొంగతనం కూడా జరగలేదు.

బ్యాంకుకు కూడా తాళాలు వెయ్యరు

బ్యాంకుకు కూడా తాళాలు వెయ్యరు

P.C: You Tube

ఇందుకు కారణం అక్కడ ఉన్నటు వంటి శనిమహాత్ముడు. అసలు ఈ గ్రామంలోని ఇళ్లకు తలుపులు ఉండవు. అయినా అక్కడ ఇప్పటి వరకూ ఒక్క దొంగతనం కూడా జరుగలేదు. ఇక్కడ ఉన్న బ్యాంకుకు కూడా తాళాలు వెయ్యక పోవడం గమనార్హం.

జతింగ

జతింగ

P.C: You Tube

అసోంలోని బోరైల్ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరే జతింగ. ఇది పర్వత లోయ ప్రాంతం. వేలాది పక్షులకు నిలయం. ప్రతి ఏడాది వర్షాకాలంలో అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పక్షులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకొంటాయి.

మాస్ బర్డ్ సూసైడ్

మాస్ బర్డ్ సూసైడ్

P.C: You Tube

ఈ కాలంలో రాత్రి వేళల్లో వేలాది వలస పక్షులు వేగంగా ప్రయాణించి అక్కడి చెట్లను, ఇళ్లను ఢీ కొట్టుకొని మరణిస్తాయి. పక్షులన్నీ ఇలా గుంపుగా మరణించడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని మాస్ బర్డ్ సూసైడ్ గా పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X