Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ శివలింగం నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది, అయినా పుణ్యక్షేత్రమే

ఇక్కడ శివలింగం నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది, అయినా పుణ్యక్షేత్రమే

కపోతేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. ఇందులో కొన్ని హిందూ మతంలోని శైవులు పూజిస్తే మరికొన్ని దేవాలయాలు వైష్ణవులకు అత్యంత పవిత్రమైనవి. ఈ నేపథ్యంలోనే ఆ దేవాలయాలకు సంబంధించి పురాణ కథలు కూడా ఆయా వర్గాలకు చెందినవై ఉంటాయి.

అయితే దేశంలో కొన్ని దేవాలయాలు, ఆ దేవాలయాలకు సంబంధించిన కథలు అటు హిందూ మతంలోనే కాకుండా ఇటు బౌద్ధమతంలో కూడా వినిపిస్తాయి. ఇటువంటి ఆలయం గురించే మనం ఈ కథనంలో తెలుసుకొంటాం. అంతేకాకుండా ఇక్కడ శివలింగం గోళాకారంలో కాకుండా మానవ శరీరంలోని మొండెం ఆకారంలో కనిపిస్తుంది.

మరోవైపు ఆ శివలింగం నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. ఇందుకు సంబంధించిన కథ మహాభారతంలోనే కాకుండా బౌద్ధమతంలో కూడా కనిపిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ శివలింగం గురించిన పూర్తి వివరాలు మీ కోసం

1. హిందుపురాణాలతోపాటు

1. హిందుపురాణాలతోపాటు

P.C: You Tube

చేజెర్లలోని శైవాలయాన్ని కపోతేశ్వరాలయం అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిందని స్థలపురాణం చెబుతుంది. శిబి చక్రవర్తికి కపోతానికి అంటే పావురానికి మధ్య ఉన్న సంబంధం గురించి అటు హిందుపురాణాల్లోనూ ఇటు బౌద్ధ గాథల్లో కథలు ఉన్నాయి.

2. ఇద్దరు తమ్ముళ్లు

2. ఇద్దరు తమ్ముళ్లు

P.C: You Tube

మహాభారతాన్ని అనుసరించి కాశ్మీర దేశాన్ని పరిపాలించే శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు ఉంటారు. శిబి చక్రవర్తి మొదటి తమ్ముడైన మేఘదాంబరుడు తీర్థయాత్రలకు బయలుదేరి చేజెర్ల పరిసర ప్రాంతాలకు వస్తాడు.

3. చితాగ్ని నుంచి

3. చితాగ్ని నుంచి

P.C: You Tube

అక్కడ ఒక కొండపై ప్రక`తి రమణీయతకు మురిసిపోయిన ఆయన తన పరివారంతో పాటు అక్కడున్న యోగులతో కలిసి శివుడి గురించి తపస్సు చేస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ కొండపైనే అతని శరీరాన్ని దహనం చేయగా ఆశ్చర్యంగా ఆ చితాగ్ని నుంచి ఒక అద్భుతమైన శివలింగం ఆవిర్భవించింది.

4. మేఘదంబేశ్వరలింగం

4. మేఘదంబేశ్వరలింగం

P.C: You Tube

దీంతో ఆ లింగాన్ని ఆ కొండపైన మేఘదాంబరుడు తపస్సు చేసిన గుహలో ప్రతిష్టించి దానిని మేఘదంబేశ్వరలింగమని పేర్కొంటూ పూజలు చేసేవారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలోని ప్రజలు తమకు వర్షాలు రాకపోతే ఈ లింగానికి పూజలు చేస్తారు.

5. వారి నమ్మకం అలా

5. వారి నమ్మకం అలా

P.C: You Tube

ఇలా చేసి ఇంటికి చేరేలోపు ఆ ప్రాంతంలో వర్షాలు పడుతాయని చెబుతారు. ఇదిలా ఉండగా అన్న మేఘదాంబరుడు చనిపోయిన విషయం అక్కడ లింగం ఏర్పడిన విషయం తెలుసుకొన్న జీమూత వాహనుడు కూడా చేరుంజర్ల చేరుకొంటాడు.

6. ఆయన కూడా

6. ఆయన కూడా

P.C: You Tube

అక్కడి ప్రక`తికి పరవశించి పోయి ఆయన కూడా తపస్సు చేసి శివైఖ్యం పొందాడు. ఆశ్చర్యంగా ఆయన ఆయన అంత్యక్రియలు జరిపే సమయంలో మరో లింగం ఉద్భవించింది. దీనికి కూడా పరిసర ప్రాంతాల వారు పూజలు చేయడం ప్రారంభించారు.

7. శిబి చక్రవర్తి నేరుగా

7. శిబి చక్రవర్తి నేరుగా

P.C: You Tube

ఈ విషయం తెలుసుకున్న శిబిచక్రవర్తి విషయాన్ని నేరుగా చూడాలన్న ఉద్దేశంతో తన పరివారంతో చేరుంజర్లకు చేరుకొంటాడు. అక్కడ తమ్ముళ్లు ఇద్దరూ శివైఖ్యం పొందన ప్రాంతాల్లో శివలింగాలు ఏర్పడం స్వయంగా చూస్తాడు.

8. వంద యాలగాలు చేయాలనుకొంటాడు

8. వంద యాలగాలు చేయాలనుకొంటాడు

P.C: You Tube

అటు పై ఆయన తాను కూడా వంద యాగాలు చేసి శివుడి క`పకు పాత్రుడు కావాలని భావిస్తాడు. ఈ క్రమంలో యాగాలను ప్రారంభించి తొంభై తొమ్మిది యాగాలను పూర్తి చేస్తాడు. మరో యాగం పూర్తి చేస్తే తన పదవి పోతుందని భయపడ్డ ఇంద్రుడు త్రిమూర్తుల శరణు వేడుతాడు.

9. త్రిమూర్తులు రూపు మార్చుకొని

9. త్రిమూర్తులు రూపు మార్చుకొని

P.C: You Tube

దీంతో శిభి చక్రవర్తి వందో యాగం పూర్తి కాకుండా చేయాలనుకొంటారు. ఇందుకోసం శివుడు ఒక వేటగాని రూపంలో బ్రహ్మ అతని బాణం లాగా మారుతాడు. ఇక విష్ణువు ఒక కపోతం అంటే పావురం వేషం ధరిస్తాడు.

10. ఒడిలో వాలి పోతుంది

10. ఒడిలో వాలి పోతుంది

P.C: You Tube

అటు పై వేటగాడు తరుమగా పావురం శిబి చక్రవర్తి ఒడిలో వాలిపోయి శరణు వేడుతుంది. శిబి ఆ పావురానికి అబయమిస్తాడు. అటు పై అక్కడికి వచ్చిన వేటగాడు ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను తన కుటుంబం పస్తులతో అలమటించాల్సి ఉంటుందని పేర్కొంటాడు.

11. తాసును ఒక వైపు ఉంచి

11. తాసును ఒక వైపు ఉంచి

P.C: You Tube

బాగా ఆలోచించిన శిబి చక్రవర్తి పావురం బరువుతో సమానంగా తన శరీరంలోని మాంసాన్ని ఇస్తానని చెబుతాడు. దీనికి వేటగాడు ఒప్పుకొంటాడు. దీంతో పావురాన్ని తాసులో ఒక వైపు ఉంచుతాడు.

12. మరోవైపు

12. మరోవైపు

P.C: You Tube

మరో వైపు తన శరీరం నుంచి తీసిన మాంసాన్ని ఆ తాసు మరోవై పు ఉంచుతాడు. అయితే ఎంత మాంస ఉంచినా పావురం బరువుకు సరిపోదు. దీంతో మొదట కాళ్లను అటు పై రెండు చేతులను నరికి ఆ త్రాసులో ఉంచుతాడు.

13. తలను నరికి

13. తలను నరికి

P.C: You Tube

అయినా పావురం బరువుకు సమానం కాదు. దీంతో చివరికి తన తలను నరకి త్రాసులో ఉంచుతారు. శిబి చక్రవర్తి త్యాగనిరతికి మెచ్చిన త్రిమూర్తులు అతని ఎదుట ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని ప్రసాదిస్తారు.

14. ఆ జలమే ఓగేరు

14. ఆ జలమే ఓగేరు

P.C: You Tube

అంతేకాకుండా కాళ్లు చేతులు లేని శిబి చక్రవర్తి మొండానికి దేవతలు ఆకాశగంగా జలంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేక జలం ఓంకారనదిగా చేరుంజర్లలో ప్రవహించింది. కాలక్రమంలో దాని పేరు ఓగేరుగా మార్పు చెందింది.

15. చక్రవర్తి మొండమే

15. చక్రవర్తి మొండమే

P.C: You Tube

ఇదే కథ బౌద్ధకథలో మనకు బుద్ధుని చరిత్రకు సంబంధించిన అవధాన శతకంలో శిబిజాతకము పేరుతో చోట్ల కనిపిస్తుంది. కాగా, చేతులు కాళ్లులేని శిబి చక్రవర్తి మొండమే శివలింగంగా మారిందని మహాభారత కథ చెబుతుంది.

16. అటు వంటి ఏర్పాటు ఉండదు

16. అటు వంటి ఏర్పాటు ఉండదు

P.C: You Tube

సాధారణంగా అన్ని శివాలయల్లో అభిషేక జలం బయటికి పోవడానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది. అయితే ఈ ఆలయంలో అటు వంటి ఏర్పాటు లేదు.

17. ఒక మొండెం వలే

17. ఒక మొండెం వలే

P.C: You Tube

కపోతేశ్వర లింగం చరురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది. ఈ లింగం గుండ్రంగా కాకుండా చేతులు కాళ్లు, తల లేని మనిషి మొండెం వలే కనిపిస్తుంది. శిబిచక్రవర్తి తన భుజాలను నరికి ఇచ్చినట్లు లింగానికి కుడి ఎడమల రెండు బిలాలు ఉంటాయి.

18. కుడి బిలంలో నీరు

18. కుడి బిలంలో నీరు

P.C: You Tube

అయితే ఈ రెండు బిలాలల్లో కుడి బిలంలో ఒక బిందె నీరు మాత్రమే పడుతుంది. ఎడమ బిలంలో ఎన్ని నీళ్లు పోసినా నిండదు. ఇదిలా ఉండగా కుడిబిలంలో పోసిన నీరు మరుసటి రోజున పచ్చిమాంసపు వాసన వస్తుంది.

19. అందుకే దీనిని శల్య లింగం

19. అందుకే దీనిని శల్య లింగం

P.C: You Tube

ఈ నీటిని ప్రతి రోజూ కుంచెకోలతో తీస్తారు. ఈ శివలింగం అక్కడక్కడ గుంటలు ఉండటం వల్ల దీనిని శల్యలింగం అని అంటారు. అంతేకాకుండా లింగానికి సహజ యజ్జోపవీతం కనిపిస్తుంది.

20.గుంటూరు జిల్లాలో

20.గుంటూరు జిల్లాలో

P.C: You Tube

ఈ చేజెర్లలోని కపోతేశ్వరాలయంలోనే తొలి తెలుగువారి గణపతి విగ్రహం కనిపిస్తుంది. చేజెర్ల గుంటూరు జిల్లా నకరికల్లు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణమైన నరసరావుపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X