Search
  • Follow NativePlanet
Share
» » తెలంగాణలోని ఈ పర్యాటక స్థలాలన్నీ చూశారా?

తెలంగాణలోని ఈ పర్యాటక స్థలాలన్నీ చూశారా?

తెలంగాణలోని దేవాలయాలకు సంబంధించిన కథనం.

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ దేవాలయాల నిలయం. ఇందులో కొన్ని పురాణ ప్రాధాన్యత కలిగి ఉండగా మరికొన్ని కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించి ఎంతో చారిత్రాత్మక సంపదను తమలోని ఇముడ్చుకొన్నాయి. ఇందులో ఆలంపురం, బాసర, భద్రాచలం, వేములవాడ, యాదగిరి గుట్ట వంటి వాటికి పురాణ ప్రాధాన్యత ఉన్నాయి. ఇక్కడకు వెళితే మన పురాణాల్లోని ఎన్నో కథలు, కథనాలు మనకు శఇల్పాల రూపంలో దర్శనమిస్తాయి.

మల్లెల తీర్థం, కోటి లింగాల, ఏడు పాయల దుర్గాదేవి వంటి క్షేత్రాలు పురాణ ప్రాధ్యత కంటే వీకెండ్ రోజుల్లో సరదాగా గడపడానికి వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అతి ముఖ్యమైన 20 దేవాలయాలు అవి ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ తో పాటు ఆయా క్షేత్రాలకు దగ్గరగా ఉన్న నగరాల నుంచి ఆ దేవాలయాలకు ఉన్న దూరం తదితర వివరాలను మీకు అందిస్తున్నాం.

అంతేకాకుండా ఆయా దేవాలయాల చరిత్ర కూడా క్లుప్తంగా మీ కోసం. మరెందుకు ఆలస్యం చదివి మీకు అనువైన సమయంలో అక్కడకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

ఆలంపురం

ఆలంపురం

P.C: You Tube

ఆలంపురలో జోగులాంబ దేవాలయం భారత దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటి. అదే విధంగా ఈ దేవాలయం ప్రాంగణంలోనే మనం నవ బ్రహ్మ ఆలయాన్ని కూడా చూడవచ్చు. హైదరాబాద్ నుంచి 218 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 22 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 126 కిలోమీటర్ల దూరంలో ఆలంపురం ఉంటుంది. ఈ ఆలంపురానికి దగ్గరగా శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది.

బాసర

బాసర

P.C: You Tube

తెలంగాణలోని బాసర ప్రముఖ పుణ్యక్షేత్రం. గోదావరి నదీ తీరంలో చదువుల తల్లి కొలువై ఉన్న ప్రాంతమే బాసర. అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు తీసుకువస్తారు. నిజామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, అదిలాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో బాసరలోని సరస్వతీ దేవాలయం ఉంటుంది.

భద్రాచలం

భద్రాచలం

P.C: You Tube

శ్రీరాముడు కొలువై ఉన్న క్షేత్రమే భద్రాచలం. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ముఖ్యంగా సీతారామ కళ్యాణానికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేస్తుంది. ఇక్కడ శ్రీరాముడు శంఖు, చక్రాలతో నాలుగు చేతులతో ఉంటాడం విశేషం. హైదరాబాద్ నుంచి 312 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇక కొత్తె గూడెం నుంచి ఇక్కడికి 39 కిలోమీటర్లు కాగా, ఖమ్మం నుంచి 115 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 178 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 182 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి 352 కిలోమీటర్ల దూరం.

వేములవాడ

వేములవాడ

P.C: You Tube

ఇక్కడ పరమశివుడు రాజరాజేశ్వర స్వామి పేరుతో కొలువై ఉన్నాడు. కళ్యాణి చాళుక్యరాజైన రాజ్యాధిత్యుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ స్వామివారు రాజన్న పేరుతో భక్తులతో నీరాజనాలు అందుకొంటున్నాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని రాజ రాజేశ్వరి పేరుతో భక్తులు కొలుస్తారు. ఈ క్షేత్రం కరీం నగర్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక నిజమాబాద్ నుంచి ఇక్కడికి 127 కిలోమీటర్ల దూరం కాగా, హైదరాబాద్ నుంచి ఇక్కడకు 151 కిలోమీటర్లు.

యాదగిరి గుట్ట

యాదగిరి గుట్ట

P.C: You Tube

గుహాలయమైన యాదగిరి గుట్టలో మూలవిరాట్టును యాదగిరి నరసింహ స్వామి పేరుతో కొలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 300 అడుగుల ఎత్తులో దేవస్థానం ఉంటుంది. దీనిని వేదగిరి అని కూడా అంటారు. హైదరాబాద్ నుంచి 66 కిలోమీటర్ల దూరం, నల్గొండ నుంచి 85 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

P.C: You Tube

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 58 కిలోమీటర్ల దూరంలో ఈ మల్లెల తీర్థం ఉంటుంది. ఇక క్షేత్రానికి హైదరాబాద్ నుంచి 173 కిలోమీటర్లు. పరమశివుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం దగ్గర ఉన్న జలపాతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వారాంతాల్లో ఇక్కడకు వెళ్లడానికి చాలా అనుకూలం.

అమ్మపల్లి రామ చంద్ర దేవాలయం

అమ్మపల్లి రామ చంద్ర దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ కు 30 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామచంద్ర దేవాలయం చాలా తెలుగుసినామాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బుల్లి తెర షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం రాజగోపురం ఏడు అంతస్తులు.

మెదక్ చర్చ్

మెదక్ చర్చ్

P.C: You Tube

ఆసియాలో అతి విశాలమైన చర్చ్ గా దీనికి పేరుంది. అదే విధంగా వాటిన్ సిటీ తర్వాత ఇదే విశాలమైన చర్చ్. గోథిక్ స్టైల్ లోని ఈ చర్చ్ నిర్మాణం 1914లో ప్రారంభం కాగా 1924లో ముగిసింది. మెదక్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చర్చ్ ను చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి అయితే 96 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.

ఛాయా సోమేశ్వర దేవాలయం

ఛాయా సోమేశ్వర దేవాలయం

P.C: You Tube

తెలంగాణలోని నల్లొండ జిల్లాలో ఉన్న పానగల్ గ్రామంలో ఉంది. నల్గొండ బస్ స్టాండ్ నుంచి ఇక్కడకు 4కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు 104 కిలోమీటర్లు. దేవాలయంలోని ఒక స్తంభం నీడ ఉదయం నుంచి సాయంకాలం వరకూ మూలవిరాట్టైన శివలింగం పై పడుతూ ఉండటం వల్ల ఈ దేవాలయాలయానికి ఛాయా సోమేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది.

లతా సోమేశ్వర దేవాలయం

లతా సోమేశ్వర దేవాలయం

P.C: You Tube

ఇక్కడ ప్రధాన దైవం శివుడు. కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 186 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సోమశిల గ్రామంలో ఉన్న ఈ దేవాలయం వీకెండ్ లో సందర్శించడానికి బాగుంటుంది.

కొండగట్టు ఆంజనేయస్వామి

కొండగట్టు ఆంజనేయస్వామి

P.C: You Tube

చిన్నగుట్టు పై ఉన్న ఈ ఆంజనేయస్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారత దేశం మొత్తం ప్రాచూర్యం పొందింది. జగిత్యాల నుంచి 14 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 39 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

కాలేశ్వరం

కాలేశ్వరం

P.C: You Tube

ఇక్కడే ఒకే ఆలయంలో రెండు శివలింగాలను చూస్తాం. ఈ దేవాలయం సందర్శన వల్ల మ`త్యుభయం పోతుందని చెబుతారు. ఈ ఆలయ దర్శనం కోసం కరీంనగర్ నుంచి 134 కిలోమీటర్లు, హైదరాబద్ నుంచి 263 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

జేతప్రోలు

జేతప్రోలు

P.C: You Tube

ఇక్కడ మదన గోపాలస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ దేవాలయం కొల్లాపూర్ నుంచి కేవలం 14 కిలోమీటర్లు, వనపర్తి నుంచి 48 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 102 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 193 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఏడు పాయల వనదుర్గ భవాని దేవాలయం

ఏడు పాయల వనదుర్గ భవాని దేవాలయం

P.C: You Tube

మంజీర నది ఇక్కడ ఏడు పాయలుగా ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవం దుర్గామాత. వీకెండ్ గడపడానికి ఇక్కడ చాలా బాగుంటుంది. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు, మెదక్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఈ ఏడుపాయల వనదుర్గ భవాని దేవాలయం ఉంటుంది.

మేడారం

మేడారం

P.C: You Tube

వరంగల్ నుంచి 95 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్ల దూరంలో మేడారం ఉంటుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర దేశ వ్యాప్తంగా పేరుగాంచింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు ఇక్కడికి వస్తుంటారు.

కొలను పాక జైన దేవాలయం

కొలను పాక జైన దేవాలయం

P.C: You Tube

వరంగల్ నుంచి 83 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జైన దేవాలయం 2000 ఏళ్ల క్రితం నిర్మించినదని చెబుతారు. శ్వేతాంబర జైనులతో పాటు హిందువులు కూడా ఎక్కవ మంది ఇక్కడికి వస్తుంటారు.

నాంపల్లి గుట్ట

నాంపల్లి గుట్ట

P.C: You Tube

ఇక్కడ ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. వేముల వాడకు 4.5 కిలోమీటర్ల దూరంలోనే దూరంలోనే ఈ నాంపల్లి గుట్ట ఉంటుంది. కరీంనగర్ కు ఇక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం.

కోటి లింగాల

కోటి లింగాల

P.C: You Tube

గోదావరీ నదీతీరంలోని కోటిలింగాల ప్రముఖ శైవ క్షేత్రం. చారిత్రాత్మకంగా కూడా ప్రఖ్యాతి గాంచినది. దర్మపురి నుంచి 19 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 55 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 218 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కోటి లింగాలను చేరుకోవచ్చు.

 జైనాథ్ లోని నరసింహ స్వామి దేవాలయం

జైనాథ్ లోని నరసింహ స్వామి దేవాలయం

P.C: You Tube

ఆదిలాబాద్ నుంచి 22 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 327 కిలోమీటర్ల దూరంలోని ఈ దేవాలయంలో మూలవిరాట్టు నరసింహస్వామి. పల్లవ కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేవాలయంలోని శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతాయి.

చిలకూరి బాలాజీ

చిలకూరి బాలాజీ

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది కలియుగ దైవం వేంకటేశ్వరుడు. ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉన్న ఈ దేవాలయం నాంపల్లి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా గోల్గొండ నుంచి ఇక్కడకు 18 కిలోమీటర్లు. వీసా బాలాజీగా ఇక్కడి వేంకటేశ్వరుడికి పేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X